PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/door-delivery-from-february-1-easy-to-guarantee1a21af0b-3e60-4cfa-9428-e0bf55a9d61c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/door-delivery-from-february-1-easy-to-guarantee1a21af0b-3e60-4cfa-9428-e0bf55a9d61c-415x250-IndiaHerald.jpgఎట్టకేలకు రేషన్ బియ్యం సామాన్యులకు ఇంటి వద్దకే వచ్చేందుకు మార్గం సిద్ధమైంది. ఎన్నో రోజులుగా ప్రజలను ఆకర్షిస్తున్న ఈ పథకం చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చింది. సీఎం జగన్ నవరత్నాలలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి మొదటి నుండి ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 1 నుంచి రేషన్ వస్తువులను డోర్ డెలివరీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకానికి సంబంధించి ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంlatest news;nani;kodali nani;kranthi;kranti;makar sakranti;jagan;sankranthi;chief minister;february;ministerఫిబ్రవరి 1 నుండి డోర్ డెలివరీ.. ఈసారైనా గ్యారెంటేనా..!!ఫిబ్రవరి 1 నుండి డోర్ డెలివరీ.. ఈసారైనా గ్యారెంటేనా..!!latest news;nani;kodali nani;kranthi;kranti;makar sakranti;jagan;sankranthi;chief minister;february;ministerMon, 04 Jan 2021 19:09:06 GMTజగన్ నవరత్నాలలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి మొదటి నుండి ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 1 నుంచి రేషన్ వస్తువులను డోర్ డెలివరీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకానికి సంబంధించి ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌తో పాటు, పలు శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.ధాన్యం సేకరించిన తర్వాత గతంలో చెప్పినట్లుగా 15 రోజుల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి ఈ సంక్రాంతి నాటికి రైతుల బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన బిల్లులు పెండింగులో పెట్టకూడదని హెచ్చరించారు.ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ కోసం సిద్ధం చేసిన ప్రత్యేక వాహనాలు ఈ నెల 3వ వారంలో ప్రారంభించడానికి సీఎం నిర్ణయించారు.

అదే రోజున 10 కిలోల రైస్‌ బ్యాగ్స్‌ ఆవిష్కరణ చేయనున్నట్టు తెలిపారు. వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ జరగనుండడంతో ఇందు కోసం 9260 మొబైల్‌ యూనిట్లు. అదే సంఖ్యలో అధునాతన తూకం యంత్రాలను కూడా తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా డీలర్ వ్యవస్థ ఉంటుందా..ఉండదా.. అనేదానిపై స్పష్టత రాలేదు. మరి రేషన్ పంపిణీ వాలెంటిర్ ఆధ్వర్యంలో జరగనుందని తెలుస్తుంది.


వైసీపీకి ఆ సామాజిక వర్గం భారీ షాక్...?

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>