PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-on-rama-theertham-incident-5b8ac744-b894-49bc-9364-f43b70698071-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-on-rama-theertham-incident-5b8ac744-b894-49bc-9364-f43b70698071-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలపై ఆ పార్టీ నేతల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకు వెళ్ళ వలసిన తరుణంలో వివాదాస్పద నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా కొంతమంది కీలక నేతలను ఆయన వెంటేసుకుని తిరగడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అవకాశాలchandrababu;cbn;telugu desam party;andhra pradesh;district;telugu;yuva;partyచంద్రబాబుకి వాళ్ళు దూరం జరిగారా...?చంద్రబాబుకి వాళ్ళు దూరం జరిగారా...?chandrababu;cbn;telugu desam party;andhra pradesh;district;telugu;yuva;partySun, 03 Jan 2021 18:17:32 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలపై ఆ పార్టీ నేతల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకు వెళ్ళ వలసిన తరుణంలో వివాదాస్పద నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా కొంతమంది కీలక నేతలను ఆయన వెంటేసుకుని తిరగడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అవకాశాలు తక్కువగా ఉన్న సమయంలో కొత్తవారిని పార్టీ తరఫున ముందుకు తీసుకు రావలసిన అవసరం అనేది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్తే ఈ పర్యటనలో యువ నేతలను పక్కన పెట్టి సీనియర్ నేతలు ఎక్కువగా ఉన్నారు. దీంతో అక్కడున్న యువ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది.

చాలా మంది కీలక నేతలు కూడా పార్టీలో ఇప్పుడు చంద్రబాబు విజయనగరం పర్యటనకు దూరంగా ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని మరింత దిగజారుస్తున్నారు అని ఆవేదన ఆ పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. చంద్రబాబునాయుడు విజయనగరం వెళ్లిన సందర్భంగా కొంతమంది నేతలు రోడ్ల మీద కాస్త హడావిడి చేశారు. ఈ హడావుడి చేసిన నేతలు అందరూ కూడా సీనియర్ నేతలే కావడం గమనార్హం. భవిష్యత్తులో కూడా పార్టీ ఇదే విధంగా ముందుకు వెళ్తే అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే తన వైఖరి మార్చుకోకపోతే మాత్రం పార్టీ పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన ఏం చేస్తారు ఏంటి అనేది చూడాలి.


జేసి బ్రదర్స్ కి మరో షాక్

దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఇప్పుడు పరిస్థితి ఏంటి..?

బుల్లిపిట్ట: చైనాకు భారీ షాక్.. ఈ సారి ఏకంగా 46 వేల యాప్‌లు..

ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!

కాంగ్రెస్, శివసేన మధ్య విబేధాలు.. మహా ప్రభుత్వం పడిపోతుందా..!

2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>