PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shani-mahadevappaae929585-3777-4ef9-9e07-ea7dfaf1fbf6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shani-mahadevappaae929585-3777-4ef9-9e07-ea7dfaf1fbf6-415x250-IndiaHerald.jpgసీనియర్ కన్నడ నటుడు శని మహదేవప్పకరోనాతో కన్నుమూశారు. శని మహదేవప్ప వయసు 88 సంవత్సరాలు. కొన్ని రోజులుగా శని మహదేవప్ప అనారోగ్యంతో బాధ పడుతున్నారు. వారం రోజుల కింద శని మహదేవప్పకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో అప్పట్నుంచి చెన్నై ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. జనవరి 3 రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో శని మహదేవప్ప తుదిశ్వాస విడిచారు.shani mahadevappa;kumaar;raaj kumar;anil music;puneet rajkumar;raj;industries;cinema;january;tamil;writer;producer;kannada;film industry;chennai;wife;producer1;letter;legendకరోనాతో ప్రముఖ నటుడు మృతికరోనాతో ప్రముఖ నటుడు మృతిshani mahadevappa;kumaar;raaj kumar;anil music;puneet rajkumar;raj;industries;cinema;january;tamil;writer;producer;kannada;film industry;chennai;wife;producer1;letter;legendMon, 04 Jan 2021 20:59:06 GMTసినిమా తారను బలి తీసుకుంది. 2021 తొలి  నాలుగు రోజుల్లోనే ముగ్గురు సినిమా వాళ్లు కరోనాకు బలైపోయారు. తమిళ నిర్మాత కే బాలు.. గేయ రచయిత అనిల్ కరోనాతో కన్నుమూసారు. తాజాగా సీనియర్ కన్నడ నటుడు శని మహదేవప్పకరోనాతో కన్నుమూశారు. శని మహదేవప్ప వయసు 88 సంవత్సరాలు. కొన్ని రోజులుగా శని మహదేవప్ప అనారోగ్యంతో బాధ పడుతున్నారు. వారం రోజుల కింద శని మహదేవప్పకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో అప్పట్నుంచి చెన్నై ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. జనవరి 3 రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో శని మహదేవప్ప తుదిశ్వాస విడిచారు.

        మహదేవప్ప మరణవార్త తెలిసి కన్నడ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. 1962లో కన్నడ సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు శని మహదేవప్ప. ఆ తర్వాత వందల సినిమాలు చేసాడు.స్టార్ హీరోలందరితోనూ ఆయన నటించారు.రాజ్ కుమార్ నుంచి పునీత్ రాజ్ కుమార్ వరకు అందరితోనూ కలిసి నటించాడు మహదేవప్ప. శని మహదేవప్పకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా వయసు భారంతో సినిమాలకు దూరంగా ఉన్నాడు మహదేవప్ప. అనారోగ్యంతో బాధ పడుతున్న సమయంలోనే కరోనా కూడా రావడంతో కోలుకోలేకపోయాడు శని మహదేవప్ప.

      అప్పీ, భక్త కుంబర, శ్రీనివాస కళ్యాణ, కవిరత్న కాళిదాసలతో పాటు ఎన్నో సినిమాల్లో మ‌హ‌దేవ‌ప్ప నటించాడు. ముఖ్యంగా లెజెండరీ నటుడు రాజ్ కుమార్ తో పాటు ఆయన కుటుంబంతో కూడా మహదేవప్పకు విడదీయరాని అనుబంధం ఉంది. అప్పట్లో రాజ్ కుమార్ నటించిన ప్రతీ సినిమాలోనూ కూడా కనిపించేవాడు. పునీత్‌ రాజ్‌కుమార్‌, కిచ్చ సుదీప్‌ లాంటి స్టార్ హీరోలు మహదేవప్ప మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లెజెండ్ సింగర్ బాలసుబ్రహ్మ‌ణ్యంతో పాటు ఎంతోమంది కళాకారులను ఇప్పటికే కరోనా పొట్టన పెట్టుకుంది.


వైసీపీకి ఆ సామాజిక వర్గం భారీ షాక్...?

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>