PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape19756b78-79d8-4d8f-9910-583f50386dd5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape19756b78-79d8-4d8f-9910-583f50386dd5-415x250-IndiaHerald.jpgసమాజంలోనే కాదు.. ఇంట్లోనే అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. వావివరసలు మర్చి సొంతవారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా సొంత పిన్నికొడుకే, సోదరి వరుస ఉన్న యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చండీగడ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే బాధిత యువతి హరిద్వార్ నుంచి చండీగడ్ కు ఉద్యోగ ప్రయత్నం నిమిత్తం బయలుదేరింది.rape;hardwar;police;bus;bike;interview;lieపిన్ని కొడుకు కదా అని గదిలో ఉండనిస్తే.. చివరకి ఇలా..!?పిన్ని కొడుకు కదా అని గదిలో ఉండనిస్తే.. చివరకి ఇలా..!?rape;hardwar;police;bus;bike;interview;lieMon, 04 Jan 2021 08:00:00 GMTహరిద్వార్ నుంచి చండీగడ్ కు ఉద్యోగ ప్రయత్నం నిమిత్తం బయలుదేరింది. అదే నగరంలో నివాసముంటున్న నిందితుడు, తన నివాసంలో బస చేయాలని యువతిని నమ్మ బలికాడు. వరుసకు సోదరుడే కదా అని యువతి కూడా సరేనంది. కానీ అతడి పశువాంఛకు బలవుతానని గుర్తించలేకపోయింది.

ఇక హరిద్వార్ నుంచి బస్సులో బయలు దేరిన యువతి, ఉదయాన చండీగడ్ లో దిగింది. ఇంతలో నిందితుడు ఆమెను రిసీవ్ చేసుకునేందుకు బస్ స్టాండ్ కు వెళ్లాడు. అక్కడే ఆమెను బైక్ పై ఎక్కించుకొని తాను నివాసముంటున్న ఫ్లాట్ కు వెళదామన్నాడు. అయితే ఇంటర్వ్యూ మధ్యాహ్నం ఉండటంతో యువతి అందుకు సరేనన్నది. ఇద్దరూ ఫ్లాట్ కు చేరుకున్నారు. యువతి స్నానం చేసి, బ్రేక్ ఫాస్ట్ ముగించి, ఇంటర్వ్యూకు బయలుదేరింది. నిందితుడు సైతం యువతితో తాను మంచి వాడినేనని నమ్మించే యత్నం చేశాడు. ఇంటర్వ్యూ ముగించుకుని యువతి సాయంత్రం ఇంటికి చేరింది.

అయితే అప్పటికే దుర్బుద్ధితో ఉన్న నిందితుడు, ఆమెను ఎలాగైనా లోబరుచుకోవాలని కుట్ర చేశాడు. సరదాగా మద్యం సేవిద్దామని ఆమెతో అన్నాడు. అందుకు యువతి ససేమిరా అన్నది. అయినప్పటికీ వినకుండా యువతిని బలవంతంగా మద్యం తాగించే ప్రయత్నం చేశాడు. ఇక చేసేదేమి లేక నిందితుడి మాయమాటల్లో పడి యువతి కూడా మద్యం సేవించింది. అయితే మద్యం మత్తులోనే యువతి గదిలోకి వెళ్లి నిద్రలోకి జారుకుంది. కాసేపయ్యాక యువతికి మత్తు సడెన్ గా వదిలి నిద్ర నుంచి లేచి చూసింది.

ఇక వరుసకు సోదరుడు అయ్యే యువకుడే తనపై లైంగిక దాడి చేస్తుండటంతో బాధిత యువతి షాక్ కు గురైంది. షాక్ నుంచి తేరుకొని యువతి అతడిని ప్రతిఘటించింది. గదిలోని నుంచి బయటకు వచ్చి యువకుడిని గదిలోనే బంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, బాధిత మహిళను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేయగా విచారణ కొనసాగుతోంది.




వారం రోజుల్లో కొవిడ్ వ్యాక్సిన్..!

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>