TechnologyP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/appleba02b988-7bd2-4b1d-91a9-07b041de36bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/appleba02b988-7bd2-4b1d-91a9-07b041de36bf-415x250-IndiaHerald.jpgఅమెరికా టెక్ దిగ్గజం యాపిల్ చైనాకు చెందిన యాప్‌లకు భారీ షాక్ ఇచ్చింది. చైనా స్టోర్‌ నుంచి యాపిల్ సంస్థ 39 వేల యాప్‌లను తొలగించింది. దీనికి కారణమేంటంటే.. ఈ యాప్‌లు మొత్తం 2020 ఏడాది చివరి రోజు వరకు లైసెన్స్‌‌ను పొందలేదు. ఈ కారణంగానే తాము 39 వేల యాప్‌లను తమ స్టోర్‌ నుంచి తొలగించినట్టు వెల్లడించింది. apple;american samoa;december;2020బుల్లిపిట్ట: చైనాకు భారీ షాక్.. ఈ సారి ఏకంగా 46 వేల యాప్‌లు..బుల్లిపిట్ట: చైనాకు భారీ షాక్.. ఈ సారి ఏకంగా 46 వేల యాప్‌లు..apple;american samoa;december;2020Sun, 03 Jan 2021 17:00:17 GMTఅమెరికా టెక్ దిగ్గజం యాపిల్ చైనాకు చెందిన యాప్‌లకు భారీ షాక్ ఇచ్చింది. చైనా స్టోర్‌ నుంచి యాపిల్ సంస్థ 39 వేల యాప్‌లను తొలగించింది. దీనికి కారణమేంటంటే.. ఈ యాప్‌లు మొత్తం 2020 ఏడాది చివరి రోజు వరకు లైసెన్స్‌‌ను పొందలేదు. ఈ కారణంగానే తాము 39 వేల యాప్‌లను తమ స్టోర్‌ నుంచి తొలగించినట్టు వెల్లడించింది. ఇక్కడ మరో విశేషమేంటంటే.. యాపిల్ సంస్థ తమంతట తాము తీసుకున్న నిర్ణయమేమీ కాదిది. చైనా అథారిటీలు లైసెన్స్‌ లేని యాప్‌లను నిషేధించాలని నిర్ణయించి అందుకు తగ్గట్టుగా ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో యాపిల్‌ సంస్థ చైనా అథారిటీలు ఏ విధమైన ఆదేశాలు జారీ చేశాయో వాటికి అనుగుణంగా చర్యలు తీసుకుంది.

ఇవే కాకుండా మరో 7 వేల యాప్‌లను కూడా యాపిల్ స్టోర్ నుంచి తొలగించింది. అంటే.. ఆ యాప్‌లు ఈ 39 వేల యాప్‌లతో కలిపి మొత్తంగా 46 వేల యాప్‌లను డిసెంబర్‌ 31న స్టోర్ నుంచి తీసేసింది. ఇక యాపిల్ తొలగించిన యాప్‌లలో కొన్ని ప్రముఖ యాప్‌లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో ఎన్‌బిఎ 2కె20 కి చెందిన గేమ్స్‌, యూబీ సాఫ్ట్‌ టైటిల్‌ అసాసిన్‌కు చెందిన క్రీడ్‌ ఐడెంటిటి కూడా ఈ వేటు పడిన వాటిలో ఉన్నాయి. ప్రముఖ యాప్‌లు చాలా వరకు డిసెంబర్ 31 నుంచి అందుబాటులో లేకుండా పోయినట్టు రీసెర్చ్‌ సంస్థ క్విమై వెల్లడించింది.

టాప్ పెయిడ్ గేమ్స్‌ విషయానికి వస్తే.. అందులో కూడా 1500 టాప్‌ పెయిడ్‌ గేమ్స్‌లో కేవలం 74 గేమ్స్ మాత్రమే ఈ వేటు నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. వీటిని ఎందుకు తొలగించాల్సి వచ్చిందంటే.. గేమ్‌ యాప్స్‌ అన్నీ ప్రభుత్వ లైసెన్స్‌ నెంబర్‌ను 2020 జూన్‌లోపు అందజేయాలని తొలుత యాపిల్‌ తెలిపింది. ఆ తరువాత ఈ గడువును డిసెంబర్‌ 31 వరకు పెంచింది. ఈ గడువులోగా స్పందించని అన్ని యాప్‌లను స్టోర్ నుంచి తొలగించింది.




టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని చెన్నైలో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!

కాంగ్రెస్, శివసేన మధ్య విబేధాలు.. మహా ప్రభుత్వం పడిపోతుందా..!

2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>