PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-versus-ysrcp-temple-politicsb472a136-1f74-4a69-8e15-31a47a3e4615-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-versus-ysrcp-temple-politicsb472a136-1f74-4a69-8e15-31a47a3e4615-415x250-IndiaHerald.jpgఏపీలో ఆలయాలపై రాజకీయాలు నడుస్తున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే జగన్ హిందూ మతానికి వ్యతిరేకమని, ఆయన క్రిస్టియన్ కాబట్టే, వైసీపీ ప్రభుత్వం హయాంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీతో సహ ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటు వైసీపీ సైతం ఏ మాత్రం తగ్గకుండా దేవాలయాలపై దాడులకు చంద్రబాబు కుట్ర పన్ని, దాన్ని జగన్‌పై తోసేస్తున్నారని మాట్లాడుతున్నారు. jagan;cbn;deva;ramu;bharatiya janata party;jagan;geum;congress;police;christian;tdp;ycp;partyటెంపుల్ పాలిటిక్స్: అసలు మైండ్ గేమ్ ఆడేది ఎవరో తేలిపోయింది...టెంపుల్ పాలిటిక్స్: అసలు మైండ్ గేమ్ ఆడేది ఎవరో తేలిపోయింది...jagan;cbn;deva;ramu;bharatiya janata party;jagan;geum;congress;police;christian;tdp;ycp;partySun, 03 Jan 2021 01:00:00 GMTజగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే జగన్ హిందూ మతానికి వ్యతిరేకమని, ఆయన క్రిస్టియన్ కాబట్టే, వైసీపీ ప్రభుత్వం హయాంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీతో సహ ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటు వైసీపీ సైతం ఏ మాత్రం తగ్గకుండా దేవాలయాలపై దాడులకు చంద్రబాబు కుట్ర పన్ని, దాన్ని జగన్‌పై తోసేస్తున్నారని మాట్లాడుతున్నారు.

ఇక బీజేపీ సైతం వైసీపీ ప్రభుత్వాన్నే తప్పుబడుతుంది. ఇలా పార్టీల మధ్య టెంపుల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అలా అని దేవాలయాలపై దాడులు మాత్రం ఆగడం లేదు. వరుసగా ఆలయాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా రామతీర్ధంలో రాముడి విగ్రహం, రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసినా, వాటికి సంబంధించిన నిందితులని పోలీసులు పట్టుకోలేదు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం చంద్రబాబు, టీడీపీ నేతలు చేశారని మాట్లాడుతున్నారు.

అలా విమర్శలు చేసినప్పుడు టీడీపీ వారినైనా విచారించాలి కదా...అలాంటి కార్యక్రమం కూడా జరగడం లేదు. మళ్ళీ దీనికి తోడు తాజాగా చంద్రబాబు, విజయసాయిరెడ్డిలు రామతీర్ధం పర్యటనలు చేశారు. చంద్రబాబుకు ముందే రామతీర్ధం వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చారు. అందులో భాగంగా బాబు రామతీర్ధం వచ్చారు. కానీ చంద్రబాబునే అనుమతించి పలువురు టీడీపీ నేతలనీ ఆపేశారు.

అయితే విజయసాయి సడన్‌గా రామతీర్ధం పర్యటనకు వచ్చేశారు. బాబు వచ్చిన రోజే విజయసాయికి పర్మిషన్ వచ్చేసింది. ఇక వీరి పర్యటనలతో రామతీర్ధం రణక్షేత్రంగా తయారైంది. ఈక ఇక్కడ ఇంకో విమర్శ కూడా వస్తుంది. బీజేపీ ఆడుతున్న దేవుడి ఆటలో వైసీపీ, టీడీపీ పావులుగా మారుతున్నాయని, దేవాలయాలపై బీజేపీనే దాడులు చేయించి కావాలనే నాటకం ఆడుతుందనే అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ప్రజా సమస్యలపై పోరాటం చేసిన పార్టీలు, దేవాలయాలపై రాజకీయం చేస్తున్నాయి. ఈక ఇది బీజేపీ అదే మైండ్ గేమ్ అని పలువురు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద అనుమానం వ్యక్తం చేస్తోంది.  మొత్తానికైతే ఏపీలో ఈ ఆలయాల రగడ ఎప్పటికి ఆగుతుందో?




మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!

రామతీర్థంలో రణరంగం-విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>