PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-pawan-kalyan-has-chance-to-enter-to-assembly8ea3bcdb-6b73-4cb2-b79b-d6bf2284e6d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-pawan-kalyan-has-chance-to-enter-to-assembly8ea3bcdb-6b73-4cb2-b79b-d6bf2284e6d2-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినిమాల్లో క్రేజ్ ఉన్న పవన్‌కు రాజకీయాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. కానీ అది ఓట్ల రూపంలో రావడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతుంది. 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్ధతు ఇవ్వడంతో, ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. పవన్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని జనసేన కార్యకర్తలు భావించారు. అదే విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చారు. pawan kalyan;pawan;bharatiya janata party;janasena;2019;cinema;mla;tdp;central government;janasena party;partyపవన్ అసెంబ్లీలో అడుగుపెట్టే రూట్ ఇదేనా?పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టే రూట్ ఇదేనా?pawan kalyan;pawan;bharatiya janata party;janasena;2019;cinema;mla;tdp;central government;janasena party;partySun, 03 Jan 2021 03:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినిమాల్లో క్రేజ్ ఉన్న పవన్‌కు రాజకీయాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. కానీ అది ఓట్ల రూపంలో రావడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతుంది. 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్ధతు ఇవ్వడంతో, ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. పవన్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని జనసేన కార్యకర్తలు భావించారు. అదే విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చారు.

కానీ 2019 ఎన్నికల్లో జనసేన కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసింది. దాని వల్ల జనసేన ఘోరంగా ఓడిపోయింది. అటు జనసేన వల్ల టీడీపీకి కూడా పెద్ద బొక్క పడింది. ఇదంతా కలిసి వైసీపీకి బాగా ప్లస్ అయింది. పైగా ఊహించని విధంగా పవన్ సైతం ఘోరంగా రెండుచోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

కేవలం ఆ పార్టీ తరుపున ఒక్క ఎమ్మెల్యేనే గెలిచారు. ఆ గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీతో వెళుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయాక పవన్, బీజేపీతో కలిసి ముందుకెళుతున్నారు. కేంద్రంలో బీజేపీ సత్తా చాటిన, ఏపీలో ఆ పార్టీకి అంత స్టామినా లేదు. దాని వల్ల జనసేనకు కూడా వచ్చేది ఏమి లేదు. కాకపోతే సెంట్రల్ సపోర్ట్ ఉందనే పేరు తప్పా. బీజేపీతో ఉండటం వల్ల ఓట్లు కూడా పెద్దగా పడవు. సీట్లు కూడా రావు.

ఇక ఇదే సమయంలో ఏపీలో పలు విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. పవన్, టీడీపీతో కలిసి వెళితే అడ్వాంటేజ్ ఉందని చెబుతున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో టీడీపీకి మెజారిటీ రావడంలో జనసేనకు ప్లస్ అయింది. అలాగే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో జనసేన పాత్ర ఉంది. కొన్నిచోట్ల ఓట్లు చీల్చేయడం వల్ల టీడీపీకి డ్యామేజ్ జరిగి, వైసీపీకి బెన్‌ఫిట్ జరిగింది. అదే టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తే గెలవకపోయిన, కనీసం 50-60 సీట్లు గెల్చేవారు. అలాగే పవన్ ఎమ్మెల్యేగా గెలిచేవారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి ముందుకెళితే ఫలితం ఉంటుందని, పవన్ కూడా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమంటున్నారు.




మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>