PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpgకేసీఆర్‌కు సానుకూల వాతావ‌ర‌ణం అయితే క‌న‌ప‌డ‌డం లేదు. వ‌రుస‌గా ఎన్నిక‌ల్లో ఓట‌ములు, సొంత పార్టీ నేత‌ల అసంతృప్తులు ఎక్కువ కావ‌డం, కేసీఆర్ కుటుంబ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హాలు ఇవ‌న్నీ గులాబీలో గుబులుకు కార‌ణంగా క‌నిపిస్తోంది. దీనికి తోడు తెలంగాణ‌లో బండి సంజ‌య్ బీజేపీ అధ్య‌క్షుడు అయ్యాక దూకుడు పెంచేశారు. ఆయ‌న గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఏకంగా 30 మంది త‌మ‌తో ట‌చ్లో ఉన్నార‌ని బాంబు పేల్చిన మ‌రుస‌టి రోజే భారీ సంఖ్య‌లో టీఆర్ఎస్ నేత‌లు కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మtrs;kcr;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;komatireddy rajgopal reddy;రాజీనామా;nizamabad;mla;minister;letter;local language;reddy;dookudu;partyగులాబీలో గుబులు మొద‌లైంది... కారు పార్టీ టైరుకు పంక్చ‌ర్ వేసేది వీళ్లే..!గులాబీలో గుబులు మొద‌లైంది... కారు పార్టీ టైరుకు పంక్చ‌ర్ వేసేది వీళ్లే..!trs;kcr;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;komatireddy rajgopal reddy;రాజీనామా;nizamabad;mla;minister;letter;local language;reddy;dookudu;partyMon, 04 Jan 2021 09:55:26 GMTతెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌తికూల ప‌రిస్ధితులు ఎక్కువ అవుతున్నాయి. దుబ్బాక దెబ్బ త‌ర్వాత గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ అధికారానికి దూరం కావ‌డంతో పాటు బీజేపీ దూకుడు ఆ పార్టీని తెగ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌మ‌కు తిరుగులేద‌ని బీరాలు పోయిన టీఆర్ఎస్ నేత‌ల్లో ఇప్పుడు గుబులు మొద‌లైంద‌న్న‌ది వాస్త‌వం. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీపై ఉన్న వ్య‌తిరేక‌త‌కు తోడు, పార్టీలో వార‌స‌త్వ స‌మ‌స్య తీవ్రం అయితే అది పార్టీ నిట్ట నిలువునా చీలిపోవ‌డానికి కార‌ణం అవుతుంద‌న్న ఆందోళ‌న కూడా టీఆర్ఎస్ నేత‌ల‌ను వేధిస్తోంది.

ఓ వైపు తెలంగాణ‌లో బీజేపీ చూపిస్తోన్న దూకుడుతో కారు పార్టీకి ఎక్క‌డిక‌క్క‌డ బ్రేకులు ప‌డుతున్నాయి. వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్‌కు సానుకూల వాతావ‌ర‌ణం అయితే క‌న‌ప‌డ‌డం లేదు. వ‌రుస‌గా ఎన్నిక‌ల్లో ఓట‌ములు, సొంత పార్టీ నేత‌ల అసంతృప్తులు ఎక్కువ కావ‌డం, కేసీఆర్ కుటుంబ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హాలు ఇవ‌న్నీ గులాబీలో గుబులుకు కార‌ణంగా క‌నిపిస్తోంది.

దీనికి తోడు తెలంగాణ‌లో బండి సంజ‌య్ బీజేపీ అధ్య‌క్షుడు అయ్యాక దూకుడు పెంచేశారు. ఆయ‌న గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఏకంగా 30 మంది త‌మ‌తో ట‌చ్లో ఉన్నార‌ని బాంబు పేల్చిన మ‌రుస‌టి రోజే భారీ సంఖ్య‌లో టీఆర్ఎస్ నేత‌లు కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజాగా కాంగ్రెస్‌కు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అటు టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్ సైతం కాషాయ కండువా కప్పుకున్నారు.

ఇక వ‌రంగ‌ల్‌లో టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ కార్పొరేట‌ర్ కోర‌బోయిన సాంబ‌య్య పార్టీకి రాజీనామా చేశారు. ఆయ‌న త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌నున్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ఎన్నిక‌లు ఉన్న వేళ ఆయ‌న పార్టీ మార‌డం అంటే కంచుకోట‌లో ఇది కారు పార్టీకి షాకే. అటు ఖ‌మ్మంలోనూ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పువ్వాడ అజ‌య్‌పై అసంతృప్తితో ప‌లువురు నేత‌లు బీజేపీలో చేరారు. ఇక ఉత్త‌ర తెలంగాణ‌లో నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ లాంటి చోట్ల ద్వితీయ శ్రేణి నాయ‌కులు కూడా భారీ ఎత్తున బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే కారు టైరుకు పంక్చ‌ర్ ప‌డే రోజులు త్వ‌ర‌లోనే ఉన్నాయ‌న్న‌ది క్లీయ‌ర్‌గా తెలుస్తోంది. 


ఆ హీరోను ప్రేమించాను..పెళ్ళయిపోతుంటే గుండె పగిలేలా ఏడ్చాను : మీనా

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...

కరోనా వల్ల మెదడులో దెబ్బతింటున్న రక్తనాళాలు.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

బాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>