PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-if-so-the-situation-will-go-away382be9e9-893e-4671-9d87-6a4ba9bf5c2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-if-so-the-situation-will-go-away382be9e9-893e-4671-9d87-6a4ba9bf5c2d-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వణుకు పుట్టిస్తోంది. కొన్ని చోట్ల సెకండ్‌, థర్డ్‌ వేవ్‌లు విజృంభిస్తుండగా.. ఇక బ్రిటన్‌లోని కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ మొత్తం కరోనా కేసులు రెండు కోట్లు దాటాయి. న్యూయార్క్‌, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో కొత్తగా నమోదు అవుతున్న కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ మరణాలు 25 వేలు దాటాయి. శుక్రవారం ఒక్క రోజే 858 మంది if so the situation will go away;california;local language;texasఇలానే ఉంటే పరిస్థితి చేజారిపోవడమే..!ఇలానే ఉంటే పరిస్థితి చేజారిపోవడమే..!if so the situation will go away;california;local language;texasSun, 03 Jan 2021 16:00:00 GMTకాలిఫోర్నియా రాష్ట్రంలో వైరస్‌ మరణమృదంగం మోగిస్తోంది. అక్కడ రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి‌..! ఆఖరికి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ల దొరకని పరిస్థితి ఏర్పడింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వణుకు పుట్టిస్తోంది. కొన్ని చోట్ల సెకండ్‌, థర్డ్‌ వేవ్‌లు విజృంభిస్తుండగా.. ఇక బ్రిటన్‌లోని కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ మొత్తం కరోనా కేసులు రెండు కోట్లు దాటాయి. న్యూయార్క్‌, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో కొత్తగా నమోదు అవుతున్న కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ మరణాలు 25 వేలు దాటాయి. శుక్రవారం ఒక్క రోజే 858 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మరణాల సంఖ్యలో న్యూయార్క్‌, టెక్సాస్‌ తర్వాత స్థానాల్లో కాలిపోర్నియా ఉంది.

ఇక్కడ కొత్తగా 47 వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసులు 22 లక్షల మార్కును దాటాయి. అంతేకాదు.. క్రిస్మస్‌, న్యూఇయర్ సెలవుల తర్వాత ఇక్కడ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఇక్కడ రెండో దశ వ్యాప్తి మొదలు కాగా.. బాధితుల్లో మ్యూటేట్ వైరస్‌ కనిపిస్తోంది. కొత్త వైరస్‌కు గతం కంటే వేగంగా వ్యాపించే లక్షణం ఉండటంతో  స్థానికుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇక కాలిఫోర్నియాలో నమోదైన మొత్తం మరణాల్లో 40 శాతం లాస్‌ ఏంజెల్స్‌లోనే సంభవించాయి. ప్రతి గంటకు సగటున ఆరుగురు కొవిడ్‌తో చనిపోతున్నారు.

వైరస్‌ బాధితులు పెరుగుతుండటంతో.. ఆస్పత్రులపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది. సౌత్ కాలిఫోర్నియాలోని ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగులకు ఐసీయూ బెడ్లు దొరకడం లేదు. రోగుల్ని వీల్‌ఛైర్‌లో, హాళ్లలోనే ఉంచి వైద్యం చేస్తున్నారు. ఎక్కువశాతం రోగుల్లో శ్వాస సమస్యలు ఉండటంతో ఆక్సిజన్‌ కొరత తలెత్తుతోంది. డిశ్చార్జ్‌ అవుతున్న రోగులు ఆక్సిజన్‌ సిలిండర్లు ఇంటికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆస్పత్రుల ముందు అంబులెన్సులు వరుస కడుతున్నాయి. వాటిల్లోని రోగుల్ని ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లేందుకు ఎక్కువ సమయం పడుతోంది. కొన్ని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డాక్టర్లు అంబులెన్స్‌ల్లోనే చికిత్స చేస్తున్నారు.

కిస్మస్‌ నుంచి ఇక్కడ సీన్‌ మారిపోయింది. సాధారణం కంటే కేసుల సంఖ్య పెరిగిపోవడంతో.. బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రిస్మస్‌ రోజు వైరస్ పాజిటివిటీ రేటు 18.2 శాతంగా ఉంటే న్యూ ఇయర్‌ రోజు ఏకంగా 21.5 శాతంగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే కాలిఫోర్నియాలో పరిస్థితి చేజారుతుందని చెబుతున్నారు.


బొమ్మ తలలు పగలగొడితే ఇంత రాజకీయమా!

కాంగ్రెస్, శివసేన మధ్య విబేధాలు.. మహా ప్రభుత్వం పడిపోతుందా..!

2021లోకి అడుగుపెట్టగానే.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త

20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..

పాములతో మసాజ్.. ఆ మజానే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

సీఎంను చంపితే లక్షల డాలర్లు.. భారత్‌లో కలకలం సృష్టిస్తోన్న పోస్టర్

ప‌వ‌న్‌పై సోము గ‌రంగ‌రం... మ‌రో కుంప‌టి మొద‌లైంది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>