BusinessSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-flying-aeroplane-rules-confused363a9a3b-b479-4cb7-90f0-d0f57359520f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-flying-aeroplane-rules-confused363a9a3b-b479-4cb7-90f0-d0f57359520f-415x250-IndiaHerald.jpg సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాకు స్పెషల్ విమానాలు నడిపేందుకు ఎయిర్‌వేస్ రెడీ అయిపోయాయి.హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వారి కోసం ప్రత్యేక విమాన సర్వీసులు మొదలు కాబోతున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి సంక్రాంతికి అదనపు సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలను ప్రకటించిందిaeroplane;kranthi;kranti;makar sakranti;hyderabad;vijayawada;andhra pradesh;rtc;telugu;sankranthi;january;festival;busఆంధ్రాకు ప్రత్యేక విమానాలు నడుపనున్న విమానయాన సంస్థలుఆంధ్రాకు ప్రత్యేక విమానాలు నడుపనున్న విమానయాన సంస్థలుaeroplane;kranthi;kranti;makar sakranti;hyderabad;vijayawada;andhra pradesh;rtc;telugu;sankranthi;january;festival;busSun, 03 Jan 2021 22:50:00 GMTఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలకు కూడా సంక్రాంతి ‘పెద్ద పండుగ’గా చెప్పుకోవచ్చు. సంక్రాంతి సీజన్‌లో హైదరాబాద్ మహానగరం నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిప్పే బస్సుల వల్ల భారీ లాభాలు గడిస్తుంటారు. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంటాయి. ఇప్పుడు ఏకంగా సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాకు స్పెషల్ విమానాలు నడిపేందుకు ఎయిర్‌వేస్ రెడీ అయిపోయాయి.


హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వారి కోసం ప్రత్యేక విమాన సర్వీసులు మొదలు కాబోతున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి సంక్రాంతికి అదనపు సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలను ప్రకటించింది. కేవలం గంటలోనే విజయవాడ చేరిపోవచ్చు. జనవరి 10 నుంచి ప్రతి రోజూ సాయంత్రం 4.30కు హైదరాబాద్‌లో బయల్దేరి.. 5.30 కల్లా విజయవాడకు విమానం చేరుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు విజయవాడలో బయల్దేరే విమానం రాత్రి 7.10కి హైదరాబాద్‌కు చేరుతుంది. మరికొన్ని విమానయాన సంస్థలు కూడా సంక్రాంతి రద్దీకి అనుగుణంగా సర్వీసులను నడిపే యోచనలో ఉన్నాయి. ఈ విమాన సర్వీసుల షెడ్యూల్‌ను తాజాగా స్పైస్‌జెట్‌ విమాన సంస్థ విడుదల చేసింది.



జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు ప్రతి రోజూ సాయంత్రం 4.30కు హైదరాబాద్‌లో బయల్దేరి 5.30కు విజయవాడకు వస్తుంది. తిరిగి విజయవాడ నుంచి సాయంత్రం 6 గంటకు ఇదే సర్వీసు బయల్దేరి హైదరాబాద్‌కు రాత్రి 7.10కి చేరుతుంది. జనవరి 16 నుంచి మరో సర్వీసు విజయవాడలో ప్రారంభం కానుంది. ఈ విమానం ప్రతి రోజు మధ్యాహ్నం 3.20కు బయలుదేరి 3.55కు హైదరాబాద్‌కు వెళుతుంది. ఇది జనవరి 30వ తేదీ వరకు నడుస్తుంది. ఇక, జనవరి 11 నుంచి 28వ తేదీ వరకు మరో కొత్త సర్వీసు ప్రారంభమవుతుంది. ఈ విమానం విజయవాడలో మధ్యాహ్నం 3.20కు బయల్దేరి హైదరాబాద్‌కు 4.10కి చేరుతుంది.




రామ్ ఇస్మార్ట్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా.. రెడ్ అసలు సీక్రెట్ చెప్పేసిన డైరక్టర్..!

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>