PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu979bcd21-f398-4460-89d8-abcbfaac6675-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu979bcd21-f398-4460-89d8-abcbfaac6675-415x250-IndiaHerald.jpgవిజయనగరం జిల్లాలో జరిగిన రామతీర్థం ఘటనపై తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏకంగా చంద్రబాబు రామతీర్థం యాత్ర పెట్టుకున్నారు. జగన్ పాలనలో హిందు ఆలయాలకు రక్షణ లేదంటున్నారు. రాముడిని కాపాడలేకపోయిన జగన్ రాజీనామా చేయాలంటున్నారు.. అంతా బాగానే ఉంది.. కానీ మరి ఏడాదిన్నర క్రితం వరకూ చంద్రబాబు అధికారంలో ఉన్నారు.. కదా.. అప్పట్లో జరిగిన ఘటన మాటేంటి అన్న ప్రశ్న ఉదయిస్తోంది. హిందూ దేవాలయాలపై దాడి చేసిన దుర్మార్గుడు, గోశాలను కూల్చివేసి గోవులకు నిలువ నీడ లేకుండా చేసిన నీచుడు చంద్రబాబు అంటూ వైసీపీ నేతలు చంద్రబchandrababu;ramu;godavari river;jagan;vijayawada;రాజీనామా;telugu;aqua;cow slaughter;traffic police;ycp;rama tirtha;yatraజైశ్రీరామ్ అని గొంతు చించుకుంటున్న బాబు.. ఫ్లాష్‌ బ్యాక్‌ చూస్తే షాకే..!?జైశ్రీరామ్ అని గొంతు చించుకుంటున్న బాబు.. ఫ్లాష్‌ బ్యాక్‌ చూస్తే షాకే..!?chandrababu;ramu;godavari river;jagan;vijayawada;రాజీనామా;telugu;aqua;cow slaughter;traffic police;ycp;rama tirtha;yatraSun, 03 Jan 2021 09:00:00 GMTయాత్ర పెట్టుకున్నారు. జగన్ పాలనలో హిందు ఆలయాలకు రక్షణ లేదంటున్నారు. రాముడిని కాపాడలేకపోయిన జగన్ రాజీనామా చేయాలంటున్నారు.. అంతా బాగానే ఉంది.. కానీ మరి ఏడాదిన్నర క్రితం వరకూ చంద్రబాబు అధికారంలో ఉన్నారు.. కదా.. అప్పట్లో జరిగిన ఘటన మాటేంటి అన్న ప్రశ్న ఉదయిస్తోంది.

హిందూ దేవాలయాలపై దాడి చేసిన దుర్మార్గుడు, గోశాలను కూల్చివేసి గోవులకు నిలువ నీడ లేకుండా చేసిన నీచుడు చంద్రబాబు అంటూ వైసీపీ నేతలు చంద్రబాబు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తున్నారు. అయ్యప్పస్వామి మాల వేసుకుంటే లిక్కర్‌ ఆదాయం తగ్గిపోతుందని చెప్పాడని.. ఎవరైనా పాపాలు చేస్తేనే గుడిలోకి వెళ్తారని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేసుకుంటున్నారు.

2015 నుంచి ఆలయాలపై దాడులు, చోరీలు జరిగిన కేసులు ఒకసారి చూస్తే.. 2015లో 290 కేసులు, 2016లో 322 కేసులు, 2017లో 318 కేసులు, 2018లో 267 కేసులు, 2019లో 305 కేసులు, 2020లో 340 కేసులు ఉన్నాయి. ఇవి పోలీస్ శాఖ రికార్డుల్లో ఉన్న లెక్కలే.. మరి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఇన్ని కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.  

ప్రశాంతంగా పాలన జరుగుతున్న రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు రాముడి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో నీ ప్రమేయం లేదని రామతీర్థంలోనే ప్రమాణం చేసి ఉంటే ప్రజలు నమ్మేవారు కదా అని అంటున్నారు. రామతీర్థం చైర్మన్‌ అశోక్‌ గజపతిరాజేనని.. కానీ.. ఘటన జరిగిన తరువాత అశోక్‌ గజపతి రాజు ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. అలాగే చంద్రబాబు హయాంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు జరిపించారని.. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ఓవర్ యాక్షన్ కారణంగానే అప్పట్లో భక్తులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు.




అసలు అమరావతి ఉద్యమం ఎందుకు...? జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>