PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral8d5bd03a-ce68-46ac-b222-039d7095296d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viral8d5bd03a-ce68-46ac-b222-039d7095296d-415x250-IndiaHerald.jpgకాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లోకి ఎక్కారు. టిడిపి ప్రభుత్వ హయాంలో కాపులను బీసీల్లో చేర్చాలని.. ఎన్నికలకు ముందు చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చుతాను అంటూ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి అని ముద్రగడ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించి చాలాకాలం పాటు నిరసన కార్యక్రమాలు చేశారు. చివరకు అది కార్యరూపం దాల్చకుండానే ఆ ఉద్యమం నీరుగారిపోయింది. చివరకు విసుగుచెంది ఆ ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటన చేసేసారు. ఇక అక్కడి నుంచి ముద్రగడ పెద్దగా యాక్టివ్ గా కనmudragada padmanabam political party kapuoment;bharatiya janata party;godavari river;rajya sabha;district;police;minister;police station;letter;tdp;traffic police;mudragada padmanabham;partyముద్రగడ కొత్త పార్టీ అంటూ ఫ్లెక్సీ లు ? ఏంటి సంగతి ?ముద్రగడ కొత్త పార్టీ అంటూ ఫ్లెక్సీ లు ? ఏంటి సంగతి ?mudragada padmanabam political party kapuoment;bharatiya janata party;godavari river;rajya sabha;district;police;minister;police station;letter;tdp;traffic police;mudragada padmanabham;partyMon, 04 Jan 2021 05:00:00 GMTకాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లోకి ఎక్కారు. టిడిపి ప్రభుత్వ హయాంలో కాపులను బీసీల్లో చేర్చాలని.. ఎన్నికలకు ముందు చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చుతాను అంటూ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి అని  ముద్రగడ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించి చాలాకాలం పాటు నిరసన కార్యక్రమాలు చేశారు. చివరకు అది కార్యరూపం దాల్చకుండానే ఆ ఉద్యమం నీరుగారిపోయింది. చివరకు విసుగుచెంది ఆ ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటన చేసేసారు. ఇక అక్కడి నుంచి ముద్రగడ పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఆయన వివిధ పార్టీల్లో చేరబోతున్నారు అంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగినా, ఆయన ఆయన మాత్రం స్పందించలేదు. 



త్వరలోనే ముద్రగడ బిజెపి లోకి వెళ్తారని, ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నారు అంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగినా, అదంత గాసిప్ మాత్రమే అనేది తేలిపోయింది .ఇక ఆయనను చేర్చుకునేందుకు అన్ని పార్టీలు తెరవెనుక ప్రయత్నాలు గట్టిగానే చేస్తూనే వస్తున్నాయి. ఇదిలా ఉండగా మళ్లీ ముద్రగడ ఆధ్వర్యంలోని కాపు ఉద్యమం చేపట్టాలంటూ కొంతమంది హడావుడి చేస్తున్నా, మళ్లీ సామాజికంగా, ఆర్థికంగా నష్టపోయాయనని, తాను ఇక ఉద్యమం, రాజకీయాలకు దూరం అన్నట్టుగానే ఆయన సంకేతాలు విచ్చేసారు. ఇదిలా ఉంటే తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ముద్రగడ్డ పద్మనాభం కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో కలకలం రేగింది.



 దీనిపై ముద్రగడ సీరియస్ అయ్యారు. తన ప్రమేయం లేకుండా ఈ ఫ్లెక్సీల ఏర్పాటు చేయడం తన గౌరవానికి భంగం కలిగించేందుకే  ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని  కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది కాకినాడలో కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పడంతో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా రాజకీయాలకు కాస్త దూరంగా ఉండేందుకు ముద్రగడ ప్రయత్నిస్తున్నా, ఆయన ను మాత్రం ఈ రాజకీయాలు వదిలిపెట్టేలా కనిపించడం లేదు.


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ టీడీపీ ఎమ్మెల్యేని విజయసాయి టార్గెట్ చేశారా?

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>