PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/destroy-the-future-of-students-with-them9d7e70d6-4f54-4c64-a809-021fe169bbd4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/destroy-the-future-of-students-with-them9d7e70d6-4f54-4c64-a809-021fe169bbd4-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పేకాట వ్యవహారం కాస్త సంచలనంగా మారింది. రాజకీయంగా ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఏపీలో పేకాట మీద సిఎం జగన్ సీరియస్ గా ఉన్నా సరే గుడివాడ నియోజకవర్గంలో పేకాట నిర్వహణ సంచలనంగా మారింది. ఈ విషయంలో దోషులు ఎవరూ ఏంటీ అనేది స్పష్టత లేకపోయినా పోలీసులు మాత్రం కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కొడాలి నానీని టార్గెట్ గా చేసుకుని జనసేన, తెలుగుదేశం పార్టీలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. kodalinani,ycp, police,rummy,ap;kranthi;kranti;murali;makar sakranti;amarnath cave temple;jagan;andhra pradesh;janasena;telugu;sankranthi;police;festival;car;bike;minister;local language;janasena party;nandivadaగుడివాడలో పేకాట... పోలీసుల సంచలన ప్రకటన, మొత్తం ఆ వ్యక్తి ఆధ్వర్యంలోనేగుడివాడలో పేకాట... పోలీసుల సంచలన ప్రకటన, మొత్తం ఆ వ్యక్తి ఆధ్వర్యంలోనేkodalinani,ycp, police,rummy,ap;kranthi;kranti;murali;makar sakranti;amarnath cave temple;jagan;andhra pradesh;janasena;telugu;sankranthi;police;festival;car;bike;minister;local language;janasena party;nandivadaMon, 04 Jan 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పేకాట వ్యవహారం కాస్త సంచలనంగా మారింది. రాజకీయంగా ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఏపీలో పేకాట మీద సిఎం జగన్ సీరియస్ గా ఉన్నా సరే గుడివాడ నియోజకవర్గంలో పేకాట నిర్వహణ సంచలనంగా మారింది. ఈ విషయంలో దోషులు ఎవరూ ఏంటీ అనేది స్పష్టత లేకపోయినా పోలీసులు మాత్రం కొందరిని అదుపులోకి తీసుకున్నారు.  మంత్రి కొడాలి నానీని టార్గెట్ గా చేసుకుని జనసేన, తెలుగుదేశం పార్టీలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి.

రాజకీయంగా ఏపీలో బలంగా ఉన్న సిఎం జగన్ ని ఇలాంటి వ్యవహారాలూ చాలా ఇబ్బంది పెడుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక ఇదిలా ఉంటే పోలీసులు తాజాగా ఈ పేకాట శిబిరాల గురించి వివరాలు వెల్లడించారు. ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ... నందివాడ మండలం తమిరిశ లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చింది అని అన్నారు. ఎస్ ఈ బీ టీం, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు అని ఆయన పేర్కొన్నారు. 33 మందిని అరెస్టు చేసి, 28 కారులు, 13 బైక్ లు, 55 లక్షల 39 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నాం అని ఆయన పేర్కొన్నారు.

పొట్లూరి మురళి అనే వ్యక్తి ఆధ్వర్యంలో లో ఈ పేకాట శిబిరం జరుగుతుంది అని, విచారణ లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తేలుతుంది అని అన్నారు. రాజకీయ నాయకుల ఆరోపణలకు మేము స్పందించము అని ఆయన స్పష్టం చేసారు. మూడు గంటల పాటు జరిగిన ఈ దాడుల ప్రక్రియ మొత్తం వీడియో కూడా తీశాం అని అన్నారు. వారం రోజుల్లో‌ వంద పేకాట శిబిరాల పై దాడులు చేశాం అని అన్నారు. సంక్రాంతి పండుగ నేపధ్యంలో కూడా పేకాట, కోడి పందాలు ఆడితే చర్యలు తప్పవు అని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.


బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>