MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagb28d4daf-6c05-42eb-b14d-456d66a921f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagb28d4daf-6c05-42eb-b14d-456d66a921f8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున ఎపుడూ ఒక అడుగు ముందుంటారు. వెండి తెర మీద అంతా వెలుగొందుతున్న వేళ నాగ్ హఠాత్తుగా బుల్లి తెర మీదకు షిఫ్ట్ అయ్యాడు. మీలో ఎవడు కోటీశ్వరుడు అంటూ నాగ్ చేసిన రియాలిటీ షో అప్పట్లో పెద్ద సంచలనం. ఇక ఆ తరువాత నాగ్ బుల్లి తెర మీద బిగ్ బాస్ సీజన్ త్రీ, ఫోర్ వంటి అతి పెద్ద రియాలిటీ షోలను హోస్టుగా మారి సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. నాగ్ ను చూసి మిగిలిన హీరోలు కూడా అనుసరించడం మొదలుపెట్టారు. nag;nagarjuna akkineni;shiva;korcha;tollywood;cinema;bigboss;genre;lord siva;hero;reality show;silver;success;silver screen;nijam;annamayyaనాగ్ సంచలన నిర్ణయం....టాలీవుడ్ ఆలోచించాల్సిందే...?నాగ్ సంచలన నిర్ణయం....టాలీవుడ్ ఆలోచించాల్సిందే...?nag;nagarjuna akkineni;shiva;korcha;tollywood;cinema;bigboss;genre;lord siva;hero;reality show;silver;success;silver screen;nijam;annamayyaSun, 03 Jan 2021 11:00:00 GMTటాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున ఎపుడూ ఒక అడుగు ముందుంటారు. వెండి తెర మీద అంతా వెలుగొందుతున్న వేళ నాగ్ హఠాత్తుగా బుల్లి తెర మీదకు షిఫ్ట్ అయ్యాడు. మీలో ఎవడు కోటీశ్వరుడు అంటూ నాగ్ చేసిన రియాలిటీ షో అప్పట్లో పెద్ద  సంచలనం. ఇక ఆ తరువాత నాగ్ బుల్లి తెర మీద బిగ్ బాస్ సీజన్ త్రీ, ఫోర్  వంటి అతి పెద్ద రియాలిటీ షోలను హోస్టుగా మారి సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. నాగ్ ను చూసి మిగిలిన హీరోలు కూడా అనుసరించడం మొదలుపెట్టారు.

ఇక సినిమాల సెలెక్షన్ విషయంలోనూ నాగ్ స్టైల్ వేరుగా ఉంటుంది అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. శివ సినిమాతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన నాగ్  అప్పట్లో మరచిపోయిన పౌరాణిక సినిమాలను లాంగ్ గ్యాప్ తరువాత అన్నమయ్య రూపంలో వెండి తెరకు తిరిగి పరిచయం చేశారు. ఇక ఆ జోనర్ లో కూడా సూపర్ హిట్లు కొట్టవచ్చు అని ప్రూవ్ చేశారు. ఇక ఒక దశలో టాలీవుడ్ లో  ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ కి కూడా నిన్నే పెళ్ళాడుతా మూవీ ద్వారా రూట్ వేసి ట్రెండ్ సెట్టర్ అయ్యాడు.

నాగ్ ఏది ఆలోచించినా కొత్తగా ఉంటుంది. అందులో ఫ్యూచర్ కనిపిస్తుంది, ఇపుడు కరోనా తరువాత మారుతోంది ప్రపంచం. థియేట్రికల్ మూవీస్ కి మెల్లగా కాలం చెల్లే సీన్ కనిపిస్తోంది. అయినా సరే అంతా మూస పద్ధతిలో ముందుకు వెళ్తున్నారు. సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని మంకుపట్టు పట్టుకుని కూర్చున్న హీరోలు కూడా ఉన్నారు. కానీ నాగ్ ఈ టైం లోనే ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు.

అదే ఓటీటీ ఫ్లాట్ ఫారం ద్వారా తన కొత్త మూవీ వైల్డ్ డాగ్ ని రిలీజ్ చేయడానికి నాగ్ నిర్ణయించుకోవడం నిజంగా ఇన్నోవేటివ్ థాట్ అని చెప్పాల్సిందే. ఇపుడు థియేటర్లలో నిజంగా  బొమ్మ పడినా ఆక్యుపెన్సీ  ఫిఫ్టీ పెర్సెంటే  మాత్రమే. బొమ్మ బాగులేకపోతే భారీ డిజాస్టర్ కూడా అవుతుంది. ఇవన్నీ ఆలోచించిన నాగ్ ఓటీటీకే ఓటు వేశారు అంటున్నారు. ఇపుడు ఈ నిర్ణయం మీద మిగిలిన వారు కూడా సీరియస్ గా ఆలోచన చేస్తే టాలీవుడ్ లో వందల్లో తయారు అవుతున్న సినిమాలు రిలీజ్ అయి సినీ రంగం కూడా బాగుంటుంది అంటున్నారు.





ఎంఐఎం సంచ‌ల‌న నిర్ణ‌యంతో దెబ్బ ఎవ‌రికో...!

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!

విశాఖకు రాజధాని తరలింపు ఎప్పుడంటే...? క్లారిటీ ఇచ్చేశారు

చెట్టు నరికినందుకు రూ.10వేలు ఫైన్.. మన రాష్ట్రంలోనే..

‘ఆచార్య’ సినిమా కోసం క్రేజీ సెట్.. ఇండియాలోనే లేనంతగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>