PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-sai-reddy64e8cd77-a609-42cd-83e1-341a76a5204f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-sai-reddy64e8cd77-a609-42cd-83e1-341a76a5204f-415x250-IndiaHerald.jpgకోదండరామాలయంలోని రాముడి విగ్రహం ధ్వంసం ఘటనకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులే కారణమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అంతేకాదు శనివారం ఆలయం దగ్గర తనపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయసాయి రెడ్డి. రామతీర్థం కొండ తనపై రాల్లు, వాటర్ ప్యాకెట్లతో దాడిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.vijay sai reddy;ashok;ramu;v vijayasai reddy;mp;police;chief minister;king;minister;tdp;ycp;rama tirtha;reddyటీడీపీ నేతలపై విజయసాయి ఫిర్యాదు!టీడీపీ నేతలపై విజయసాయి ఫిర్యాదు!vijay sai reddy;ashok;ramu;v vijayasai reddy;mp;police;chief minister;king;minister;tdp;ycp;rama tirtha;reddySun, 03 Jan 2021 12:17:23 GMTటీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులే కారణమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అంతేకాదు శనివారం ఆలయం దగ్గర తనపై జరిగిన దాడిపై
పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయసాయి రెడ్డి. రామతీర్థం కొండ తనపై రాల్లు, వాటర్ ప్యాకెట్లతో దాడిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు డైరెక్షన్‌లోనే తనపై దాడి జరిగిందని అన్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో తన గన్‌మెన్‌లకు గాయాలు అయ్యాయని వెల్లడించారు.వైసీపీ ఎంపీ ఫిర్యాదుతో నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

    రాముడి విగ్రహం ధ్వంసమైన ఆలయాన్ని శనివారం ఎంపీ విజయసాయి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కొండ పైకి వెళుతున్న విజయసాయి రెడ్డిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్ పై కొందరు దాడికి పాల్పడ్డారు. దీంతో కారు దిగి నడుచుకుంటూ పోలీసుల సాయంతో ఆలయం నుంచి వెళ్లిపోయారు విజయసాయి రెడ్డి. టీడీపీ నేతలే తనపై దాడికి కార్యకర్తలను ఉసి గొల్పారని విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారు.ఆ విధంగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు కళా వెంకట్రావు పై విజయసాయి తీవ్ర ఆరోపణలు చేశారు

       రామతీర్థం ఘటనపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మందపల్లి మందేశ్వరస్వామి ఆలయం, విజయనగరం పైడితల్లి ఆలయాలతో పాటు రామతీర్థం రామస్వామి ఆలయ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తప్పిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య విమ‌ర్శ‌లు గుప్పించారు.'ముఖ్యమంత్రి గారూ! ఆలయాల పర్యవేక్షణ సరిగా లేదని వంశపారంపర్య ట్రస్టీ అయిన అశోక్ గజపతి రాజును తొలగించారు. మరీ, బెజవాడ అమ్మవారి మూడు సింహాలు దొంగిలించబడినందుకు, అంతర్వేది రథం దగ్ధ‌మైనందుకు మంత్రి వెలంపల్లిని, టీటీడీలో అశ్లీల ప్రవాహం జరిగినప్పుడు సుబ్బారెడ్డిని ఎందుకు తొలగించలేదు?' అని వ‌ర్ల రామ‌య్య నిలదీశారు


20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>