PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ntr-jagan1a3e39bb-c198-4739-90e5-e234955b47e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ntr-jagan1a3e39bb-c198-4739-90e5-e234955b47e8-415x250-IndiaHerald.jpgఇప్ప‌ట‌కీ ఆయ‌న దేవుడిగా ఉన్నారంటే అందుకు ప‌క్కా ఇళ్ల నిర్మాణ‌మే కార‌ణం. జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు సంక్షేమ ప‌థ‌కాల రూపంలో భారీ ఎత్తున న‌గ‌దు ప్ర‌జ‌ల అక్కౌంట్ల‌లో వేస్తూ వ‌స్తున్నారు. అయితే ఇది ఖ‌చ్చితంగా ఓట్లు రాలుస్తుందా ? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. న‌గ‌దు ఎలా వ‌స్తుందో ? అలాగే ఖ‌ర్చ‌యిపోతుంది. అదే ప‌క్కా ఇళ్లు నిర్మించి ఇస్తే వీటి జీవితం క‌నీసం 30 నుంచి 40 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. అప్పుడు జ‌గ‌న్‌కు ఊహ‌కే అంద‌ని పొలిటిక‌ల్ మైలేజ్ వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. నాడు ఎన్టీఆర్ ఎలా అయితే మూడు ద‌శాబ్దాల‌కు పntr jagan;ntr;deva;jeevitha rajaseskhar;tara;tiru;andhra pradesh;cm;letter;nandamuri taraka rama raoనాడు ఎన్టీఆర్‌.. నేడు జ‌గ‌నే... మ‌రో 30 ఏళ్లు రాసిపెట్టుకోండి...!నాడు ఎన్టీఆర్‌.. నేడు జ‌గ‌నే... మ‌రో 30 ఏళ్లు రాసిపెట్టుకోండి...!ntr jagan;ntr;deva;jeevitha rajaseskhar;tara;tiru;andhra pradesh;cm;letter;nandamuri taraka rama raoSun, 03 Jan 2021 10:13:52 GMTఏపీ సీఎం జ‌గ‌న్ పొలిటిక‌ల్ లెక్క‌ల్లో ఆరితేరిపోతున్నారు. మ‌రో ముప్ఫై ఏళ్లు సీఎంగా ఉంటాన‌ని గ‌తంలో ప‌దే ప‌దే చెప్పే జ‌గ‌న్ ఇప్పుడు అందుకు అనుగుణంగానే ప‌క్కా స్ట్రాట‌జీతో పునాది వేసుకుంటోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ నాయ‌కుడు చేప‌ట్టని విధంగా ఒకేసారి ఏకంగా 31 ల‌క్ష‌ల మందికి ప‌క్కా ఇళ్లు నిర్మించి ఇచ్చే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఒకేసారి 31 ల‌క్ష‌ల మందికి ఇళ్ల స్థ‌లాలు, ప‌ట్టాలు ఇవ్వ‌డంతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వ‌డం అంటే ఆ కుటుంబాలు, వారి వార‌సులు అంద‌రూ కూడా జ‌గ‌న్‌కు ఎప్పుడూ న‌మ్మ‌కంతో ఉంటారు.

నాడు ఎన్టీఆర్ ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా చెర‌గ‌ని ముద్ర వేసుకుని.. ఇప్ప‌ట‌కీ ఆయ‌న దేవుడిగా ఉన్నారంటే అందుకు ప‌క్కా ఇళ్ల నిర్మాణ‌మే కార‌ణం. జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు సంక్షేమ ప‌థ‌కాల రూపంలో భారీ ఎత్తున న‌గ‌దు ప్ర‌జ‌ల అక్కౌంట్ల‌లో వేస్తూ వ‌స్తున్నారు. అయితే ఇది ఖ‌చ్చితంగా ఓట్లు రాలుస్తుందా ? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. న‌గ‌దు ఎలా వ‌స్తుందో ? అలాగే ఖ‌ర్చ‌యిపోతుంది. అదే ప‌క్కా ఇళ్లు నిర్మించి ఇస్తే వీటి జీవితం క‌నీసం 30 నుంచి 40 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది.

అప్పుడు జ‌గ‌న్‌కు ఊహ‌కే అంద‌ని పొలిటిక‌ల్ మైలేజ్ వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. నాడు ఎన్టీఆర్ ఎలా అయితే మూడు ద‌శాబ్దాల‌కు పైగా.. ఇంకా చెప్పాలంటే నేటికి ప్ర‌జ‌లు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల మ‌దిలో ఎలా నిలిచిపోయాడో నేడు జ‌గ‌న్ కూడా అదే ప్లాన్‌తో ముందుకు వెళుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. 31 ల‌క్ష‌ల ఇళ్లు అంటే క‌నీసం కోటిమందికి పైగా ల‌బ్ధి పొందుతారు.. వీరిలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కూడా ఓట‌ర్లు అయ్యే వాళ్లు చాలా మంది ఉంటారు.

ఈ ఇళ్లు 2024కు పూర్త‌య్యే అవ‌కాశం ఉంది. ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు ఇది తిరుగులేని పొలిటిక‌ల్ కార్డు అవుతుంది. ఒక వేళ జ‌మిలీ ఎన్నిక‌లు వ‌చ్చినా జ‌గ‌న్‌కే ప్ల‌స్ అవుతుంది. జ‌గ‌న్ ఈక్వేష‌న్ క‌రెక్టుగా సెట్ అయితే ఎన్టీఆర్‌లా ముఫ్ఫై ఏళ్ల పాటు ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఉండిపోవ‌డం ఖాయం. 


ఏపీలో విగ్ర‌హ విధ్వంస రాజ‌కీయం వెన‌క...అందుకేనా ఈ కుట్ర‌...!

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..

ఇక్కడ హీరో.. అక్కడ విలన్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>