PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ramudua8c7992f-60a2-4229-9d44-1e39a586425e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ramudua8c7992f-60a2-4229-9d44-1e39a586425e-415x250-IndiaHerald.jpgఉత్తరాంధ్ర భద్రాద్రి అనవచ్చు, అయోధ్యగా కూడా చెప్పవచ్చు. ఏది ఏమైనా అది రాముని కోవెల. విజయనగరానికి దగ్గరలో ఉన్న రామ తీర్ధాలు నాలుగు దశాబ్దలా చరిత్ర ఉన్న పవిత్ర ఆలయం. అక్కడ ప్రతీ ఏటా శ్రీరామ నవమి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతాయి. భక్త జనాలతో రామనామ స్మరణతో కోలాహలంగా ఆ ప్రాంతం ఉంటుంది. అటువంటి ఆలయం రాజకీయాలతో రణక్షేత్రంగా మారింది. ramudu;deva;ramu;andhra pradesh;uttarandhra;history;bhadradri;partyఇంతకీ రాముడి తీర్ధం... ప్రసాదం దక్కిందెవరికో ?ఇంతకీ రాముడి తీర్ధం... ప్రసాదం దక్కిందెవరికో ?ramudu;deva;ramu;andhra pradesh;uttarandhra;history;bhadradri;partySun, 03 Jan 2021 10:00:00 GMTఉత్తరాంధ్ర భద్రాద్రి అనవచ్చు, అయోధ్యగా కూడా చెప్పవచ్చు. ఏది ఏమైనా అది రాముని కోవెల. విజయనగరానికి దగ్గరలో ఉన్న రామ తీర్ధాలు నాలుగు దశాబ్దలా చరిత్ర ఉన్న పవిత్ర ఆలయం. అక్కడ ప్రతీ ఏటా శ్రీరామ నవమి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతాయి. భక్త జనాలతో రామనామ స్మరణతో కోలాహలంగా ఆ ప్రాంతం ఉంటుంది. అటువంటి ఆలయం రాజకీయాలతో రణక్షేత్రంగా మారింది.

ఆలయ పరిసరాలలో రాజకీయ నాయకులు జేజేలు కొట్టించుకున్నారు. మీటింగులు పెట్టారు, ప్రత్యర్ధులను తిట్టిపోశారు. ఇదంతా రామ భక్తిగానే చూడాలా అంటే అసలు కధ వేరేగా ఉంటుంది మరి. ప్రసాదం కోసమే ఆలయానికి వచ్చేవారు ఎక్కువ మంది ఉంటారు. ఇపుడు కూడా రాజకీయ భక్తి ఎక్కువైంది అని అంటున్నారు.

ఒక పార్టీ కాదు ఒక నాయకుడు కాదు అన్ని పార్టీల నేతలు జై శ్రీరాం అంటూ క్యూ కడుతున్నారు. రాముడు తమను కాపాడుతారని, ఆయన దయతో జనాల్లోకి వెళ్ళి నాలుగు ఓట్లు సంపాదించుకుందామన్న తాపత్రయమే ఎక్కువగా కనిపిస్తోంది మరి.

రామతీర్ధాలు అన్న ఆలయం నాడూ నేడూ ఏలిన పాలకులకు అసలు కనిపించడంలేదు. ఆలయాన్ని అభివృద్ధి చేద్దామన్న ఆలోచన ఎవరికీ పట్టడంలేదు. నాడు ఉమ్మడి ఏపీ విభజన తరువాత రెండవ భద్రాద్రిగా ఈ ఆలయాన్నే ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ అది జరగలేదు సరికదా ఆలయాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు.

ఇపుడు మాత్రం తగుదునమ్మా అనుకుంటూ అంతా జై శ్రీరాం అని ముందుకు ఉరుకుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి అన్నది ఆస్తిక జనులే కాదు, ప్రజలు కూడా నిర్ణయించుకుంటారు.  ఆ శ్రీరాముడు కూడా తీర్ధం ఎవరికి ఇవ్వాలి, ప్రసాదం ఎవరి చేతిలో పెట్టాలి అని కూడా ఆలోచిస్తాడు. ఏది ఏమైనా దేవుడిని అడ్డం పెట్టుకును ఆడుతున్న రాజకీయాలు మాత్రం బహు విడ్డూరమే అని చెప్పాలి. ఏపీలో ఇది అంతం కాదు ఆరంభం అని కూడా చెప్పాలి.







ధనియాల వల్ల అన్ని ప్రయోజనాలా!

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>