PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu79030783-48e5-4084-93d1-820f2c7c579d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu79030783-48e5-4084-93d1-820f2c7c579d-415x250-IndiaHerald.jpgఏపీలో కొత్త ఏడాది రెండవ రోజులే రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కరోనా వైరస్ ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అదే విధంగా సెకండ్ వేవ్ బెంగా బెదురూ అలాగే ఉన్నాయి. కానీ సడెన్ గా నాయకులు జనంలోకి వచ్చేస్తున్నారు. దానికి కారణం ఈ ఏడాది ప్రధమార్ధంలో జరిగే వరస ఎన్నికలే అన్నది వేరే చెప్పాలా. babu;amala akkineni;kranthi;kranti;tiru;makar sakranti;bharatiya janata party;jagan;sankranthi;tirupati;festival;husband;tdp;local language;hindus;master;coronavirusతిరుపతి కోసం బాబు ముహూర్తం....ల్యాండ్ అయ్యేది అపుడే ?తిరుపతి కోసం బాబు ముహూర్తం....ల్యాండ్ అయ్యేది అపుడే ?babu;amala akkineni;kranthi;kranti;tiru;makar sakranti;bharatiya janata party;jagan;sankranthi;tirupati;festival;husband;tdp;local language;hindus;master;coronavirusSun, 03 Jan 2021 10:30:00 GMTకరోనా వైరస్ ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అదే విధంగా సెకండ్ వేవ్ బెంగా బెదురూ అలాగే ఉన్నాయి. కానీ సడెన్ గా నాయకులు జనంలోకి వచ్చేస్తున్నారు. దానికి కారణం ఈ ఏడాది ప్రధమార్ధంలో జరిగే  వరస ఎన్నికలే  అన్నది వేరే చెప్పాలా.

మరో రెండు నెలల్లో తిరుపతి ఉప ఎన్నిక ఉంది. దానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ ఏడాది మేలో స్థానిక ఎన్నికలు జరుగుతాయి. అన్నీ బాగుంటే  వచ్చే ఏడాది జమిలి ఎన్నికలు కూడా జరుగుతాయి. దాంతో అందరి కంటే ముందే అలెర్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు జై శ్రీరాం అనుకుంటూ రంగంలోకి దిగిపోయారు.

బీజేపీ కంటే వేగంగా ఆయన హిందూ కార్డు తో రేసులోకి వచ్చేశారు. దానికి కారణం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఉండడమే. తిరిపతి పవిత్ర క్షేత్రంలో ఉన్న ఎన్నిక అంటే అక్కడ కూడా భక్తి రసం బాగా వర్కౌట్ అవుతుంది. నిజానికి ఇది బీజేపీ వేసుకున్న మాస్టర్ ప్లాన్. కానీ బాబు చాలా వేగంగా రియాక్ట్ అయి దాన్ని అమలు లో పెట్టేశారు.

ఇపుడు ఏపీలో హిందువులకు అతి పెద్ద అన్యాయం జరుగుతోందంటూ వారి తరఫున చంద్రబాబు పెద్ద గొంతుక చేసుకుని వాదిస్తున్నారు. సరైన టైం లో చంద్రబాబు ఈ విధంగా జనంలోకి వచ్చారు. ఈ వేడి ఇలా ఉండగానే బాబు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి కూడా దిగిపోతారు అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు సంక్రాంతి పండుగ తరువాత శ్రీకారం చుడతారు అంటున్నారు.

ఆ మీదట అక్కడే మకాం వేసి మరీ పరిస్థితిని సానుకూలం చేస్తారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాదించడం ద్వారా జగన్ మీద పొలిటికల్ గా  పై చేయి సాధించాలన్నది బాబు మార్క్ ప్లాన్. మరి అది వర్కౌట్ అవుతుందా అన్నది చూడాల్సిందే.




సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..

ఇక్కడ హీరో.. అక్కడ విలన్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>