PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5de00a5e-2106-4357-88e4-9245774c2b2b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5de00a5e-2106-4357-88e4-9245774c2b2b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల్లో ఇప్పుడు అసహనం అనేది తీవ్ర స్థాయిలో ఉంది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. చాలా మంది కీలక నేతలకు పదవులు రావడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీలో గత ఎన్నికల్లో సీటు రాక ఇప్పుడు ఉండటానికి ఇబ్బంది పడుతున్న నేతలు ఎందరో వైసీపీలో ఉన్నారు. వారికి వైసీపీ అధిష్టానం కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తాజాగా ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యే ఒకరు పార్టీ మారడానికి రెడీ అయ్యారు. ఒంగోలు క్లౌపేటలో అనుచరులతో సమావేశం అయిన మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు... పార్టీ మారడానycp;andhra pradesh;2019;district;mla;tdp;prakasam district;ycp;prakasm;partyవైసీపీ మాజీ ఎమ్మెల్యేకి టీడీపీనే బాగుందా...?వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి టీడీపీనే బాగుందా...?ycp;andhra pradesh;2019;district;mla;tdp;prakasam district;ycp;prakasm;partyMon, 04 Jan 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల్లో ఇప్పుడు అసహనం అనేది తీవ్ర స్థాయిలో ఉంది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. చాలా మంది కీలక నేతలకు పదవులు రావడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీలో గత ఎన్నికల్లో సీటు రాక ఇప్పుడు ఉండటానికి ఇబ్బంది పడుతున్న నేతలు ఎందరో వైసీపీలో ఉన్నారు. వారికి వైసీపీ అధిష్టానం కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తాజాగా ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యే ఒకరు పార్టీ మారడానికి రెడీ అయ్యారు. ఒంగోలు క్లౌపేటలో అనుచరులతో సమావేశం అయిన మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు... పార్టీ మారడానికి రెడీ అయ్యారు.

వైసీపీ లో సముచిత స్థానం దక్కడం లేదని గత కొంత కాలంగా డేవిడ్ రాజు మనస్తాపంగా ఉన్నారని అంటున్నారు. 2014 లో ఎర్రగొండపాలెం నుండి వైసీపీ ఎమ్మెల్యే గా గెలిచి టీడీపీ లో చేరిన డేవిడ్ రాజు.... 2019 ఎన్నికల సమయంలో టీడీపీ  టిక్కెట్టు దక్కకపోవడంతో వైసీపీలో చేరారు. పొలిటికల్ ఫ్యూచర్ పై అనుచరులతో సమావేశం నిర్వహించిన డేవిడ్ రాజు... పార్టీ మారడానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎర్రగొండపాలెం టీడీపీ కార్యకర్తలు పార్టీలోకి రమ్మని పిలుస్తున్నారు అని అన్నారు.

చంద్రబాబు ఒప్పుకుంటే టీడీపీలో చేరడానికి సిద్దంగా ఉన్నా అని అన్నారు. ఇక ఆయన పార్టీ మారడానికి రెడీ అవ్వడంతో వైసీపీ నేతలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆయనకు పార్టీలో ప్రాధాన్యత లేదు అనే వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మాత్రం స్పందించడం లేదు. రాజకీయంగా వైసీపీలో భిన్నమైన పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. ఇప్పుడు ఆయన పార్టీ మారితే మాత్రం అది కచ్చితంగా హాట్ టాపిక్ అవుతుంది. టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు వెళ్తుంటే ఆయన మాత్రం టీడీపీలోకి రావడానికి ఆసక్తి చూపించడం గమనార్హం.


ఆ హీరోను ప్రేమించాను..పెళ్ళయిపోతుంటే గుండె పగిలేలా ఏడ్చాను : మీనా

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...

కరోనా వల్ల మెదడులో దెబ్బతింటున్న రక్తనాళాలు.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

బాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>