PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-have-no-chance-to-win-in-yanamala-own-constituency-89159a72-f47d-4f6a-b40a-d1386c5b622e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-have-no-chance-to-win-in-yanamala-own-constituency-89159a72-f47d-4f6a-b40a-d1386c5b622e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ సర్కార్ చేస్తున్న అప్పులపై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు వస్తున్నాయి సిఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో భారీగా అప్పులు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఏపిలో అప్పులు అత్యధికం, అభివృద్ది అత్యల్పం అని ఆయన ఆరోపించారు. అప్పుల భారం... ప్రజలకు... పప్పు బెల్లాలు వైసిపి నాయకులకు అని మండిపడ్డారు. ఫిజికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది శూన్యం అని అన్నారు.yanamala ramakrishnudu,jaga,tdp,ycp,ap;ramakrishna;jagan;andhra pradesh;kanna lakshminarayana;vegetable market;tdp;ycpవామ్మో ఏపీలో అప్పులు ఈ రేంజ్ లో ఉన్నాయా...?వామ్మో ఏపీలో అప్పులు ఈ రేంజ్ లో ఉన్నాయా...?yanamala ramakrishnudu,jaga,tdp,ycp,ap;ramakrishna;jagan;andhra pradesh;kanna lakshminarayana;vegetable market;tdp;ycpSun, 03 Jan 2021 14:03:42 GMTఆంధ్రప్రదేశ్ సర్కార్ చేస్తున్న అప్పులపై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు వస్తున్నాయి సిఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో భారీగా అప్పులు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఏపిలో అప్పులు అత్యధికం, అభివృద్ది అత్యల్పం అని ఆయన ఆరోపించారు. అప్పుల భారం... ప్రజలకు... పప్పు బెల్లాలు వైసిపి నాయకులకు అని మండిపడ్డారు. ఫిజికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది శూన్యం అని అన్నారు.

ఉద్యోగులకు టిఏ, డిఏలు లేవు, 6డిఏలు బకాయిలు పెట్టారు అని అన్నారు. చివరికి రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో పించన్లు లేవు అని ఆరోపించారు. ఫిస్కల్ డెఫిసిట్ రూ 1,10,320 కోట్లకు చేరుతోంది అని అన్నారు. 19నెలల్లో రూ లక్షన్నర కోట్లు అప్పులు చేశారు అని ఆయన ఆరోపణలు చేసారు. ప్రజలపై రూ75వేల కోట్ల పన్నులు వేశారు అని అన్నారు. నెలకు రూ4వేల కోట్ల పన్నుల భారం మోపారు అని మండిపడ్డారు. ఈ ఏడాది తొలి 6నెలల్లో రెవిన్యూ వసూళ్లు 6% పెరిగాయి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

అప్పులు గతం కన్నా రెట్టింపు చేశారు. ఖర్చులు 23% అదనంగా చేశారు అని, కేంద్రసాయం రూ7,700కోట్లు అదనంగా అందింది అని ఆయన అసహనం వ్యక్తం చేసారు. ఈ డబ్బంతా ఏమైంది..? ఎక్కడికి పోయింది ఈ డబ్బంతా..? అని  నిలదీశారు. ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు చేసింది శూన్యం అని ఆయన విమర్శించారు. మార్కెట్ లో నిత్యావసరాల ధరలకు, చేసే సంక్షేమానికి పొంతనే లేదు అన్నారు. జగన్ అవినీతి, చేతగాని పాలనతో ఎన్నడూ లేని కష్టాల్లో ప్రజలు ఉన్నారని ఆయన అన్నారు. అగమ్యగోచరంగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిని దిగజార్చారు అని మండిపడ్డారు. ఆర్ధిక నిర్వహణ చేతగాకే ఈ దుస్థితి తెచ్చారు అని ఆరోపణలు చేసారు. 19నెలల్లో రూ20వేలు తలసరి అప్పు భారం మోపారు అని ఆయన అసహనం వ్యక్తం చేసారు.


ప్రతి ఒక్కరు ఎస్ఎంఎస్ ను జీవితలో భాగం చేసుకోండి.. రాచకొండ సీపీ కీలక వ్యాఖ్యలు..?

2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>