PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/cbn-lokesh-kodali43a27d85-fa44-4c2b-a067-71d35c512aaf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/cbn-lokesh-kodali43a27d85-fa44-4c2b-a067-71d35c512aaf-415x250-IndiaHerald.jpgవీళ్ల‌ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్ట‌డంలో నాని సిద్ధ‌హ‌స్తుడు. ఈ క్ర‌మంలోనే నాని రామ‌తీర్థం దోషులు ఎవ్వ‌రో తేలాల్సి ఉంద‌ని డిమాండ్ చేశారు. అక్క‌డ నూటికి నూరు శాతం విగ్ర‌హాన్ని ధ్వంసం చేయించింది చంద్ర‌బాబే అని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు, లోకేష్‌తో పాటు అశోక్ గ‌జ‌ప‌తిరాజు, స్థానిక టీడీపీ నేత‌ల‌కు నార్కో ఎనాల‌సిస్ ప‌రీక్ష‌లు చేస్తే అస‌లు నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్నారు. దేవుడు లాంటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబుకు ప్ర‌జాస్వామ్యం అంటే న‌మ్మ‌కం లేద‌ని.. ఇప్పుడు రామ‌తీర్థంలో రాజ‌కీయం చcbn lokesh kodali;lokesh;nani;ashok;deva;kodali nani;bharatiya janata party;andhra pradesh;baba bhaskar;minister;letter;tdp;local language;ycp;butter;lokesh kanagaraj;mantraచంద్ర‌బాబు, లోకేష్‌కు కొడాలి లెఫ్ట్‌, రైట్ వాయింపులు...!చంద్ర‌బాబు, లోకేష్‌కు కొడాలి లెఫ్ట్‌, రైట్ వాయింపులు...!cbn lokesh kodali;lokesh;nani;ashok;deva;kodali nani;bharatiya janata party;andhra pradesh;baba bhaskar;minister;letter;tdp;local language;ycp;butter;lokesh kanagaraj;mantraSun, 03 Jan 2021 18:12:15 GMTఏపీ రాజ‌కీయాల‌ను విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని రామ‌తీర్థం శ్రీరాముడి విగ్ర‌హం విధ్వంసం ఘ‌ట‌న షేక్ చేస్తోంది. అధికార వైసీపీ టార్గెట్‌గా విప‌క్ష టీడీపీతో పాటు బీజేపీ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రామ‌తీర్థం వెళ్లారు. అటు వైసీపీ మంత్రులు కూడా రామ‌తీర్థం వెళ్లి విగ్ర‌హం ధ్వ‌సం చేసిన ప్రాంతం ప‌రిశీలించ‌డంతో పాటు ప్ర‌భుత్వం త‌ప్పేమి లేద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక చంద్ర‌బాబు, విజ‌య‌సాయిరెడ్డి సైతం అక్క‌డ‌కు వెళ్ల‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

చంద్ర‌బాబు జ‌గ‌న్‌పై తీవ్రంగా చేసిన విమ‌ర్శ‌ల‌కు మంత్రి కొడాలి నాని ఘాటైన కౌంట‌ర్ ఇచ్చాడు. అస‌లు చంద్ర‌బాబు, లోకేష్‌పై పంచ్‌లు పేల్చాలంటే అది కొడాలి నానికే సాధ్య‌మా ? అన్న‌ట్టుగా నాని పంచ్‌లు ఉంటాయి. వీళ్ల‌ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్ట‌డంలో నాని సిద్ధ‌హ‌స్తుడు. ఈ క్ర‌మంలోనే నాని రామ‌తీర్థం దోషులు ఎవ్వ‌రో తేలాల్సి ఉంద‌ని డిమాండ్ చేశారు. అక్క‌డ నూటికి నూరు శాతం విగ్ర‌హాన్ని ధ్వంసం చేయించింది చంద్ర‌బాబే అని విమ‌ర్శించారు.

చంద్ర‌బాబు, లోకేష్‌తో పాటు అశోక్ గ‌జ‌ప‌తిరాజు, స్థానిక టీడీపీ నేత‌ల‌కు నార్కో ఎనాల‌సిస్ ప‌రీక్ష‌లు చేస్తే అస‌లు నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్నారు. దేవుడు లాంటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబుకు ప్ర‌జాస్వామ్యం అంటే న‌మ్మ‌కం లేద‌ని.. ఇప్పుడు రామ‌తీర్థంలో రాజ‌కీయం చేసేందుకు డేరా బాబా అవ‌తారం ఎత్తాడ‌ని తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ఎన్నో గుళ్ల‌ను కూల్చి.. విగ్ర‌హాల‌ను చెత్త ట్రాక్ట‌ర్ల‌లో ప‌డేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే అని ఫైర్ అయ్యారు.

జ‌గ‌న్‌కు మాత్ర‌మే దేవుడు అంటే విశ్వాసం, న‌మ్మ‌కం ఉన్నాయ‌ని.. క‌నీసం వార్డు మెంబ‌ర్‌గా కూడా గెల‌వ‌లేని ద‌ద్ద‌మ్మే లోకేష్ జ‌గ‌న్‌కు ఛాలెంజ్ విస‌ర‌డం ఏంట‌ని చెడుగుడు ఆడేసుకున్నారు. ఏదేమైనా చంద్ర‌బాబు, లోకేష్ విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్లు ఇవ్వాల‌న్నా, వాళ్ల‌ను చెడుగుడు ఆడుకోవాల‌న్నా అది కొడాలి నానికి మాత్ర‌మే సాధ్యం అన్న‌ట్టుగా నాని తాజా కౌంట‌ర్లు పేలాయి.




చంద్రబాబుకి వాళ్ళు దూరం జరిగారా...?

దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఇప్పుడు పరిస్థితి ఏంటి..?

బుల్లిపిట్ట: చైనాకు భారీ షాక్.. ఈ సారి ఏకంగా 46 వేల యాప్‌లు..

ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!

కాంగ్రెస్, శివసేన మధ్య విబేధాలు.. మహా ప్రభుత్వం పడిపోతుందా..!

2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>