MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan1b52f882-fd53-46d1-9aa3-25063d0217a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan1b52f882-fd53-46d1-9aa3-25063d0217a7-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి, సందేశాత్మక చిత్రాలను తీసే కొరటాల శివ కాంబినేషన్‌లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని కూడా తెలిసింది. రామ్ చరణ్ ఈ సినిమాలో కేవలం ప్రత్యేక పాత్ర అయినప్పటికి 40 నిమిషాల నిడివిలో ఆయన కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. ramcharan;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;pawan kalyan;ram pothineni;rajamouli;alluri sitarama raju;rrr movie;cinema;lord siva;gift;posters;chirutha;chitramఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!ramcharan;chiranjeevi;ram charan teja;shiva;koratala siva;pawan kalyan;ram pothineni;rajamouli;alluri sitarama raju;rrr movie;cinema;lord siva;gift;posters;chirutha;chitramSun, 03 Jan 2021 16:21:35 GMTమెగాస్టార్ చిరంజీవి, సందేశాత్మక చిత్రాలను తీసే కొరటాల శివ కాంబినేషన్‌లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని కూడా తెలిసింది. రామ్ చరణ్ ఈ సినిమాలో కేవలం ప్రత్యేక పాత్ర అయినప్పటికి 40 నిమిషాల నిడివిలో ఆయన కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. ఇక రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుందోనని మెగా అభిమానులు తెగ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే మెగా పవర్ స్టార్ దర్శకధీర రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు.

ఆ సినిమాలో మనోడి గెటప్‌కు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఇక ఆచార్యలో చరణ్ గెటప్ ఎలా ఉండబోతోందన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే తాజాగా రామ్ చరణ్ గెటప్ ఇలానే ఉండబోతోందంటూ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి విడుదలైంది. ఈ పోస్టర్ చూసిన వారు ఎవరైనా సరే ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని అనుకోరు. ఆ విధంగా దీన్ని డిజైన్ చేశారు. మరోపక్క రామ్ చరణ్ ఈ పోస్టర్‌లో కనిపించిన విధంగా మరే సినిమాలో ఇప్పటి వరకు కనిపించలేదు. దీంతో రామ్ చరణ్ పాత్ర ఆచార్యలో సరిగ్గా ఉండబోతోందంటూ మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు.

మెగా అభిమాని నాలుగు గంటల పాటు శ్రమించి ఈ డిజైన్‌ను గీశాడట. తనకు బాగా నచ్చిన నటుడికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నానని, అందుకే ఈ పోస్టర్ ఎంతో శ్రమించి గీశానని సదరు అభిమాని చెబుతున్నాడు. ఇక రామ్ చరణ్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. అతి త్వరలోనే కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని మన చిరుత తిరిగి చిత్ర షూటింగ్‌లలో పాల్గొననున్నాడు. 


సంగారెడ్డి రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్

కాంగ్రెస్, శివసేన మధ్య విబేధాలు.. మహా ప్రభుత్వం పడిపోతుందా..!

2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>