Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/online-recruitment-for-terrorist09e51383-91bc-4bb5-af96-95dd37761fd2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/online-recruitment-for-terrorist09e51383-91bc-4bb5-af96-95dd37761fd2-415x250-IndiaHerald.jpgఉద్యోగులను మాత్రమే ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో రిక్రూట్‌ చేసుకుంటారని మనకు తెలుసు.. కానీ ఉగ్రవాదులను కూడా ఆన్‌లైన్‌లో రిక్రూట్ చేసుకుంటారని తెలుసా..? కానీ కాశ్మీర్‌లో ఇలాంటి రిక్రూట్‌మెంట్‌లు కొనసాగుతున్నాయి. కుటిల పాకిస్తాన్ కాశ్మీర్‌లోని ఐఎస్‌ఐతో పాటు ఉగ్రవాద సానుభూతి పరులను రహస్యంగా ఆన్‌లైన్‌లో చేర్చుకుంటోంది. పాక్ నిర్వహిస్తున్న ఈ దుర్మర్గాన్ని..online terrorists;abbas;ahmed;delhi;pakistan;youtube;you tube;letter;jaish e mohammedఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్online terrorists;abbas;ahmed;delhi;pakistan;youtube;you tube;letter;jaish e mohammedMon, 04 Jan 2021 10:46:00 GMTన్యూఢిల్లీ: ఉద్యోగులను మాత్రమే ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో రిక్రూట్‌ చేసుకుంటారని మనకు తెలుసు.. కానీ ఉగ్రవాదులను కూడా ఆన్‌లైన్‌లో రిక్రూట్ చేసుకుంటారని తెలుసా..? కానీ కాశ్మీర్‌లో ఇలాంటి రిక్రూట్‌మెంట్‌లు కొనసాగుతున్నాయి. కుటిల పాకిస్తాన్ కాశ్మీర్‌లోని ఐఎస్‌ఐతో పాటు ఉగ్రవాద సానుభూతి పరులను రహస్యంగా ఆన్‌లైన్‌లో చేర్చుకుంటోంది. పాక్ నిర్వహిస్తున్న ఈ దుర్మర్గాన్ని భారత నిఘా దళాలు గుర్తించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద సానుభూతిపరులను, ముఖ్యంగా యువతను తమవైపు లాక్కునేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోందని, దానికోసం అసత్యపు వీడియోలను వినియోగించి వారి మనసులను విషయంతో నింపేందుకు ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనికోసం సైబర్ నెట్‌వర్క్స్, మొబైల్ అప్లికేషన్లను వినియోగిస్తున్నాయని, కశ్మీరీల్లో భావోద్వేగాలను రేకెత్తిస్తూ అనేకమందిని తమలో చేర్చుకునేందుకు యత్నిస్తోందని భారత ఇంటలిజెన్స్ విభాగం కనిపెట్టింది.

గతేడాది డిసెంబరులో రాష్ట్రీయ రైఫిల్ ముందు లొంగిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు తవార్ వాఘే, అమీర్ అహ్మద్ మీర్‌ ద్వారా భద్రతా దళాలకు అనేక కీలక విషయాలు తెలిశాయి. కశ్మీరులో ఉగ్రవాద చేరికల వ్యవస్థ గురించి విస్తుగొలిపే విషయాలు బయటకొచ్చాయి. లొంగిపోయిన ఉగ్రవాదులు కూడా తాము ఫేస్‌బుక్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థను సంప్రదించామని చెప్పడం, తాము ఉగ్రవాద సంస్థలో చేరాక మహ్మద్ అబ్బాస్, ఖలీద్ అనే కోడ్ రిక్రూటర్లకు అప్పగించారని, వారు యూట్యూబ్ సహా పబ్లిక్ ప్లాట్ ఫాంలను ఉపయోగించి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చారని సైన్యానికి చెప్పారు. పాక్ దేశానికి చెందిన బుర్హాన్ హమ్దా నుంచి తమకు ఆదేశాలు అందాయని ఉగ్రవాదులు తెలిపారు. దీంతో ఆ వైపు దృష్టి సారించింది ఇంటలిజెన్స్ విభాగం.

ఇదిలా ఉంటే సోపోర్‌లోని ఖవాజా గిల్ గట్‌కు చెందిన ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి అమీర్ సిరాజ్ కూడా ఆన్‌లైన్‌లో ఉగ్రవాదిగా నియమితుడయ్యాడని వారు తెలిపారు. గత నెలలో ఉత్తర కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ సందర్భంగా సిరాజ్‌ హతమయ్యాడు. సిరాజ్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో ఆన్‌లైన్‌లో చేరినట్లు భద్రతాదళాల దర్యాప్తులో తేలింది. సిరాజ్ మాత్రమే కాకుండా ఇంకా అనేకమంది ఆన్‌లైన్ ద్వారానే రిక్రూట్ అవుతున్నారని తెలియడంతో.. సైబర్, మొబైల్ యాప్‌లపై నిఘా విభాగం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌ ద్వారా ఉగ్రవాద సంస్థల్లో చేరిన 40 మంది సానుభూతిపరులను అరెస్టు చేసింది. వారి ద్వారా అనేక విషయాలను రాబట్టింది.


వారం రోజుల్లో కొవిడ్ వ్యాక్సిన్..!

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>