PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/number-of-new-corona-cases-in-ap76e15edc-9c26-41c3-a957-4093c9f4424e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/number-of-new-corona-cases-in-ap76e15edc-9c26-41c3-a957-4093c9f4424e-415x250-IndiaHerald.jpgదేశంలో క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం పడుతున్నాయి. అదే స‌మ‌యంలో రిక‌వ‌రీ రేటు కూడా పెరుగుతోంది. దీంతో క‌రోనా భ‌యాలు తొల‌గుతున్నాయి. మ‌రోవైపు వ్యాక్సిన్ పంపిణీకి చ‌క‌చ‌క ఏర్పాట్లు జ‌రుగుతుండ‌టంతో ఇక‌పై అన్నీ శుభ సూచ‌కాలుగానే క‌నిపిస్తున్నాయి. ఇప్పటికే సీరం ఉత్పత్తి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్‌ వాక్సిన్‌కు నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం కోసం వేచి చూస్తోంది. తాజాగా తుది ఆమోదానికి ఒక అడుగు దూరంలో భారతదేశంలో రెండవ టీకాగా భాcorona;india;telangana;central governmentక‌రోనాపై భార‌త్ విజ‌యం.. త‌గ్గుతున్న కేసులు..పెరుగుతున్న రిక‌వ‌రీక‌రోనాపై భార‌త్ విజ‌యం.. త‌గ్గుతున్న కేసులు..పెరుగుతున్న రిక‌వ‌రీcorona;india;telangana;central governmentSun, 03 Jan 2021 11:09:11 GMTఇండియా (డీసీజీఐ) ఆమోదం కోసం వేచి చూస్తోంది. తాజాగా తుది ఆమోదానికి ఒక అడుగు దూరంలో  భారతదేశంలో రెండవ టీకాగా  భారత్ ‌బయోటెక్‌ వ్యాక్సిన్‌ కోవాక్సిన్‌ అవతరించింది. సుమారు గత ఏడాది కాలంగా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారికి అంతానికి మార్గం సుగమవుతోంది. కరోనా వాక్సిన్లు త్వరలోనే దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.


ఇదిలా ఉండ‌గా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,177 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,03,23,965కు పెరిగింది. వైరస్‌ ప్రభావంతో మరో 217 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,49,435కు చేరింది. తాజాగా 20,923 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 99,27,310 డిశ్చార్జి అయ్యారని మంత్రిత్వశాఖ వివరించింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 2,47,220 ఉన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశంలో శనివారం ఒకే రోజు 9,58,125 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్  తెలిపింది. ఇప్పటి వరకు 17,78,99,783 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.


తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఒక రోజు పెరుగుతోంది. మరో రోజు తగ్గుతోంది. శనివారం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా నేడు మరోసారి పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 394 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 574 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి కాగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,87,502కు చేరింది. వీరిలో 2,80,565 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,388 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.




పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..

ఇక్కడ హీరో.. అక్కడ విలన్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>