Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/wanted-poster879067f4-e6b4-4363-9fe2-89f81eeeceb4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/wanted-poster879067f4-e6b4-4363-9fe2-89f81eeeceb4-415x250-IndiaHerald.jpg‘వాంట్ డెడ్ ఆర్ ఎలైవ్’ అని రాసి దొంగలను, కిల్లర్లను పట్టుకోవడానికి ఒకప్పుడు వారి ఫొటోలతో బౌంటీ పోస్టర్లు వేసేవారు. అయితే ఎప్పుడైనా ఓ సీఎం పోస్టర్‌ను అలా చూశారా..? అది కూడా ఆ సీఎంను చంపితే లక్షల డాలర్లు ఇస్తామని ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టర్ కూడా ఎక్కడో విదేశాల్లో..wanted poster;pithe;amarinder singh;police;cm;december;job;local language;posters;central government;punjabసీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్wanted poster;pithe;amarinder singh;police;cm;december;job;local language;posters;central government;punjabSun, 03 Jan 2021 10:12:00 GMTఇంటర్నెట్ డెస్క్: ‘వాంట్ డెడ్ ఆర్ ఎలైవ్’ అని రాసి దొంగలను, కిల్లర్లను పట్టుకోవడానికి ఒకప్పుడు వారి ఫొటోలతో బౌంటీ పోస్టర్లు వేసేవారు. అయితే ఎప్పుడైనా ఓ సీఎం పోస్టర్‌ను అలా చూశారా..? అది కూడా ఆ సీఎంను చంపితే లక్షల డాలర్లు ఇస్తామని ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టర్ కూడా ఎక్కడో విదేశాల్లో కాదు.. మన దేశంలోనే.. పంజాబ్‌ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను చంపితే మిలియన్ డాలర్లు రివార్డు అంటూ ఓ పోస్టర్ పంజాబ్‌లో కనిపించిది. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏకంగా ముఖ్యమంత్రిని చంపేస్తే.. మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తానంటూ పోస్టర్ ప్రత్యక్షం కావడంతో ఈ పోస్టర్ ఎవరు వేశారు..? ఎప్పుడు వేశారు..? అనే తరహాలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సెక్టార్ 66-67 క్రాసింగ్ సమీపంలోని ఒక గైడ్ మ్యాప్‌పై పోస్టర్ అంటించారు. అసలు ఆ పోస్టర్ ఏముందంటే.. ‘పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ను చంపేస్తే.. మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తాం’ అని రాసివుంది.

సీఎంపై ఇలా పోస్టర్ వేసిన సంగతి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందితుడు పోస్టర్‌పై ఈ-మెయిల్ అడ్రస్‌ను ముద్రించడంతో పోలీసులు దాని ఆధారంగా విచారణ సాగిస్తున్నారు. ఈ పోస్టర్ వేసిన అగంతుకుడిపై ఐపీసీ సెక్షన్ 504, 506, 120బీ ప్రకారం పంజాబ్ ప్రివెన్షన్ ఆఫ్ డీఫేస్‌మెంట్ ప్రాపర్టీ ఆర్డినెన్స్ యాక్ట్ 1997 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మొహాలీ సిటీ పోలీసులు తెలిపారు.

దీనికి తోడు పోస్టర్ వేసిన సమీపంలోనే ఓ సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులకు లభించింది. ఆ ఫుటేజ్ ఆధారంగా అగంతకుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, డిసెంబర్ 31వ తేదీన ఈ పోస్టర్ వేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాష్ట్ర సీఎంపైనే ఇలాంటి పోస్టర్ రావడంతో పోలీసులు సీరియస్‌గా ఈ కేసును టేకప్ చేస్తున్నారు. ఆకతాయిల పనా? లేక కుట్ర దాగి ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే కేంద్రం ప్రవేశ పెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఎక్కువగా పంజాబ్ రైతులే ఆందోళన చేస్తున్నారు. వారికి మొదటినుంచీ సీఎం అమరీందర్ సింగ్ మద్దతు ఉంది. ఒకవేళ దీనివల్లే ప్రత్యర్థులు ఆయనపై ఇలాంటి పోస్టర్ విడుదల చేశారా..? అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే నిందితుడిని త్వరలో పట్టుకుంటామని, న్యాయస్థానం ముందు నిలబెడతామని పోలీసులు చెబుతున్నారు.


ఏపీలో విగ్ర‌హ విధ్వంస రాజ‌కీయం వెన‌క...అందుకేనా ఈ కుట్ర‌...!

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..

ఇక్కడ హీరో.. అక్కడ విలన్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>