MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prithviraj8a36977c-4691-4130-94d7-02cb93492359-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prithviraj8a36977c-4691-4130-94d7-02cb93492359-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు కమెడియన్ కమ్, పొలిటికల్ లీడర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృథ్వి రాజ్. మూడేళ్ల కింది వరకు కూడా వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈయనకు ఇప్పుడు టైమ్ అస్సలు కలిసిరావడం లేదు. పర్సనల్‌గా.. ప్రొఫెషనల్‌గా.. పొలిటికల్‌గా మూడు చోట్ల కూడా ఈయన దెబ్బ తింటున్నాడు. ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే సినిమాలు రావడం లేదు.. మరోవైపు రాజకీయాల్లో కూడా ఉన్న పదవి కాస్తా ఊడిపోయింది. prithviraj;prudhvi raj;pruthvi;raj;tiru;రాజీనామా;tirupati;audio;comedian;ycp;leader;tirumala tirupathi devasthanam;sri venkateswara bhakti channelఆ ఇష్యూపై పృథ్వీ రాజ్ ఆసక్తికర విషయాలు..!?ఆ ఇష్యూపై పృథ్వీ రాజ్ ఆసక్తికర విషయాలు..!?prithviraj;prudhvi raj;pruthvi;raj;tiru;రాజీనామా;tirupati;audio;comedian;ycp;leader;tirumala tirupathi devasthanam;sri venkateswara bhakti channelSun, 03 Jan 2021 09:00:00 GMTకమెడియన్ కమ్, పొలిటికల్ లీడర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృథ్వి రాజ్.  మూడేళ్ల కింది వరకు కూడా వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈయనకు ఇప్పుడు టైమ్ అస్సలు కలిసిరావడం లేదు. పర్సనల్‌గా.. ప్రొఫెషనల్‌గా.. పొలిటికల్‌గా మూడు చోట్ల కూడా ఈయన దెబ్బ తింటున్నాడు. ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే సినిమాలు రావడం లేదు.. మరోవైపు రాజకీయాల్లో కూడా ఉన్న పదవి కాస్తా ఊడిపోయింది.

వైసీపీలో కీలకంగా ఉన్న ఈయనకు ఆ మధ్య ఎస్విబిసి చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయితే అక్కడ ఏదో తేడాలు జరిగి ఈయన పదవి కాస్తా పోయింది. కావాలనే కొందరు కుట్ర చేసి తన పదవి పోగొట్టారని చెప్పుకొచ్చాడు పృథ్వీ. ప్రభుత్వమే ఆయన చేత రాజీనామా చేయించిందని కొందరు అనే వాళ్లు లేకపోలేరు. ఇవన్నీ పక్కనబెడితే పృథ్వీ రాజ్ గురించి ఇప్పుడు మరిన్ని విషయాలు కూడా బయటికి వస్తున్నాయి.

ఇక 30 ఇయర్స్‌ పృథ్వీ పేరు ఒకానొకప్పుడు అటు పాలిటిక్స్‌ లోనూ, ఇటు సినిమాల్లోనూ  మారుమ్రోగింది. సినిమాల్లో బాగా బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు పృథ్వీ. అటు ఆయన సపోర్ట్‌ చేసిన వైసీపీ విజయం సాధించగా... ఆ తర్వాత ఆయన ఎస్వీబీసీ చైర్మన్‌ పదవీ ఇచ్చారు. ఇక అక్కడ చోటు చేసుకున్న ఘటనలు, వివాదాల కారణంగా ఆయన పదవీ పోయిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ఇష్యూపై పృథ్వీ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. కొందరు కక్ష్య గట్టి ఆ ఆడియో టేపు ఇష్యూలో ఇరికించారని.. దాంతో తాను తిరుమల హిల్స్‌ నుంచి జుబ్లీహిల్స్‌ లో పడ్డానని పృథ్వీ అన్నారు. తిరుమలను ఇంకా అభివృద్ధి చెద్దామనుకుంటే.. అది అక్కడి వారికి నచ్చలేదని ఆరోపించారు. 35 మంది టీటీడీ ఉద్యోగులను పృథ్వీ తీసేస్తున్నాడని ఓ ప్రముఖ ఛానల్‌ తప్పుడు ప్రచారం చేసిందని.. దీంతో తనను ఓ ఆడదాన్ని అడ్డం పెట్టుకుని ఇలా ఇరికించారని సంచలన విషయాలు వెల్లడించారు. ఇలా ఇరికించిన వారికీ హ్యట్సాఫ్‌ అంటూ వారికి చురకలు అంటించారు. 


అసలు అమరావతి ఉద్యమం ఎందుకు...? జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>