PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ap8a6ef18f-1091-4e8c-9341-9cd831beb33f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ap8a6ef18f-1091-4e8c-9341-9cd831beb33f-415x250-IndiaHerald.jpgబంపర్ మెజారిటీతో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ని దించేసేందుకు తెర వెనక కుట్ర జరుగుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజం అనిపిస్తోంది అంటున్నారు. లేకపోతే పొరుగున ఉన్న తెలంగాణాలో కానీ ఎక్కువ హిందూ క్షేత్రాలు కలిగిన తమిళనాడులో కానీ ఒక్క దేవతా విగ్రహానికి ఆపద కానీ హాని కానీ జరగలేదు. ఏపీలో మాత్రం అదే పనిగా ఈ మూక దాడి జరుగుతోంది అంటే దీని వెనక కచ్చితంగా రాజకీయ కుట్ర ఉంటుందని అంటున్నారు. jagan ap;jagan;police;tamilnadu;christianజగన్ ని దించేందుకు భారీ కుట్ర...?జగన్ ని దించేందుకు భారీ కుట్ర...?jagan ap;jagan;police;tamilnadu;christianSun, 03 Jan 2021 22:00:00 GMTజగన్ ని దించేసేందుకు తెర వెనక కుట్ర జరుగుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజం అనిపిస్తోంది అంటున్నారు. లేకపోతే పొరుగున ఉన్న తెలంగాణాలో కానీ ఎక్కువ హిందూ క్షేత్రాలు కలిగిన తమిళనాడులో కానీ ఒక్క దేవతా విగ్రహానికి ఆపద కానీ హాని కానీ జరగలేదు. ఏపీలో మాత్రం అదే పనిగా ఈ మూక దాడి జరుగుతోంది అంటే దీని వెనక కచ్చితంగా రాజకీయ కుట్ర ఉంటుందని అంటున్నారు.

ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ వరసగా ఏపీలో దేవతా విగ్రహాల విద్వంశం పేరిట ఘాతుకాలను చేస్తున్నారు. ఏపీలో పదమూడు జిల్లాలు ఉన్నాయి. ఒక్కో జిల్లాల్లో లక్ష దాకా దేవతా విగ్రహాలు ఉంటాయని అంచనా వేసుకున్నా కూడా 13 లక్షల విగ్రహాలు అవుతాయి. వీటిలో చాలా వరకూ ఆరు బయట ఉంటాయి. ఇప్పటిదాకా వీటిని మొక్కి ముందుకు సాగే వారే తప్ప విద్వంశం చేసిన వారు ఎవరూ లేరు.

ఇపుడు ఈ విగ్రహాలకు ఈ పరిస్థితి పట్టింది. ఏపీలో పోలీసులు ఉన్నారు. ఇంటలిజెన్స్ ఉంది కానీ ఇలా లక్షల విగ్రహాలకు కాపలా కాయడం అంటే మానవమాత్రులకు అయ్యే పని కాదు. అందుకే డీజీపీ గౌతం సవాంగ్ ఇది అందరి బాధ్యత, ముఖ్యంగా ప్రతీ ఊరిలో పల్లెల్లో ప్రజలు కూడా అప్రమత్తం కావాలని కోరుతున్నారు. సరే ఆ వినతి ఎలా ఉన్నా ఎందుకిలా జరుగుతోంది అంటే జగన్ క్రిస్టియన్. ఆయన్ని హిందూ సమాజానికి వ్యతిరేకంగా చేస్తే  జనం పూర్తిగా తిరస్కరిస్తారు అన్నదే ఈ కుట్ర వెనక అజెండా అంటున్నారు.

ఇప్పటిదాకా ఏపీలో కులాల కుమ్ములాటలనే అంతా చూశారు. కానీ క్షుద్ర రాజకీయాల కోసం కొందరు ఇపుడు మతాలను కూడా ఏపీలోకి తీసుకువస్తున్నారు. దీని వల్ల రాజకీయంగా లబ్ది ఎవరికి కలిగినా అంతిమంగా రాష్ట్రం మాత్రం రావణ కాష్టం కావడం ఖాయమని అంటున్నారు. అసలే విభజన గాయాలతో ఆర్ధికంగా చితికిపోయిన ఏపీకి ఇపుడు ఈ మత విద్వేషాలు అవసరమా అన్న మాట కూడా మేధావుల నుంచి వస్తోంది. వరసగా విగ్రహాల విద్వంశం అంటే ఇది కచ్చితంగా కుట్రగానే చూడాలని అంటున్నారు. మరి ఈ కుట్ర వెనక రాజకీయ కోణం కనుక ఉంటే మాత్రం ఏపీలో జగన్ కి డేంజర్ సిగ్నల్స్ మొదలైనట్లే.




'సలార్' ప్రక్కన ఆ ఇద్దరిలో ఒకరు ఫిక్స్ అట .....??

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

రిజిస్ట్రేషన్ లేదు.. ఇన్వాయిస్ లేదు.. రూ.830 కోట్ల జీఎస్‌టీ ఎగవేశారు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్

నచ్చకపోతే వచ్చి ఆడకండి.. టీమిండియాకు క్వీన్స్‌ల్యాండ్ వార్నింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>