PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganaa8e66dd-c6b1-4d9b-a58d-b1a61d5b1127-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganaa8e66dd-c6b1-4d9b-a58d-b1a61d5b1127-415x250-IndiaHerald.jpgఅటు టీడీపీకి బీజేపీ కూడా తోడు కావ‌డంతో ఇప్పుడు విగ్ర‌హాల విధ్వంసంపై టీడీపీ, బీజేపీ వాళ్లు చేస్తోన్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పుకోవ‌డంతోనే వైసీపీ నేత‌ల‌కు కాలం గ‌డుస్తోంది. అస‌లు ఏ రాష్ట్రంలోనూ ఒకేసారి 31 ల‌క్ష‌ల మందికి ఇళ్ల ప‌ట్టాల పంపిణీతో పాటు ఇళ్లు నిర్మించి ఇచ్చే గొప్ప కార్య‌క్ర‌మం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. ఈ ఇళ్ల నిర్మాణంతో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ల‌క్ష‌ల మందికి సొంత ఇంటి క‌ల నెర‌వేర‌డంతో పాటు ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. దీనిని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లి ఎంతో ల‌బ్ధి పొందాల్సjagan;tiru;bharatiya janata party;andhra pradesh;media;letter;tdp;ycpవైసీపీ ఆ ట్రాప్‌లో ప‌డిందే.... జ‌గ‌న్ ప్లాన్ రివ‌ర్స్‌...!వైసీపీ ఆ ట్రాప్‌లో ప‌డిందే.... జ‌గ‌న్ ప్లాన్ రివ‌ర్స్‌...!jagan;tiru;bharatiya janata party;andhra pradesh;media;letter;tdp;ycpSun, 03 Jan 2021 09:43:02 GMTఏపీ ప్ర‌భుత్వం ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 31 ల‌క్ష‌ల మందికి ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేస్తోంది. 15 రోజుల పాటు దీనిని పెద్ద పండ‌గ‌లా చేయాల‌ని సీఎం జ‌గ‌న్ తీర్మానించారు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలే స్వ‌యంగా ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేయాల‌ని.. ఈ ప‌థ‌కాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకు వెళ్లాల‌ని సూచించారు. ఈ ఇళ్ల ప‌ట్టాల పంపిణీ ప్రారంభ‌మై మూడు రోజులు గ‌డిచిందో లేదో అస‌లు దీని ఊసే లేదు. ప్ర‌స్తుతం ఏపీలో ఎవ్వ‌రూ చూసినా విగ్ర‌హాల రాజకీయం గురించే మాట్లాడుతున్నారు.

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయం అంతా విగ్ర‌హాల చుట్టూనే తిరుగుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు నందం సుబ్బ‌య్య హ‌త్య‌ను హైలెట్ చేస్తూ ఈ ప‌థ‌కం ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా స‌క్సెస్ అయిన టీడీపీ ఇప్పుడు విగ్ర‌హాల రాజ‌కీయాన్ని వాడుకుంటోంది. అటు టీడీపీకి బీజేపీ కూడా తోడు కావ‌డంతో ఇప్పుడు విగ్ర‌హాల విధ్వంసంపై టీడీపీ, బీజేపీ వాళ్లు చేస్తోన్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పుకోవ‌డంతోనే వైసీపీ నేత‌ల‌కు కాలం గ‌డుస్తోంది.

అస‌లు ఏ రాష్ట్రంలోనూ ఒకేసారి 31 ల‌క్ష‌ల మందికి ఇళ్ల ప‌ట్టాల పంపిణీతో పాటు ఇళ్లు నిర్మించి ఇచ్చే గొప్ప కార్య‌క్ర‌మం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. ఈ ఇళ్ల నిర్మాణంతో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ల‌క్ష‌ల మందికి సొంత ఇంటి క‌ల నెర‌వేర‌డంతో పాటు ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. దీనిని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లి ఎంతో ల‌బ్ధి పొందాల్సిన వైసీపీ ఇప్పుడు టీడీపీ, బీజేపీ ట్రాప్‌లో చిక్కుకుని అస‌లు దీనిని వ‌దిలేసి విగ్ర‌హాల చుట్టూ తిరుగుతోంది.

స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌తో రాష్ట్రంలో రాజ‌కీయం వేడెక్కుతోంది. ఇక బీజేపీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది. స‌డెన్‌గా సీన్లోకి ఎంట‌ర్ అయ్యి.. మ‌తం రంగు పులిమే ప్ర‌య‌త్నం చేస్తోంది. చంద్ర‌బాబు రామ‌తీర్థం ప‌ర్య‌ట‌న‌తో ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌గా రెచ్చ‌గొట్టిన‌ట్ల‌య్యింది. ఇక సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్టుగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు ఇప్పుడే మూడొచ్చిన‌ట్టుగా రెచ్చిపోతున్నారు. చివ‌ర‌కు ఓ గొప్ప కార్య‌క్ర‌మం ప్రారంభించేందుకు జ‌గ‌న్ విజ‌య‌న‌గ‌రం వెళితే.. దానికంటే చంద్ర‌బాబు రామ‌తీర్థం వెళ్లిందే హైలెట్ కావ‌డంతో పాటు మీడియా.. చివ‌ర‌కు వైసీపీ నేత‌లు కూడా దాని చుట్టే తిరుగుతున్నారు.

ఓ మంచి కార్య‌క్ర‌మం జ‌గ‌న్ మంచి ల‌క్ష్యంతో ప్రారంభిస్తే దానిని త‌మ త‌మ నియోజ‌కవ‌ర్గాల్లో హైలెట్ చేసుకోవ‌డం మానేసిన వైసీపీ వాళ్లు ప్ర‌తిప‌క్షాల‌ను విమ‌ర్శిస్తూ వాళ్ల గురించి చ‌ర్చ జ‌రిగేందుకు కార‌ణ‌మ‌వుతున్నారు.  


ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>