PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr20a51f4c-a6ba-4e5e-b193-d76488002785-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr20a51f4c-a6ba-4e5e-b193-d76488002785-415x250-IndiaHerald.jpgవ్యవసాయంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులకు ఆయన నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. సాగు తీరు, సమస్యలు తెలుసుకుంటారు.తాజాగా సం గారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం రంజోల్‌ గ్రామానికి చెందిన రైతు నల్లా నాగేశ్వర్‌రెడ్డికి సీఎం ఫోన్‌ చేశారుcm kcr;kcr;jyothi;telangana;district;smart phone;chief minister;aqua;sangareddyసంగారెడ్డి రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్సంగారెడ్డి రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్cm kcr;kcr;jyothi;telangana;district;smart phone;chief minister;aqua;sangareddySun, 03 Jan 2021 16:29:42 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులకు ఆయన నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. సాగు తీరు, సమస్యలు తెలుసుకుంటారు. ఇటీవలే ఏపీకి చెందిన రైతుతో మాట్లాడి.. అతన్ని లంచ్ కు ఆహ్వానించారు కేసీఆర్. తాజాగా సం గారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం రంజోల్‌ గ్రామానికి చెందిన రైతు నల్లా నాగేశ్వర్‌రెడ్డికి సీఎం ఫోన్‌ చేశారు. నాలుగున్నర నిమిషాలపాటు అతనితో మాట్లాడారు. నాలుగు నెలల క్రితం రైతు నాగేశ్వర్‌రెడ్డితోపాటు మరో నలుగురు రైతులు సీఎం ఆహ్వానం మేరకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు వెళ్లారు. వారితో సీఎం సుమారు ఆరు గంటల పాటు పంటల సాగు గురించి చర్చించారు.


 కేసీఆర్, రైతు ఫోన్ సాగిందిలా...

సీఎం: మీ ప్రాంతంలో ఈ ఏడాది ఆలుగడ్డ సాగు ఎలా ఉంది?
రైతు: పంట సాగు ఆశాజనకంగా ఉంది సర్‌.. సాగు విస్తీర్ణమేమీ తగ్గలేదు.

సీఎం: ఎలాంటి రకాన్ని సాగు చేస్తున్నారు?
రైతు: జహీరాబాద్‌ ప్రాంతంలో 166 రకం సాగు చేస్తారు. దీన్ని కుఫ్రీగా పిలుస్తారు. జ్యోతి, ఖ్యాతి రకాల విత్తనాలు కూడా ఉన్నాయి. వాటిని ఈ ప్రాంతంలో సాగు చేయడం లేదు.

సీఎం: ఒక మొక్క బాగుంటే ఎన్ని గడ్డలు ఉంటాయి?
రైతు: 8 నుంచి 10 గడ్డల వరకు ఉంటాయి.

సీఎం: ఇంతమేర గడ్డలుంటే పంట దిగుబడి బాగా వచ్చినట్లా?
రైతు: అవును సార్‌

సీఎం: ఎంత బరువు తూగుతుంది?
రైతు: కిలో మేర తూగుతుంది.

సీఎం: ఎకరాకు ఎన్ని బస్తాల విత్తనం ఉపయోగిస్తారు?
రైతు: 15 నుంచి 16 బస్తాలు వాడుతాం. పంటను బెడ్‌ విధానంలో వేశాం. పంట వేసి 45 రోజుల వరకు అయింది.

సీఎం: నేను 25 ఎకరాల్లో ఆలుగడ్డ పంట వేశా. పంట బాగుంది.
రైతు: ఎకరాకు 12 నుంచి 15 టన్నుల మేర దిగుబడి వస్తుంది. ఒక బస్తా విత్తనానికి 16 బస్తాల వరకు పంట దిగుబడి వస్తుంది.

సీఎం: మార్కెట్లో ఆలుగడ్డ పంటకు ధర ఎలా ఉంది?
రైతు: ప్రస్తుతం ధర తగ్గింది. క్వింటాలుకు రూ.1,700 నుంచి రూ.2,000 మేర ధర పలుకుతోంది. కోహీర్‌ ప్రాంతంలో ఎర్ర నేలలు ఉన్నందున పంట ఎరుపురంగులో వస్తుంది. దీనికి ధర తక్కువగా ఉంటుంది. రేగడి నేలల్లో వచ్చే పంట తెలుపు రంగులో ఉండటంతో ధర కొంత ఎక్కువ ఉంటుంది.

సీఎం: ఎన్ని రోజుల్లో పంటను తీస్తారు?
రైతు: 85 రోజుల్లో పంట చేతికొస్తుంది. పక్షం రోజుల ముందు నుంచే నీటి తడులు ఇవ్వడాన్ని నిలిపివేస్తాం.

సీఎం: నేను ఇంకా పంట తీయలేదు. పంట తీసే సమయంలో పిలిపిస్తా.
రైతు: సరే సార్‌.. నాలుగైదు మందిమి వస్తాం.
సీఎం: థ్యాంక్యూ

 


ఆ చిట్కా పాటిస్తే చేతులు మృదువుగా మారుతాయి. అది ఏంటో తెలుసా?

ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!

కాంగ్రెస్, శివసేన మధ్య విబేధాలు.. మహా ప్రభుత్వం పడిపోతుందా..!

2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>