PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/aligiri-stalin92ed48ff-d73d-4d7d-9ad2-358c09071d5a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/aligiri-stalin92ed48ff-d73d-4d7d-9ad2-358c09071d5a-415x250-IndiaHerald.jpgఅధికారానికి దూరం కావ‌డంతో ఈ సారి అయినా ఆ పార్టీకి అధికారం వ‌స్తుందా ? అన్న ఉత్కంఠ ఉండ‌గానే స్టాలిన్‌కు షాక్ ఇస్తూ ఆయ‌న అన్న అళ‌‌గిరి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. సోదరుడితో విబేధించి పార్టీ నుంచి బయటకొచ్చిన అళగిరి ప్రస్తుతం స్టాలిన్‌ను దెబ్బ కొట్టేందుకు స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అళ‌గిరి ఆదివారం భారీ స‌మావేశం ఏర్పాటు చేస్తున్నారు. త‌న‌కు ప‌ట్టున్న ద‌క్షిణ త‌మిళ‌నాడు, మ‌ధురై జిల్లాల‌కు చెందిన నేత‌లు, త‌న అనుచ‌రుల‌తో పాటు డీఎంకేలో అస‌మ్మ‌తి aligiri stalin;tiru;udhayanidhi stalin;assembly;letter;stalin;partyత‌మిళ రాజ‌కీయాల్లో మ‌రో ట్విస్ట్‌... స్టాలిన్‌కు అళ‌గిరి బిగ్ షాక్‌...!త‌మిళ రాజ‌కీయాల్లో మ‌రో ట్విస్ట్‌... స్టాలిన్‌కు అళ‌గిరి బిగ్ షాక్‌...!aligiri stalin;tiru;udhayanidhi stalin;assembly;letter;stalin;partySun, 03 Jan 2021 11:22:37 GMTఅసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఇప్ప‌టికే అన్నాడీఎంకే వ‌ర్సెస్ డీఎంకే మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోటీ ఉంటుంద‌ని అంచ‌నాలు ఉన్న నేప‌థ్యంలో ఇక్క‌డ రాజ‌కీయం ఎప్పుడు ?  ఎలా ?  మారుతుందో ?  కూడా ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఇప్ప‌టికే కమల్‌ హాసన్ పార్టీని ప్రకటించి ప్రజల్లోకి వెళుతున్నారు. ఆయ‌న త‌న పార్టీ గెలిచి తానే సీఎం అవుతాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇక తాను పార్టీ పెడ‌తాన‌ని బీరాలు పోయిన సూప‌ర్ స్టార్ ఇప్పుడు రీల్ సూప‌ర్‌స్టార్‌గా మిగిలిపోతూ తాను రాజ‌కీయాల‌కు దూరం అని ప్ర‌క‌టించేశారు.

ఇక త‌మిళ రాజ‌కీయాల‌ను ద‌శాబ్దాలుగా శాసిస్తూ వ‌స్తోన్న జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధి లేకుండా తొలిసారి జ‌రుగుతోన్న ఎన్నిక‌లు కావ‌డంతో అంద‌రూ ఇప్పుడు వీటి కోసం ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. గ‌త రెండుసార్లు డీఎంకే అధికారానికి దూరం కావ‌డంతో ఈ సారి అయినా ఆ పార్టీకి అధికారం వ‌స్తుందా ? అన్న ఉత్కంఠ ఉండ‌గానే స్టాలిన్‌కు షాక్ ఇస్తూ ఆయ‌న అన్న అళ‌‌గిరి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. సోదరుడితో విబేధించి పార్టీ నుంచి బయటకొచ్చిన అళగిరి ప్రస్తుతం స్టాలిన్‌ను దెబ్బ కొట్టేందుకు స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే అళ‌గిరి ఆదివారం భారీ స‌మావేశం ఏర్పాటు చేస్తున్నారు. త‌న‌కు ప‌ట్టున్న ద‌క్షిణ త‌మిళ‌నాడు, మ‌ధురై జిల్లాల‌కు చెందిన నేత‌లు, త‌న అనుచ‌రుల‌తో పాటు డీఎంకేలో అస‌మ్మ‌తి నేత‌ల‌ను కూడా ఈ స‌మావేశానికి ఆహ్వానిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ స‌మావేశంలో అళ‌గిరి కొత్త పార్టీ ఏర్పాటుపై ప్ర‌క‌ట‌న చేస్తారా ?  లేదా ఏం జ‌రుగుతుంది ? అన్న‌దే ఇప్పుడు స‌స్పెన్స్‌గా ఉంది. కొత్త పార్టీ ఏర్పాటు చేయ‌ని ప‌క్షంలో ఆయ‌న బీజేపీకే మ‌ద్ద‌తు ఇచ్చే అంశంపై నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని తెలుస్తోంది.

ఈ సమావేశంతో డీఎంకే పార్టీ ముఖ్య నేతల్లో ఆందోళన మొదలైంది. పార్టీ నుంచి ఎవరు వీడతారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అళ‌గిరి ఏం చేసినా అది స్టాలిన్ ముఖ్య‌మంత్రి పీఠంపై నీళ్లు చ‌ల్లిన‌ట్టే అయ్యే అవ‌కాశాలే ఎక్కువుగా ఉన్నాయి. ఆయ‌న గెలిచినా గెల‌వ‌క‌పోయినా స్టాలిన్‌ను ఓడించ‌డానికి ప‌నికొస్తాడ‌న్న‌దే ఇప్పుడు త‌మిళ పొలిటిక‌ల్ టాక్‌..?




బండ్ల గణేష్ అల్లు హీరోలకు దూరంగా ఉండటానికి కారణమిదేనా?

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>