Beautykalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/grapes9dc46ad5-093f-40af-8a3d-1194f9516ea4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/beauty/sagittarius_sagittarius/grapes9dc46ad5-093f-40af-8a3d-1194f9516ea4-415x250-IndiaHerald.jpgద్రాక్ష పండు చెట్టు పుష్పించే మొక్కలైన వైటేసి కుటుంబంలోని వైటిస్ జాతికి చెందినది. ద్రాక్షలో సుమారుగా 60 రకాల జాతులున్నాయి. ద్రాక్ష పండ్లను అలాగే తినవచ్చు లేదా జ్యూస్ చేసుకొని తాగొచ్చు, సలాడ్ చేసుకొని తాగవచ్చు. ఎలా తీసుకున్న ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండ్లు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం grapes;sona mohapatra;egg;heart;cancer;aqua;lung cancerఅందాన్ని పెంచే ద్రాక్ష పండ్లు.. ఎలానో తెలుసా?అందాన్ని పెంచే ద్రాక్ష పండ్లు.. ఎలానో తెలుసా?grapes;sona mohapatra;egg;heart;cancer;aqua;lung cancerMon, 04 Jan 2021 07:00:00 GMT
ద్రాక్ష పళ్ళు తినడం వల్ల క్యాన్సర్ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇందులో టన్నిస్,పాలీఫినాల్స్  ఉంటాయి. ఇవి క్యాన్సర్ సంబంధిత కారకాలపై పోరాడుతాయి. శరీరంలోనిఅధిక కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి.

ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంవల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగేటట్లు చేస్తాయి. అంతేకాకుండా గుండె కవాటాల పనితీరును మెరుగుపరుస్తాయి.

ద్రాక్ష గింజలు తినడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది.పెద్ద వయసు వచ్చినా వారికి కంటి చూపు తగ్గకుండా కాపాడుతుంది. ఎందుకంటే ద్రాక్ష గింజల్లో ప్రాణంథో సైనుడిన్ అనే పదార్థం ఉంటుంది.

ద్రాక్షలో ఉండే పాలీఫినాల్స్ శరీరంలోని కొల్లా జిన్ను తయారుచేస్తాయి. వీటివల్ల శరీరం కాంతివంతంగా ఉంటుంది. కాబట్టి ద్రాక్ష పండ్లు తినడం మంచిది.

ద్రాక్షపండ్లలో ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల క్షీణతను తగ్గిస్తాయి. అంతేకాకుండా వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి.

ఎండకు ముఖం వాడిపోయినట్లు ఉంటే ఒక కప్పు తెల్ల ద్రాక్ష తీసుకొని మెత్తగా పేస్ట్గా తయారు చేయాలి. ఈ పేస్ట్ కి కొంచెం తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి.  అప్పుడు ముఖం కాంతి వంతంగా ఉంటుంది.

 ముఖం మృదువుగా ఉండాలంటే ఒక టేబుల్స్పూన్ ద్రాక్ష రసం, గుడ్డులోని పచ్చసొన కలిపి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.పొడి చర్మం ఉన్నవారు మాత్రమే పచ్చసొన వాడాలి. జిడ్డు చర్మం ఉన్నవారు తెల్ల సోనా వాడాలి.                         


వారం రోజుల్లో కొవిడ్ వ్యాక్సిన్..!

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>