PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-property-tax-onlt-50-rupees-for-3-laks-houses5c4f8430-1f5f-4792-9cc9-743c969e88a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-property-tax-onlt-50-rupees-for-3-laks-houses5c4f8430-1f5f-4792-9cc9-743c969e88a7-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగే ముంపు నివారణకై చేపట్టాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ జోనల్ కమీషనర్లు, ఇంజనీర్లు, జలమండలి, నీటిపారుదల శాఖ, హెచ్ఎండీఏ, కంటోన్మెంట్, నాలా డెవలప్మెంట్ విభాగం అధికారులు హాజరయ్యారు. ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ... రానున్నవర్షా కాలంలోపు ఓఆర్ఆర్ పghmc,hyderabad,ts;lokesh;allu aravind;amala akkineni;kumaar;hyderabad;pond;director;lokesh kanagarajహైదరాబాద్ వరదలు... జీహెచ్ఎంసి అలెర్ట్... కీలక సమావేశంహైదరాబాద్ వరదలు... జీహెచ్ఎంసి అలెర్ట్... కీలక సమావేశంghmc,hyderabad,ts;lokesh;allu aravind;amala akkineni;kumaar;hyderabad;pond;director;lokesh kanagarajMon, 04 Jan 2021 16:50:00 GMTహైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగే ముంపు నివారణకై చేపట్టాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ జోనల్ కమీషనర్లు, ఇంజనీర్లు, జలమండలి, నీటిపారుదల శాఖ, హెచ్ఎండీఏ, కంటోన్మెంట్, నాలా డెవలప్మెంట్ విభాగం అధికారులు హాజరయ్యారు. ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ...

రానున్నవర్షా కాలంలోపు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల వల్ల ముంపుకు గురయ్యే ప్రాంతాలను తిరిగి ముంపుకు గురికాకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకై జోన్ ల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి అని ఆయన ఆదేశాలు జారీ చేసారు. నగరం లోని అపార్టుమెంట్లలో సెల్లార్ ల నుండి నీరు ఎత్తిపోయడానికి వీలుగా విధిగా మోటార్ పంపులు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలి అని ఆయన ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి ముంపుకు కారణమయ్యే వాటిని వెంటనే తొలగించాలి అని ఆయన ఆదేశించారు.

 జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ...  జీహెచ్ఎంసి పరిధిలో ఉన్న 185  చెరువులు, కుంటలకు తూములు, మత్తడిలా పునర్నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి అని ఆదేశాలు ఇచ్చారు. స్వర్ల్ప, మధ్య, దీర్ఘ కాలిక కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలి అని ఆయన సూచించారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ... ఇటీవలి భారీ వర్షాలకు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో  ఉన్న 26 మున్సిపాలిటీల్లో 315 ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి అని పేర్కొన్నారు. 573 నాలా ఆక్రమణలు, 247 శిఖం ఆక్రమణలు, శిఖం లలో 4606 ఆక్రమణలు ఉన్నట్టుగా గుర్తించాం అని అన్నారు. కాగా హైదరాబాద్ లో వరదలు రాజకీయంగా సంచలనం అయ్యాయి. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.


గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>