PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/vangaveeti-ranga-radhakrishna-tdp-ysrcp91830070-df86-4450-83ee-796487e3927f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/vangaveeti-ranga-radhakrishna-tdp-ysrcp91830070-df86-4450-83ee-796487e3927f-415x250-IndiaHerald.jpg బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా వారసుడు రాధాకృష్ణ మళ్లీ యాక్టివ్ అయ్యేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ,ఆయన తనయుడు లోకేష్ ఆయన్ను అన్ని విషయాల్లోనూ ప్రోత్సహిస్తూ, ఆయనకు ప్రాధాన్యం ఇస్తూ వస్తుండడం, వైసీపీ లో చేర్చేందుకు ఏపీ మంత్రి కొడాలి నాని వంటి వారు గట్టిగానే ప్రయత్నాలు చేసినా, రాధ మాత్రం వైసీపీలోకి వెళ్లేందుకు ఒప్పుకోకపోవడం, అనుచరులు సైతం గట్టిగానే ఒత్తిడి చేస్తున్నా టిడిపిని వీడి వైసిపిలో చేరేందుకు ఆసక్తి చూపించకపోవడం వంటి కారణాలతో బాబు సైతం రాధా కు బాగా ప్రాధాన్యం ఇస్తునvangaveeti ranga radhakrishna tdp ysrcp;nani;kodali nani;amaravati;andhra pradesh;congress;minister;letter;tdp;success;ycp;lokesh kanagaraj;vangaveeti;vemuri radhakrishnaవంగవీటి వారసుడు రెఢీ ? యాక్టివ్ చేస్తున్న బాబు ?వంగవీటి వారసుడు రెఢీ ? యాక్టివ్ చేస్తున్న బాబు ?vangaveeti ranga radhakrishna tdp ysrcp;nani;kodali nani;amaravati;andhra pradesh;congress;minister;letter;tdp;success;ycp;lokesh kanagaraj;vangaveeti;vemuri radhakrishnaSun, 03 Jan 2021 02:00:00 GMTబెజవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా వారసుడు రాధాకృష్ణ మళ్లీ యాక్టివ్ అయ్యేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ,ఆయన తనయుడు లోకేష్ ఆయన్ను అన్ని విషయాల్లోనూ ప్రోత్సహిస్తూ, ఆయనకు ప్రాధాన్యం ఇస్తూ వస్తుండడం, వైసీపీ లో చేర్చేందుకు ఏపీ మంత్రి కొడాలి నాని వంటి వారు గట్టిగానే ప్రయత్నాలు చేసినా, రాధ మాత్రం వైసీపీలోకి వెళ్లేందుకు ఒప్పుకోకపోవడం, అనుచరులు సైతం గట్టిగానే ఒత్తిడి చేస్తున్నా టిడిపిని వీడి వైసిపిలో చేరేందుకు ఆసక్తి చూపించకపోవడం వంటి కారణాలతో బాబు సైతం రాధా కు బాగా ప్రాధాన్యం ఇస్తున్నారు. వరుస ఓటములతో రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంగవీటి రంగా వారసుడిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నా, రాజకీయంగా సక్సెస్ సాధించలేకపోవడం రాధా కు ఇబ్బందికరంగానే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్, ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసిపి అక్కడ నుంచి టిడిపిలో చేరిన రాధాకృష్ణ వరుసగా ఓటమి చెందడంతో ఆయన మళ్లీ వైసీపీలో చేరతారని అంతా భావించినా, రాధ మాత్రం టిడిపితోనే ఉండాలని డిసైడ్ అయిపోయారు.



  అలాగే బెజవాడ రాజకీయాల్లో కీలక నేతగా ఎదగడంతో పాటు, రాజకీయంగా చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడుగా కాకుండా రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకుడిగా, అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకుని ఎదిగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎలాగూ చంద్రబాబు, లోకేష్ వంటి వారు అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్న తరుణంలో, టిడిపిలోనే మరింత యాక్టివ్ అవ్వాలి అని రాజకీయంగా తన సత్తా చాటుకోవాలనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.




ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రాధాకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా వ్యవహరిస్తుండడంతో, రాధా అనుచరులు సైతం టిడిపిలోనే ఉండాలని డిసైడ్ అయిపోయారట. ముందు ముందు బెజవాడలో వంగవీటి వారసుడు ఏ విధంగా బలం పెంచుకుంటాడో చూడాలి.


విజయసాయి దెబ్బకు సీన్ రివర్స్ అయిందా?

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>