PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona52025215-9cbe-4663-a2ca-0ff27209cba2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona52025215-9cbe-4663-a2ca-0ff27209cba2-415x250-IndiaHerald.jpgకరోనా కడు ప్రమాదకరమైనది. ఆ విషయంలో ఎవరికీ ఎటువంటి డౌట్ అవసరం లేదు. గత ఏడాదిగా ఈ భూగోళం మీద ఉన్న ప్రతీ మానవుడి స్వీయ అనుభవం కరోనాతో చెలగాటం. మరి కరోనాను కట్టడి చేసేందుకు ఇపుడు వరసపెట్టి వ్యాక్సిన్లు రంగం లోకి వస్తున్నాయి. వీటి పంపిణీకి కూడా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా అసలు భయం బెంగా, బెదురూ ఇంకా జనాల్లో అలాగే ఉందిపుడు. carona;abhishek;rakshita;india;congress;vegetable market;qualification;coronavirusకరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?carona;abhishek;rakshita;india;congress;vegetable market;qualification;coronavirusMon, 04 Jan 2021 10:30:00 GMT
అదేంటి అంటే కరోనా వైరస్ కట్టడి విషయంలో వస్తున్న వ్యాక్సిన్ లలో భద్రత ఎంత అన్నదే ఇపుడు ప్రధానమైన పాయింట్. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ సంగతి పక్కన పెడితే వీటి వల్ల కొత్త చిక్కులు ముప్పు ఏమైనా వస్తుందా అన్నది కూడా జనాల్లో ఆలోచన పెంచుతోంది. అదే సమయంలో కొన్ని రకాల కరోనా వ్యాక్సినులు ఇంకా క్లినికల్ దశను కూడా పూర్తి చేయకుండానే మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది.  ఒక టీకా విషయంలో కరెక్ట్ గా ఉంది అని చెప్పడానికి దానికి దశల వారీగా పరీక్షలు ఉంటాయి.

అలా అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న మీదటనే దానికి మార్కెట్ లోకి తెచ్చేందుకు అనుమతి ఇస్తారు. ఇపుడు చూస్తూంటే కేవలం మూడు వ్యాక్సిన్లు మాత్రమే ఆ విధంగా అర్హత సాధించాయని సీరం ఇని స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ పూనావాలియా అంటున్నారు. వాటి పేర్లను కూడా ఆయన చెబుతున్నారు. ఒకటి ఫైజర్, రెండవది మోడెర్నా టీకా. మూడవది ఆస్కా ఫర్డ్ అస్ట్రా జెనీకా. ఈ మూడు టీకాలు మాత్రమే అన్ని దశలను దాటి అన్ని అనుమతులు సంపాదించుకున్నాయని ఆయన కుండబద్దలు కొడుతున్నారు.

మరో వైపు కొన్ని క్లినికల్ ట్రయల్స్ ని ఇంకా దాటకుండానే ఎందుకు మార్కెట్ లోకి రావాలని ఉత్సాహపడుతున్నదాని మీద కాంగ్రెస్ నేతలు శశిధరూర్, అభిషేక్ సింగ్ లాంటి వారు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా అని వారు నిలదీస్తున్నారు. కరోనాను నియంత్రించడానికి వ్యాక్సిన్ అన్నది చాలా ముఖ్య‌మైనదే. అదే సమయంలో వ్యాక్సిన్ కూడా సురక్షితం అయినది ఉండాలి కదా అని వారు అడుగుతున్న‌ పాయింట్ కూడా కరెక్టే మరి. ఈ విషయంలో ప్రభుత్వాల నుంచే పక్కా క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా జనాలలో ఇపుడు కరోనా తో పాటుగా వ్యాక్సిన్ మీద కూడా భయాలు ఉన్నాయంటే ఆశ్చర్యం లేదుగా.




ఆ హీరోను ప్రేమించాను..పెళ్ళయిపోతుంటే గుండె పగిలేలా ఏడ్చాను : మీనా

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...

కరోనా వల్ల మెదడులో దెబ్బతింటున్న రక్తనాళాలు.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

బాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?

రిజిస్ట్రేషన్ లేదు.. ఇన్వాయిస్ లేదు.. రూ.830 కోట్ల జీఎస్‌టీ ఎగవేశారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>