PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-pawan-kalyan-has-chance-to-enter-to-assembly8ea3bcdb-6b73-4cb2-b79b-d6bf2284e6d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-pawan-kalyan-has-chance-to-enter-to-assembly8ea3bcdb-6b73-4cb2-b79b-d6bf2284e6d2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల విషయంలో జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఈ దాడులపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. రాజకీయంగా ఏపీలో భిన్నమైన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో జరుగుతున్న దాడులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. బిజెపి జనసేన పార్టీ నేతలు ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నారనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక ఇదిలా ఉంటే దీని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు సున్నిత సమయంలోpawan kalyan;pawan;kalyan;pavani;bharatiya janata party;andhra pradesh;janasena;rajya sabha;police;janasena party;rama tirtha;reddy;partyఏపీ పోలీసులను టార్గెట్ చేసిన పవన్ఏపీ పోలీసులను టార్గెట్ చేసిన పవన్pawan kalyan;pawan;kalyan;pavani;bharatiya janata party;andhra pradesh;janasena;rajya sabha;police;janasena party;rama tirtha;reddy;partySun, 03 Jan 2021 10:24:13 GMTఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల విషయంలో జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఈ దాడులపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. రాజకీయంగా ఏపీలో భిన్నమైన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో జరుగుతున్న దాడులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. బిజెపి జనసేన పార్టీ నేతలు ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నారనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక ఇదిలా ఉంటే దీని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.

పోలీసులు సున్నిత సమయంలో సంయమనంతో వ్యవహరించలేదు అని ఆయన ఆరోపించారు. రామతీర్థం క్షేత్రంలో కోదండరామ స్వామి విగ్రహం తల నరికి వేస్తే భక్తుల మనోభావాలు ఎంతో తీవ్రంగా గాయపడ్డాయి అని అన్నారు. ఈ ఘాతుక చర్యను నిరసించిన వారిపై ఆ క్షేత్రంలో పోలీసులు వ్యవహరించిన విధానం  అప్రజాస్వామికంగా ఉంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.  భారతీయ జనతా పార్టీ నాయకురాలు రెడ్డి పావని గారు సొమ్మసిల్లి పోయే విధంగా పోలీసులు దురుసుగా వ్యవహరించారు అని తీవ్ర విమర్శలు చేసారు.

ఆ వ్యవస్థ ఎవరి కోసం పని చేస్తుందో అర్థం అవుతుంది అని అన్నారు. అధికార పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు తమ పార్టీ వాళ్ళతో జెండాలు పట్టుకుని మరీ కొండ ఎక్కుతుంటే సహకరించిన పోలీసులు... ఈ ఘటనపై నిరసన తెలుపుతున్న వారి గొంతులు నొక్కడం, లాఠీలతో విరుచుకుపడటాన్ని ఖండిస్తున్నాం అని అన్నారు. ఆలయాలపై దాడులను అరికట్టడంలో విఫలమైన పోలీసు వ్యవస్థ.. దురదృష్టకర ఘటనలను నిరసించే వారిని మాత్రం కట్టడి చేస్తుంది అని ఆయన మండిపడ్డారు. నిరసన తెలపడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక హక్కు అన్నారు. దీనిని కాలరాయాలని, తద్వారా తప్పులను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేయవద్దని పోలీసులకు తెలియజేస్తున్నానని అన్నారు.


ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్న వంటలక్క.. ఎందుకో తెలుసా..?

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..

ఇక్కడ హీరో.. అక్కడ విలన్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>