PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/world-countries-looking-towards-india4e4aca5e-db36-4bce-a836-f3f4a342cd1d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/world-countries-looking-towards-india4e4aca5e-db36-4bce-a836-f3f4a342cd1d-415x250-IndiaHerald.jpgభారత్‌ బయోటెక్‌ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదముద్ర వేసింది. అలాగే కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు కూడా పచ్చజెండా ఊపింది. కొవాగ్జిన్ టీకా ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ నవంబర్‌లో ప్రారంభం అయ్యాయి. 26 వేల మందిపై ఈ టీకా ప్రయోగాలు చేయనున్నారు. ఇప్పటికే 23 వేల మందికి టీకా వేశారు. బీఎస్‌ఎల్‌-3 ప్రమాణాలు కలిగిన ల్యాబ్‌లో ఈ టీకాను ఉత్పత్తి చేయనున్నారు. మిగతా టీకాల కంటే కొవాగ్జిన్‌ ప్రత్యేకమైనది. దీర్ఘకాలంపాటు వ్యాధి నిరోధకత ఇవ్వగలుగుతుంది. ఈ వ్యాక్సిన్లకు ఆమోదం తెలుworld countries looking towards india;india;brazil;american samoaభారత్ వైపు చూస్తున్న ప్రపంచ దేశాలు..!భారత్ వైపు చూస్తున్న ప్రపంచ దేశాలు..!world countries looking towards india;india;brazil;american samoaMon, 04 Jan 2021 20:36:16 GMTభారత్ వైపు చూస్తున్నాయి. భారత్ బయోటిక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ డోసుల కోసం చాలా దేశాలు భారత్ ను ఆశ్రయిస్తున్నాయి. భారత్‌లోనూ అత్యవసర వినియోగం కింద రెండు వ్యాక్సిన్‌లు అనుమతి పొందాయి. దీంతో మన దేశంపై ప్రపంచదేశాల చూపు పడింది.

భారత్‌ బయోటెక్‌ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదముద్ర వేసింది. అలాగే కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు కూడా పచ్చజెండా ఊపింది. కొవాగ్జిన్ టీకా ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ నవంబర్‌లో ప్రారంభం అయ్యాయి. 26 వేల మందిపై ఈ టీకా ప్రయోగాలు చేయనున్నారు. ఇప్పటికే 23 వేల మందికి టీకా వేశారు. బీఎస్‌ఎల్‌-3 ప్రమాణాలు కలిగిన ల్యాబ్‌లో ఈ టీకాను ఉత్పత్తి చేయనున్నారు. మిగతా టీకాల కంటే కొవాగ్జిన్‌ ప్రత్యేకమైనది. దీర్ఘకాలంపాటు వ్యాధి నిరోధకత ఇవ్వగలుగుతుంది. ఈ వ్యాక్సిన్లకు ఆమోదం తెలుపడాన్ని డబ్ల్యూహెచ్‌వో కూడా స్వాగతించింది. దీంతో భారత్ వ్యాక్సిన్ల  కోసం ప్రపంచ దేశాలు అన్నీ ఎదురు చూస్తున్నాయి.

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ డోసుల కోసం బ్రెజిల్‌ సంప్రదింపులు జరుపుతోంది. ప్రయోగదశలో ఉన్న ఈ టీకా‌ వివరాలను తెలుసుకునేందుకు వివిధ దేశాల దౌత్యవేత్తలు కూడా హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీని ఇటీవలే సందర్శించారు.

బ్రెజిల్‌కు చెందిన ప్రైవేటు సంస్థ బ్రెజిలియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ వ్యాక్సిన్‌ క్లినిక్స్‌... కొవాగ్జిన్‌ డోసుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారత కంపెనీతో ఇప్పటికే ఎంవోయూ కుదుర్చుకుంది. అయితే దీనికి బ్రెజిల్‌ ఆరోగ్య నియంత్రణ సంస్థ అన్విసా తుది అనుమతి ఇవ్వాల్సి ఉంది.

అమెరికా తర్వాత అత్యధిక కరోనా మరణాలు బ్రెజిల్‌లోనే చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచంలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో బ్రెజిల్‌ మూడో స్థానంలో, కొవిడ్‌ మరణాల్లో రెండో స్థానంలో ఉంది. అయినా అక్కడ వ్యాక్సిన్‌ పంపిణీ జరగడం లేదు. దీంతో  ప్రజల్లో అసహనం పెరిగింది. అందువల్ల బ్రెజిల్ లోని కొన్ని రాష్ట్రాలు భారత్  వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయి.  





వైసీపీకి ఆ సామాజిక వర్గం భారీ షాక్...?

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>