HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/dhaniyalu80c825b6-ec9f-407f-bbbe-29eb1eea5834-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/dhaniyalu80c825b6-ec9f-407f-bbbe-29eb1eea5834-415x250-IndiaHerald.jpgధనియాలు ముఖ్యంగా వంటింట్లో ఉపయోగించే సుగంధద్రవ్యాలలో మొదటి పాత్ర వహిస్తాయి. ధనియాలపొడి వేయకుండా ఏ కూరని పూర్తి చేయలేము. ధనియాలను కేవలం కూరల్లో మాత్రమే ఉపయోగించడం కాకుండా వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ధనియాలు కొత్తిమీర నుంచి పుడతాయని మనందరికీ తెలిసిందే. అయితే ఈ ధనియాలు మన శరీరంలోని వ్యాధులను ఎలా అరికడుతుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. dhaniyalu;nithya new;heart;turmeric;sugar;aqua;coriander.;pregnant;manamధనియాల వల్ల అన్ని ప్రయోజనాలా!ధనియాల వల్ల అన్ని ప్రయోజనాలా!dhaniyalu;nithya new;heart;turmeric;sugar;aqua;coriander.;pregnant;manamSun, 03 Jan 2021 10:02:49 GMTధనియాలు ముఖ్యంగా వంటింట్లో ఉపయోగించే సుగంధద్రవ్యాలలో మొదటి పాత్ర వహిస్తాయి. ధనియాలపొడి వేయకుండా ఏ కూరని పూర్తి చేయలేము. ధనియాలను కేవలం కూరల్లో మాత్రమే ఉపయోగించడం కాకుండా వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ధనియాలు కొత్తిమీర నుంచి పుడతాయని మనందరికీ తెలిసిందే.  అయితే ఈ ధనియాలు మన శరీరంలోని వ్యాధులను ఎలా అరికడుతుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ధనియాలు,శొంఠి కలిపి కషాయంగా చేసుకొని తాగడం వల్ల అజీర్ణ సమస్య తగ్గుతుంది. ధనియాలకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే గుణం ఎక్కువ. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో వేడి కారణంగా పొట్ట బరువుగా అనిపిస్తుంది.అప్పుడు ధనియాలను కషాయం చేసుకుని తాగడం వల్ల వేడి తగ్గే అవకాశం ఎక్కువ. బియ్యం కడిగిన నీళ్ళలో  పంచదార, ధనియాల చూర్ణం కలిపి తాగడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు దరిచేరవు. ధనియాల కషాయంలో పంచదార కలిపి తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది.రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి,గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

ధనియాల కషాయాన్ని ఉదయాన్నే తాగడం వల్ల గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు అదుపులోకి వచ్చి,మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. ధనియాలను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తల నుదిటిన పెట్టుకోవడం వల్ల తలనొప్పి తగ్గడంతో పాటు వేడి తగ్గుతుంది.ధనియాలు బార్లీ గింజలు సమంగా నూరి వాపు ఉన్నచోట ఈ మిశ్రమాన్ని పెట్టడం వల్ల వాపు తొందరగా తగ్గుతుంది.ధనియాల పొడిని ఆహారంలో భాగంగా చేర్చుకుంటే శృంగార సామర్థ్యం పెరగడంతోపాటు శరీర అవయవాల్లో ఎలాంటి నొప్పి ఉన్నా త్వరగా తగ్గిపోతుంది.

డయాబెటిస్ ఉన్న వారు నిత్యం ఆహారంలో ధనియాలు చేర్చుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.శీతాకాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, ఆయాసం లాంటివి ఎదురవుతాయి. ఇలాంటప్పుడు ధనియాల కషాయం తాగడం వల్ల వీటిని నివారించుకోవచ్చు. అంతేకాకుండా విరేచనాలు తగ్గించే గుణం ధనియాల కషాయానికి ఉంది.అంతేకాకుండా జీర్ణాశయంలో ఉండే క్రిములు ఏలికపాములు వంటివి కూడా నశిస్తాయి.టైఫాయిడ్ కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడుతుందని రుజువయ్యింది. ధనియాల కషాయానికి నిమ్మరసం, ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.పసుపులో ధనియాల పొడిని కలిపి ముఖం పై రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.  కాబట్టి ఇన్ని ప్రయోజనాలు కలిగిన ధనియాలను రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రయోజనాలు అందుతాయి.


ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>