PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/persevering-breadwinners-farmers53e7aa59-ce6a-42a7-954c-9ef62a9fb370-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/persevering-breadwinners-farmers53e7aa59-ce6a-42a7-954c-9ef62a9fb370-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని రైతుల ఉద్య‌మం కొన‌సాగుతూనే ఉంది. ఎముక‌లు కొలికే చ‌లిలో కూడా ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తుండ‌టం గ‌మ‌నార్హం. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది అన్నదాతలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కేంద్రంతో పలు దఫాల చర్చలు జరిపినప్పటికీ కొలిక్కి కాలేదు. ఐతే రైతుల ఆందోళనలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లాయని బీజేపీ నేతలు అనడాన్ని.. రైతులు తప్పుబట్టుతున్నారు. రైతు ఉద్యమాన్ని అవమానపరిచfarmers;ram pothineni;delhi;bharatiya janata party;giriraj singh;gujarat - gandhinagar;ram madhav;job;interview;minister;central government;sardar vallabhai patel;nithin reddy;punjabమా ఉద్య‌మాన్ని కించ‌ప‌రుస్తారా...? బీజేపీ నేత‌ల‌కు రైతు సంఘాల నోటీసులు...మా ఉద్య‌మాన్ని కించ‌ప‌రుస్తారా...? బీజేపీ నేత‌ల‌కు రైతు సంఘాల నోటీసులు...farmers;ram pothineni;delhi;bharatiya janata party;giriraj singh;gujarat - gandhinagar;ram madhav;job;interview;minister;central government;sardar vallabhai patel;nithin reddy;punjabSun, 03 Jan 2021 10:55:21 GMTకేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని రైతుల ఉద్య‌మం కొన‌సాగుతూనే ఉంది. ఎముక‌లు కొలికే చ‌లిలో కూడా ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తుండ‌టం గ‌మ‌నార్హం. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది అన్నదాతలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కేంద్రంతో పలు దఫాల చర్చలు జరిపినప్పటికీ కొలిక్కి కాలేదు. ఐతే రైతుల ఆందోళనలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లాయని బీజేపీ నేతలు అనడాన్ని.. రైతులు తప్పుబట్టుతున్నారు. రైతు ఉద్యమాన్ని అవమానపరిచారంటూ బీజేపీ నేతలకు పలువురు రైతులు లీగల్ నోటీసులు పంపించారు.


తమ ఆందోళనలను కించపరుస్తూ మాట్లాడారన్న అన్నదాతలు ఇందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు నోటీసులు పంపిన వారిలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, గుజరాత్ డిప్యూటీ సీఎం  నితిన్ పటేల్, మరో నేత రామ్ మాధవ్  ఉన్నారు. ఈ నేతలు తమ ఆందోళనను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని, ఇందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. రామ్ మాధవ్ తన సామాజిక మాధ్య‌మంలో తమ నిరసనను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారన్నారు. మరో ఇద్దరు కూడా తమ ఇంటర్వ్యూలలో ఇలాగే వ్యవహరించారని రైతులు ఆరోపించారు. ఈ నోటీసుల విషయంలో పంజాబ్ ఆప్ ఇన్-ఛార్జ్ రాఘవ్ చద్దా ఆయనలీగల్ టీమ్ రైతుల‌కు స‌హ‌క‌రిస్తోంది.


రైతుల ఉద్య‌మంలో ఉగ్రవాదులు, ఖలిస్తానీలు, కమ్యూనిస్టులు, చైనా అనుకూల శక్తులు చొరబడ్డాయని వ్యాఖ్యలు చేస్తూ.. తమను అవమాన పరుస్తున్నారని పంజాబ్‌కు చెందిన రైతులు మండపడుతున్నారు. రైతులు పిజ్జాలు, పకోడీలు తినకూడదా? అని ప్రశ్నించారు.అటు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 40వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ సరిహద్దులోని తిక్రీ, సింఘు, ఘాజీపూర్‌లో రైతులు బైఠాయించారు. చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఐదోసారి చ‌ర్చ‌ల‌కు ప్ర‌భుత్వం ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ఈ సారి తాడోపేడో తేల్చుకునేందుకు రైతు సంఘాలు సిద్ధ‌మ‌య్యాయి.




ఎంఐఎం సంచ‌ల‌న నిర్ణ‌యంతో దెబ్బ ఎవ‌రికో...!

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>