EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/ramatheertham-vijayanagaram-tdp-naidu-jagan-ycp84838cd7-1f3a-46e8-98bf-9c297d6f2b3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/ramatheertham-vijayanagaram-tdp-naidu-jagan-ycp84838cd7-1f3a-46e8-98bf-9c297d6f2b3e-415x250-IndiaHerald.jpgఅంటే విగ్రహాన్ని నరికినవారికి దేవాలయం చుట్టూ సీసీ కెమెరాలు బిగిస్తున్నారని బాగా తెలుసు. ఇందుకోసమనే విద్యుత్ కనెక్షన్ ఇచ్చారని ఇంకా బాగా తెలుసు. అందుకనే కరెంటు వచ్చి, సీసీ కెమెరాలు బిగించేలోగానే తాము అనుకున్న పనిని కానిచ్చేశారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే మాన్సాస్ ట్రస్టు పరిధిలో ఉత్తరాంధ్రలోని 108 దేవాలయాలున్నాయి. అయితే 105 దేవాలయాలను ఒకటిగా మూడు ఆలయాలను మాత్రం ప్రత్యేకంగా అశోక్ గజతిరాజునే ఛైర్మన్ గా చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు నియమించారు. అన్నీ దేవాలయాల నుండి మూడు దేవాలయాలను ప్రత్యేకంగా ఎందramatheertham vijayanagaram tdp naidu jagan ycp;cbn;ashok;tiru;vidya;police;electricity;tdpహెరాల్డ్ ఎడిటోరియల్ : రామతీర్ధం వెనక ఇంత జరిగిందా ? అందుకనే ఈ గోలంతా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : రామతీర్ధం వెనక ఇంత జరిగిందా ? అందుకనే ఈ గోలంతా ?ramatheertham vijayanagaram tdp naidu jagan ycp;cbn;ashok;tiru;vidya;police;electricity;tdpMon, 04 Jan 2021 03:00:00 GMTమూడు రోజులుగా రామతీర్ధం ఆలయం చుట్ట తిరుగుతున్న వివాదాలు అందరికీ తెలిసిందే. ఎవరో గుర్తుతెలీని వ్యక్తులు ఆలయంలోని శ్రీరాముడి విగ్రహాన్ని నరికేశారు. తలను తీసుకెళ్ళి పక్కనే ఉన్న కొలనులో పడేశారు. ఉదయం ఆలయానికి పూజారి వచ్చిన తర్వాత కానీ విషయం బయటపడలేదు. దాంతో ఒక్కసారిగా గోల మొదలైపోయింది. మైలేజీ కోసం రాజకీయపార్టీలన్నీ ఒక్కసారిగా దేవాలయం ముందుకు వచ్చేశాయి. అయితే ఇక్కడే కొన్ని విషయాలు బయటపడ్డాయి. అదేమంటే ఆలయంలో సీసీ కెమెరాలు బిగించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. సీసీ కెమెరాలు ఉండాలంటే ముందు కరెంటు కనెక్షన్ అవసరం. అందుకనే 25వ తేదీన ప్రభుత్వం కరెంటు స్తంబాలు వేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చింది. 29వ తేదీన సీసీ కెమెరాలు బిగించటం కోసం అవసరమైన పరికరాలన్నింటినీ తెప్పించింది. అయితే 28వ తేదీ రాత్రికాని లేదా 29వ తేదీ తెల్లవారుజామన కానీ విగ్రహాన్ని ఎవరో నరికేశారు.




అంటే విగ్రహాన్ని నరికినవారికి దేవాలయం చుట్టూ సీసీ కెమెరాలు బిగిస్తున్నారని బాగా తెలుసు. ఇందుకోసమనే విద్యుత్ కనెక్షన్ ఇచ్చారని ఇంకా బాగా తెలుసు. అందుకనే కరెంటు వచ్చి, సీసీ కెమెరాలు బిగించేలోగానే తాము అనుకున్న పనిని కానిచ్చేశారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే మాన్సాస్ ట్రస్టు పరిధిలో ఉత్తరాంధ్రలోని 108 దేవాలయాలున్నాయి. అయితే 105 దేవాలయాలను ఒకటిగా మూడు ఆలయాలను మాత్రం ప్రత్యేకంగా అశోక్ గజతిరాజునే ఛైర్మన్ గా చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు నియమించారు. అన్నీ దేవాలయాల నుండి మూడు దేవాలయాలను ప్రత్యేకంగా ఎందుకని విడదీశారు ? ఆ మూడు దేవాలయాల్లో ఇపుడు రామతీర్ధం దేవాలయం కూడా ఉంది. అంటే 29వ తేదీన ఘటన జరిగేనాటికి ఆలయం ఛైర్మన్ అశోకే అన్న విషయం అర్ధమవుతోంది. 29వ తేదీన ఘటన జరిగితే 2వ తేదీన చంద్రబాబు రామతీర్ధం వచ్చే వరకు ఎందుకని అశోక్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.




పూజారి ఇచ్చిన సమాచారం ప్రకారం వెంటనే పోలీసులు దేవాలయం దగ్గరకు వచ్చారు. దేవాలయంలోకి వెళ్ళి విగ్రహాన్ని చూస్తే పదునైన కత్తితో విగ్రహాన్ని వెనక నుండి కోసేసి తలను వేరు చేసినట్లు స్పష్టంగా కనిపించిందట. అలాగే గర్భగుడి తలుపులకు వేసిన తాళాలు కూడా పదునైన కత్తిలాంటి దానితోనే కోసినట్లు అనుమానించారు పోలీసులు. అందుకనే చుట్టుపక్కల వెతికారు. అయితే విషయం తెలిసిన మరికొందరు కూడా వెతుకులాట మొదలుపెట్టారు. అందుకనే పక్కనే ఉన్న కొలనులో విగ్రహం తల దొరికింది. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు కొలనులోకి గజఈతగాళ్ళని దింపి వెతికిస్తే పెద్ద యాక్సా బ్లేడు దొరికిందట. అంటే విగ్రహాన్ని, తాళాన్ని యాక్సిస్ బ్లేడుతోనే కోసినట్లు నిర్ధారించుకున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు చుట్టుపక్కల ఆరాతీశారు. ఈ కారణంగానే రామతీర్ధం గ్రామం సర్పంచుతో పాటు టీడీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాలన్నీ బయటకు రావటంతోనే టీడీపీ ఒక్కసారిగా రెచ్చిపోతోంది. మరి ఎప్పటికైనా నిజం బయటపడకపోతుందా ? అపచారం చేసిన వాళ్ళని ఏమి చేయాలో శ్రీరాముడికి తెలీదా ?





రామ్మోహన్‌కు చెక్ పెట్టే ఛాన్స్ దొరికిందా....!

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>