PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ramatheertham352780fb-704c-4e0a-970f-2f7e5c3db69f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ramatheertham352780fb-704c-4e0a-970f-2f7e5c3db69f-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న రామతీర్థం ఘటన ని ప్రతిపక్షాలు తమ రాజకీయ ఎదుగుదలకి వాడుకోవాలయం చూస్తుంది. ఇప్పటికే చంద్రబాబు విజయనగరం జిల్లాకు చేరుకొని జగన్ ని ఎంత అనాలో అంత అనేశారు. మరోవైపు బీజేపీ జనసేన ద్వయం కూడా సోషల్ మీడియా లో ఈ ఘటన కు వైసీపీ నే కారణమని చెప్తుంది.. జగన్ ను విమర్శించడానికి ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా అని చూస్తున వీరికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది..ramatheertham;ramu;thirtha;tiru;bharatiya janata party;jagan;janasena;tirupati;media;husband;ycp;janasena party;rama tirtha;hindus;party;racchaరామ తీర్థ ఘటనని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న ప్రతిపక్షాలు..?రామ తీర్థ ఘటనని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న ప్రతిపక్షాలు..?ramatheertham;ramu;thirtha;tiru;bharatiya janata party;jagan;janasena;tirupati;media;husband;ycp;janasena party;rama tirtha;hindus;party;racchaSun, 03 Jan 2021 21:00:00 GMTజగన్ ని ఎంత అనాలో అంత అనేశారు. మరోవైపు బీజేపీ జనసేన ద్వయం కూడా సోషల్ మీడియా లో ఈ ఘటన కు వైసీపీ నే కారణమని చెప్తుంది.. జగన్ ను విమర్శించడానికి ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా అని చూస్తున వీరికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది..

విజయ నగరం జిల్లాలోని కొంతమంది దుండగులు రామతీర్థం ఆలయంలో రాముడి విరహం శిరస్సు ఖండించిన విషయం తెలిసిందే..  దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు మొదలుపెట్టగా ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేసి తమకు లభ్దీ చేకూరే విధంగా పావులు కదుపుతుంది. ఇప్పటికే బీజేపీ, జనసేన తిరుపతి ఎన్నికల నేపథ్యంలో రామతీర్థాన్ని వాడుకుని రాజకీయంగా లభ్దీ పొందాలని చూస్తుండగా ఇప్పటి వరకు రాష్ట్రాన్ని గాలికొదిలేసి పక్కరాష్ట్రంలో ఉంటున్న చంద్రబాబు కూడా పొలోమంటూ రాముడి చెంత వాలిపోయాడు.

ఈనేపథ్యంలో హిందుత్వ పార్టీ గా పేరున్న బీజేపీ దీన్ని పెద్ద ఎత్తున రచ్చ చేయాలనీ చూస్తుందట..రామతీర్థం ఘటన నుంచి రాజకీయ తీర్థం పొందడానికి బీజేపీ, జనసేన కూడా రెడీ అయ్యాయి. రామతీర్థం ఘటన రాజకీయ అంశం కాదని… బీజేపీ నేతలు సోము వీర్రాజు లాంటి వాళ్లు ప్రకటించారు. అంటే..బహుశా.. ఇక దాని గురించి వారు పట్టించుకోరేమో అని అనుకున్నారు. కానీ వెంటనే.. తాము నాలుగో తేదీన రామతీర్థం వెళ్తామని ప్రకటించారు. సాయంత్రానికి మళ్లీ షెడ్యూల్ మారిపోయింది. ఐదో తేదీకి మారింది. బీజేపీ మాత్రమే కాదు.. జనసేన కూడా.. రామతీర్థానికి వెళ్లేవారి జాబితాలో చేరింది.ఢిల్లీలో ఉన్న సోము వీర్రాజు.. రామతీర్థం ఘటనపై… హైకమాండ్ పెద్దలతో చర్చించారు. రామతీర్థం ఘటన విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆలయాలపై జరుగుతున్న దాడుల వ్యవహారాన్ని చంద్రబాబు టేకప్ చేశారని … ఇప్పుడు మనం బ్యాటన్ అందుకోవాల్సిన సమయం వచ్చిందని నిర్ణయం తీసుకున్నారు. రంగంలోకి దిగాలనుకున్నారు.


స్థానిక ఎన్నికలకు జగన్ ముహూర్తం ?

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్

నచ్చకపోతే వచ్చి ఆడకండి.. టీమిండియాకు క్వీన్స్‌ల్యాండ్ వార్నింగ్

దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఇప్పుడు పరిస్థితి ఏంటి..?

బుల్లిపిట్ట: చైనాకు భారీ షాక్.. ఈ సారి ఏకంగా 46 వేల యాప్‌లు..

ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>