Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/south-africab0c4d11b-2bd5-4d2e-a911-9eb39ec59979-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/south-africab0c4d11b-2bd5-4d2e-a911-9eb39ec59979-415x250-IndiaHerald.jpgక్రికెట్‌లో కొన్ని సార్లు కొన్ని వెరైటీ సన్నివేశాలను, అరుదైన ఘటనలను చూస్తుంటాం. వాటిలో కొన్ని మనల్సిన కడుపుబ్బా నవ్విస్తే.. మరి కొన్ని ఔరా అనిపిస్తాయి. అలాంటి ఓ సంఘటనే ఇటీవల సౌతాఫ్రికా-శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ రెండో మ్యాచ్‌లో కనిపించింది. ఆతిథ్య సౌత్‌ఆఫ్రికాతో..south africa;south africa;sri lanka;twitter;johannesburg;paruguక్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్south africa;south africa;sri lanka;twitter;johannesburg;paruguSun, 03 Jan 2021 19:40:51 GMTశ్రీలంక ఘోరంగా ఆడుతోంది. ఓపెనర్ కుశార్ పెరీరా తప్పితే మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ అలా వచ్చామా, ఇలా వెళ్లామా అన్నట్లు పెవిలియన్ బాట పట్టారు. దీంతో 100 పరుగుల లోపే 6 వికెట్లను కోల్పోయింది. ఇక మిగతా బ్యాట్స్‌మెన్‌ కూడా త్వరగా ఔట్ చేయాలని సౌత్‌ఆఫ్రికా కెప్టెన్ క్వింటన్ డీకాక్ అనుకున్నాడు.

ప్రత్యర్థులను త్వరగా పెవిలియన్ పంపించాలనే ఉద్దేశంతో డీకాక్ ఓ విచిత్రమైన ఫీల్డ్ సెటప్ చేశాడు. అది చూసి శ్రీలంక ఆటగాళ్లతో పాటు మ్యాచ్ చూస్తున్న వారంతా కూడా అవాక్కయ్యారు. ఎందుకంటే శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను త్వరగా ఔట్ చేయాలనే ఆలోచనతో డీకాక్ ఏకంగా 5గురు ఫీల్డర్లను స్లిప్‌లో మొహరించాడు. ఇలా ఒక్క స్లిప్‌లోనే ఐదుగురు ఫీల్డర్లను పెట్టడం చాలా అరుదు. దీంతో ఈ ఫోటోను ఐసీసీ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ‘అందరూ మంచి లయలో ఉన్నారు’ అంటూ దానికి ఓ ట్యాగ్‌ కూడా యాడ్ చేసింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే రెండో టెస్టులో టాస్‌ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. శ్రీలంక ఆటగాళ్లలో ఒక్క కుశార్ పెరీరా(60) మినహా ఎవరూ కూడా అర్థ సెంచరీ కూడా చేయలేదు. ఇక ఆల్‌రౌండర్ హసిరంగ డిసిల్వ(29), బౌలర్ దుష్మంత చమీర(22) తప్ప మరెవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో 157 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లు నోర్ట్‌జేకు 6 వికెట్లు దక్కగా, మల్డర్‌‌కు 3 వికెట్లు దక్కాయి. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది.

" style="height: 426px;">




తుమ్మలను ప్రగతి భవన్ కు పిలిచిన కేసీఆర్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

నచ్చకపోతే వచ్చి ఆడకండి.. టీమిండియాకు క్వీన్స్‌ల్యాండ్ వార్నింగ్

దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఇప్పుడు పరిస్థితి ఏంటి..?

బుల్లిపిట్ట: చైనాకు భారీ షాక్.. ఈ సారి ఏకంగా 46 వేల యాప్‌లు..

ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!

కాంగ్రెస్, శివసేన మధ్య విబేధాలు.. మహా ప్రభుత్వం పడిపోతుందా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>