MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-samantha8b51c506-6c50-4416-ab15-e99b65758480-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-samantha8b51c506-6c50-4416-ab15-e99b65758480-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల వ్యక్తిగత విషయాలు గోప్యంగానే ఉంచబడతాయి. ముఖ్యంగా స్టార్స్ ఇళ్ళల్లో ఏ విషయమైనా అంత సామాన్యంగా బయటకు పొక్కదు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని కొద్దో గొప్ప కొన్ని విషయాలు బయటపడుతుంటాయి. కానీ కొన్ని సందర్భాలలో స్టార్ట్ కూడా తమకు తామే వ్యక్తిగత జీవితాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంటారు. ప్రస్తుతం ఒక షో ద్వారా అల్లు అర్జున్ కూడా తన వ్యక్తిగత జీవితం లో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నాడు.alluarjun,samantha;chiranjeevi;rana;allu aravind;allu arjun;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;prithy;rakul preet singh;sam;samantha;media;television;marriage;producer;producer1;hero;allu sneha;arjun 1;father;manam;sam mendesతన వ్యక్తిగత విషయాలను బయటపెట్టిన స్టైలిష్ స్టార్!తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టిన స్టైలిష్ స్టార్!alluarjun,samantha;chiranjeevi;rana;allu aravind;allu arjun;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;prithy;rakul preet singh;sam;samantha;media;television;marriage;producer;producer1;hero;allu sneha;arjun 1;father;manam;sam mendesSun, 03 Jan 2021 15:21:00 GMTసాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల వ్యక్తిగత విషయాలు గోప్యంగానే ఉంచబడతాయి. ముఖ్యంగా స్టార్స్ ఇళ్ళల్లో ఏ విషయమైనా అంత సామాన్యంగా బయటకు పొక్కదు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని కొద్దో గొప్ప కొన్ని విషయాలు  బయటపడుతుంటాయి. కానీ కొన్ని సందర్భాలలో స్టార్ట్ కూడా తమకు తామే వ్యక్తిగత జీవితాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంటారు. ప్రస్తుతం ఒక షో ద్వారా  అల్లు అర్జున్ కూడా తన వ్యక్తిగత జీవితం లో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నాడు.

ప్రస్తుతం అక్కినేని వారి కోడలు అక్కినేని సమంత ఆహా టీవీ లో నిర్వహిస్తున్న  "సామ్ జామ్" అనే ప్రోగ్రాం కి  ఎంతో మంది ప్రముఖులు ఆ ప్రోగ్రాం కి వస్తున్నారు.వారి వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఇప్పటివరకు రానా, రకుల్ ప్రీతి, చిరంజీవి లాంటి స్టార్ హీరో హీరోయిన్లు ఆ ప్రోగ్రాంకి వచ్చి వారి వారి వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సమంతతో షేర్ చేసుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి కూడా సామ్ జామ్  ప్రోగ్రాం కి వచ్చి తన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను సమంతతో షేర్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

అయితే ఇటీవల అల్లు అర్జున్ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చాడు.ఇందులో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను సమంతతో పంచుకున్నాడు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. " పెళ్లి కాక ముందు ఇంట్లో  చాలా బూతులు మాట్లాడేవాడిని. పెళ్లయిన తర్వాత స్నేహ కొంతవరకు అదుపులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు తండ్రి అయ్యాక ఇంట్లో బూతులు మాట్లాడటం పూర్తిగా మానేశాను అంటూ నవ్వుతూ" చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా  నా  వ్యక్తిగత జీవితంలో ఒక సంఘటన జరిగింది.అదే నాకు అతి పెద్ద టర్నింగ్ పాయింట్ అంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. అనంతరం ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. అల్లు అరవింద్ ను కూడా సమంత అల్లు అర్జున్ గురించి ఒక ప్రశ్న అడిగింది. అది ఏంటంటే? ఇప్పుడైతే అల్లు అర్జున్ హార్డ్ వర్కింగ్, క్రమశిక్షణగా ఉంటున్నారు.  చిన్నప్పుడు కూడా ఇంతే హార్డ్ వర్కింగ్, క్రమశిక్షణగా ఉండేవారా? అని సమంత అడిగింది. ఈ ప్రశ్నకు బదులుగా అల్లు అరవింద్ వెంటనే దండం పెట్టేశారు. అల్లు అర్జున్ గురించి అడగగానే అల్లు అరవింద్ పెట్టిన దండం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా, అది నెట్టింట్లో వైరల్ అవుతోంది.


2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>