MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/resons-for-venkatesh-movie-vasu9200adb2-fb3b-4444-94e5-87c25540ccf6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/resons-for-venkatesh-movie-vasu9200adb2-fb3b-4444-94e5-87c25540ccf6-415x250-IndiaHerald.jpgసినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఎప్పుడు ఎలా రంగులు మారతాయో తెలియదు. అలాగే సినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్ల పరిస్థితి కూడా ఇంతే. వాళ్ళ జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మరొక సినిమా ప్లాప్ అవుతుందిvenkatesh movie vasu;pawan;ntr;venkatesh;kalyan;tara;trivikram srinivas;adinarayanareddy;tollywood;cinema;cinema theater;blockbuster hit;director;hero;heroine;nandamuri taraka rama rao;research and analysis wing;tholi prema;nuvvu naaku nachav;prematho raa;chitramవారిని నమ్మి సినిమా ఇస్తే ప్లాప్ చూడాల్సి వచ్చింది : వెంకటేష్వారిని నమ్మి సినిమా ఇస్తే ప్లాప్ చూడాల్సి వచ్చింది : వెంకటేష్venkatesh movie vasu;pawan;ntr;venkatesh;kalyan;tara;trivikram srinivas;adinarayanareddy;tollywood;cinema;cinema theater;blockbuster hit;director;hero;heroine;nandamuri taraka rama rao;research and analysis wing;tholi prema;nuvvu naaku nachav;prematho raa;chitramSun, 03 Jan 2021 11:00:00 GMTసినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఎప్పుడు ఎలా రంగులు మారతాయో తెలియదు. అలాగే సినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్ల పరిస్థితి కూడా ఇంతే. వాళ్ళ జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మరొక సినిమా ప్లాప్ అవుతుంది. అయితే ఇక్కడ గమనించాలిసిన విషయం ఏంటంటే  హిట్ అయిన సినిమాలో నటించిన  హీరో, ప్లాప్ అయిన సినిమాలో నటించిన హీరో ఇద్దరు ఒక్కరే. కానీ ఒక సినిమా హిట్ అయితే, టైం బాలేక మరొక సినిమా ఫట్ అవుతుంది. అలా  కొన్ని సినిమాలు ఎందుకు ప్లాప్ అవుతాయో తెలీదు’ దీనికి కారణాలు ఏవన్నా ఉండొచ్చు. కధ, కధనం, పాటలు, డాన్సులు, హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్, డైరెక్టర్.... ఇలా అన్ని కూడా ఒక సినిమాపై ప్రభావం చూపుతాయి. కొంతమందికి నచ్చిన సినిమా మరి కొంతమందికి నచ్చదు. ఎవరో ఒకరు సినిమా చూసి బాలేదు అంటే చాలు ఇంకా థియేటర్ కి వెళ్లడం మానేస్తారు. కానీ… అదే సినిమా టీవీల్లోనో లేదా ఆన్లైన్ లో వస్తే దానిని చూసి పర్వాలేదు బానే ఉంది... మన వాళ్ళకు టేస్ట్ లేదు అంటుంటారు. చాలా సినిమాల విషయాల్లో సోషల్ మీడియాలో వినిపించే కామెంట్లు ఇవే..!

ఈ నేపథ్యంలోనే మనం ఇప్పుడు విక్టరీ వెంకటేష్ నటించిన  50వ చిత్రం అయిన ‘వాసు’ గురించి మాట్లాడుకుందాం..! ‘విక్టరీ వెంకటేష్  గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో విక్టరీ ఒకరు.  ఆయన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అప్పట్లో ఆయన నటించిన  దేవీ పుత్రుడు’ ‘ప్రేమతో రా’ వంటి చిత్రాలు ప్లాప్ అయ్యాయి. తరువాత మళ్ళీ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి  మన వెంకీ మళ్ళీ విజయం పధంలో దూసుకుపోతున్న  రోజులవి. వెంకీ నటించిన  49వ సినిమా ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ అవ్వడానికి ముఖ్య కారణమైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ను మళ్ళీ  తన 50వ చిత్రం అయిన వాసు సినిమాకి  కూడా  రచయితగా పెట్టుకున్నాడు వెంకీ. అలాగే పవన్ కళ్యాణ్ కు ‘తొలిప్రేమ’ వంటి ఆల్ టైం క్లాసిక్ అందించిన కరుణాకరణ్ ‘వాసు’ చిత్రానికి దర్శకుడు. మరి ఈ ముగ్గురి కాంబినేషన్ అంటే  అంచనాలు భారీ  రేంజ్లో ఉంటాయి కదా. కానీ ఆ అంచనాలను తారుమారు చేసింది 'వాసు' సినిమా. కానీ అదే  చిత్రాన్ని ఇప్పుడు టీవీల్లో చూసి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ థియేటర్లకు మాత్రం జనాలు వెళ్ళలేదు.


అసలు అలా జరగడానికి కారణం  ఏంటని కొందరి విశ్లేషకులను అడిగితే ప్రజల అభిప్రాయాలను ఇలా చెప్పుకొచ్చారట.. అప్పటికే వెంకీ వయసు 40ఏళ్ళ. అలా వయసు మించిన వెంకటేష్ ను  యూత్ అంటే జనాలు జీర్ణించుకోలేకపోయారని జవాబిచ్చారు. వాసు సినిమాలో వెంకటేష్ ఒక యూత్ క్యారెక్టర్ లో పాటలు పాడే యువకుడు పాత్రలో నటించాడు. కరెక్ట్ గా ఆ సినిమా రిలీజ్ టైములోనే,  ఎన్టీఆర్ వంటి యంగ్ హీరో నటించిన  ‘ఆది’ సినిమా  థియేటర్లలో సందడి చేస్తుంది. అదే సమయంలో వెంకీ యూత్ అంటూ మైక్ పట్టుకుని తిరగడం జనాలకి కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపించింది.  అయితే అదే సినిమా వెంకీ కాస్త ముందుగా చేసి ఉన్నా,  లేదంటే వేరే యంగ్ హీరో చేసిన గాని ఆ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదని వారు చెబుతున్నారు. వెంకీ సినిమా అంటే కమర్షియల్ హంగులతో ఉండాలని అభిమానులు కూడా కోరుకుంటారు.. కానీ ‘వాసు’ లో అవి మిస్ అయ్యాయని అర్ధం చేసుకోవచ్చు..


క‌రోనాపై భార‌త్ విజ‌యం.. త‌గ్గుతున్న కేసులు..పెరుగుతున్న రిక‌వ‌రీ

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>