PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covaxin-covid-19f5ddc07f-98d5-409c-9e1f-85878adfe8d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covaxin-covid-19f5ddc07f-98d5-409c-9e1f-85878adfe8d8-415x250-IndiaHerald.jpgకొవాగ్జిన్‌పై వస్తున్న అపోహలు, అనుమానాలపై సంస్థ క్లారిటీ ఇచ్చింది. తమ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను తాము దాచిపెట్టలేదని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు. ప్రస్తుతం మూడో దశ‌ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయనీ మార్చి నాటికి ఈ డేటా అందుబాటులో ఉంటుందన్నారు. తమ సామర్ధ్యాన్ని తక్కువగా అంచనా వేయొద్దని, టీకాల తయారీలో అపార అనుభవం తమ సొంతమని ఆయన వివరించారు. కరోనావైరస్ వ్యాక్సిన్ పరంగా ఫైజర్ కంటే తామేమీ తక్కువ కాదన్నారు బయోటెక్‌ సీఎండీcovaxin covid 19;krishna;india;bangladesh;cm;doctor;letter;march;coronavirusకోవాగ్జిన్‌పై రాజ‌కీయాలు వ‌ద్దు!కోవాగ్జిన్‌పై రాజ‌కీయాలు వ‌ద్దు!covaxin covid 19;krishna;india;bangladesh;cm;doctor;letter;march;coronavirusMon, 04 Jan 2021 21:49:39 GMTకృష్ణ ఎల్లా స్పష్టం చేశారు.  ప్రస్తుతం మూడో దశ‌ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయనీ  మార్చి నాటికి ఈ డేటా అందుబాటులో ఉంటుందన్నారు. తమ సామర్ధ్యాన్ని తక్కువగా అంచనా వేయొద్దని, టీకాల తయారీలో అపార అనుభవం తమ సొంతమని ఆయన వివరించారు. కరోనావైరస్ వ్యాక్సిన్ పరంగా ఫైజర్ కంటే తామేమీ తక్కువ కాదన్నారు బయోటెక్‌ సీఎండీ.

  కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రక్రియపై ఐదు వ్యాసాలను ప్రచురించిన ఏకైక సంస్థ భారత్ బయోటెక్ అని డాక్టర్ కృష్ణ ఎల్లా  తెలిపారు.  ప్రస్తుత వివాదం ఒక శాస్త్రవేత్తగా బాధిస్తోందన్నారు. త‌మ సంస్థ‌కు అనుభ‌వం లేద‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదన్నారు.  త‌మ‌ది గ్లోబ‌ల్ కంపెనీ అని, ఇప్ప‌టికే అనేక ర‌కాల వ్యాక్సిన్ల‌ను త‌యారు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 16 ర‌కాల టీకాల‌ను త‌యారు చేసిన‌ట్లు కృష్ణ ఎల్లా చెప్పారు. చికున్ గున్యా సహా అనేక వ్యాధులకు తాము వ్యాక్సిన్లు తయారు చేశామన్నారు.   తమ కుటుంబంలో ఎవరికీ రాజకీయాలతో సంబంధం లేదనీ, కోవాగ్జిన్‌పై రాజకీయాలు చేయవద్దని కృష్ణ కోరారు. బ్రిట‌న్‌తో పాటు 12 దేశాల్లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వహించామనీ, పాకిస్థాన్‌, నేప‌ల్‌, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లోనూ త‌మ టీకా ట్ర‌య‌ల్స్ జ‌రిగిన‌ట్లు ఆయన వెల్ల‌డించారు.

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ..ఐసీఎంఆర్ సహకారంతో అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కు దేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా  ఆదివారం ఉదయం అనుమతి మంజూరు చేసింది. అయితే దీనిపై విపక్షాలు ఫైర్ అయ్యాయి. ఎటువంటి డేటా ఇవ్వ‌కుండా ఈ టీకాకు ఎలా అనుమ‌తి ఇస్తార‌ని విమర్శించాయి. దీంతో భార‌త్‌ బ‌యోటెక్  వ్యవస్థాపకుడు, చైర్మ‌న్ కృష్ణ ఎల్లా వివరణ ఇచ్చారు.





తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>