MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thaman63d9c903-7784-446e-984e-54c938ff507b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thaman63d9c903-7784-446e-984e-54c938ff507b-415x250-IndiaHerald.jpgసంగీత తరంగం తమన్ రోజులు వచ్చేశాయి. ఎపుడో కిక్ మూవీ ద్వారా తన సంగీతాన్ని లోకానికి పరిచయం చేసిన తమన్ ఇంతకాలం నంబర్ టూ రేసులోనే ఉండేవాడు. గత రెండు మూడేళ్ళుగా సీన్ మొత్తం మారింది. ఇపుడు తమన్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. ఒక్క తెలుగులోనే కాదు, సౌతిండియాలోనూ తమన్ హవా అలా కొనసాగుతోంది. ప్రత్యేకించి చెప్పాలంటే ఈ ఏడాది నాదీ అంటున్నాడు తమన్. thaman;pawan;mahesh;boyapati srinu;geetha;kalyan;prasad;thaman s;cinema;sangeetha;telugu;director;tsunami;hero;kickతమన్ మ్యూజిక్ సునామీ...సౌంతిండియాలోనే కొత్త రికార్డ్ ?తమన్ మ్యూజిక్ సునామీ...సౌంతిండియాలోనే కొత్త రికార్డ్ ?thaman;pawan;mahesh;boyapati srinu;geetha;kalyan;prasad;thaman s;cinema;sangeetha;telugu;director;tsunami;hero;kickMon, 04 Jan 2021 12:00:00 GMTసంగీత తరంగం తమన్ రోజులు వచ్చేశాయి. ఎపుడో కిక్ మూవీ ద్వారా తన సంగీతాన్ని లోకానికి పరిచయం చేసిన తమన్ ఇంతకాలం నంబర్ టూ రేసులోనే ఉండేవాడు. గత రెండు మూడేళ్ళుగా సీన్ మొత్తం మారింది. ఇపుడు తమన్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. ఒక్క తెలుగులోనే కాదు, సౌతిండియాలోనూ తమన్ హవా అలా కొనసాగుతోంది. ప్రత్యేకించి చెప్పాలంటే ఈ ఏడాది నాదీ అంటున్నాడు తమన్.

ఆయన సినిమాలు ఈ ఏడాది కనీసంగా పది దాకా రిలీజ్ కానున్నాయిట. అంతే కాదు మరో పది దాకా  వర్క్ చేస్తున్నవి ఉన్నాయి. తెలుగులో తీసుకుంటే తమన్ మ్యూజిక్ చేయని టాప్ హీరో లేడనే చెప్పాలి. తమన్ తెలుగులో సర్కార్ వారి పాట అంటూ మహేష్ బాబు మూవీకి మ్యూజిక్ ఇస్తున్నాడు. బాలక్రిష్ణ బోయపాటి మూవీకి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. అంతే కాదు, పవన్ కళ్యాణ్ సినిమాలు వరసగా తమన్ చేస్తున్నాడు. వకీల్ సాబ్ మూవీ అయిందో లేదో అయ్యప్పనుం కోషియన్ మూవీకి ఆఫర్ తమన్ పట్టేశాడు. వీరే కాదు చాలా మంది టాప్ స్టార్స్ కి ఇపుడు తమన్ కావాలి.

ఇంకో వైపు తమన్ గత ఏడాది సంక్రాంతికి చేసిన అల వైకుంఠ పురంలో మ్యూజిక్ ఇప్పటికీ రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ముందుకు పోతోంది. తమన్ సంగీత ప్రవాహంలా మారిపోయాడు. ఆయన అన్ని వర్గాల, అందరు హీరోలకు తగినట్లుగా మ్యూజిక్ చేయడం ద్వారా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. అంతే కాదు తమన్ తన స్నేహితుడు దేవీఎ శ్రీ ప్రసాద్ కి కూడా వెనక్కి నెట్టేసి ముందు వరసలోకి వచ్చేశాడు. 2021 లో తమన్ సినిమాలు కనుక సూపర్ హిట్ అయితే ఇక రానున్న రెండు మూడేళ్లల్లో ఆయనే నంబర్ వన్ అనడంతో ఏ సందేహం లేదు అంటున్నారు. తమన్ ది బెస్ట్ మరి.







ఏపీలో ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లేవ్..

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>