PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress-chief-sonia-gandhi-fire-on-bjp-govt-pm-modiedb84210-78b7-432f-a99a-719708d1b1da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/congress-chief-sonia-gandhi-fire-on-bjp-govt-pm-modiedb84210-78b7-432f-a99a-719708d1b1da-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రజలను మాత్రమే కాకుండా ఆహారం ఇచ్చే రైతులను కూడా పట్టించుకోని మొదటి అహంకార ప్రభుత్వం ఇదేనని ఆమె మండిపడ్డారు. sonia gandhi;modi;soniagandhi;delhi;bharatiya janata party;narendra modi;mohandas karamchand gandhi;sonia gandhi;congress;government;prime minister;letter;central government;mantra;narendraమోడీది అహంకార ప్రభుత్వం!మోడీది అహంకార ప్రభుత్వం!sonia gandhi;modi;soniagandhi;delhi;bharatiya janata party;narendra modi;mohandas karamchand gandhi;sonia gandhi;congress;government;prime minister;letter;central government;mantra;narendraSun, 03 Jan 2021 18:47:36 GMTకేంద్ర ప్రభుత్వంపై  తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రజలను మాత్రమే కాకుండా ఆహారం ఇచ్చే రైతులను కూడా పట్టించుకోని మొదటి అహంకార ప్రభుత్వం ఇదేనని ఆమె మండిపడ్డారు.  ప్రజలు, రైతుల ప్రయోజనాలు కాపాడటమే నిజమైన ప్రజాస్వామ్యం అన్న సోనియా గాంధీ.. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పారు. చలి, వర్షాన్ని లెక్కచేయక గత 39 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వారి దుస్థితి తనతోపాటు దేశ పౌరులందరికీ ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.

              రైతుల ఆందోళన, బీజేపీ సర్కార్ నిర్లక్ష్యంపై సోనియా గాంధీ బహిరంగ లేఖ విడుదల చేశారు. కేంద్ర సర్కార్ విధానాలను అందులో ఆమె ఎండగట్టారు. రైతుల పోరాటానికి మద్దతుగా ఉంటామని ప్రకటించారు. రైతులు అలసిపోయేలా చేసి వారిని తరిమికొట్టే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్నట్లుగా తెలుస్తున్నదని సోనియా ఆరోపించారు. అయితే మన రైతులు ప్రభుత్వానికి లొంగబోరని అన్నారు. ప్రభుత్వం తన అహాన్ని వీడాలని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసి రైతు నిరసనలకు ముగింపు పలకాలని సోనియా గాంధీ డిమాండ్‌ చేశారు.

        నిరసనలపై ప్రభుత్వం కఠినమైన వైఖరి కారణంగా 50 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని, కొందరు ఆత్మహత్య చేసుకున్నారని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు తీసుకున్న ఈ నిర్ణయం మోడీ ప్రభుత్వాన్ని లేదా మంత్రులను కదిలించలేకపోయిందన్నారు. కనీసం ఓదార్పు మాట కూడా వారు చెప్పలేదని విమర్శించారు. మరణించిన రైతులకు నివాళి అర్పిస్తున్నానని, వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని బహిరంగ లేఖలో పేర్కొన్నారు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ.కేంద్ర సర్కార్ దిగొచ్చవరకు పోరాడుదామని రైతులకు పిలుపిచ్చారు.




తెర మీదకు మెగా పవర్ మల్టీస్టారర్.. ముహుర్తం ఎప్పుడంటే..!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్

నచ్చకపోతే వచ్చి ఆడకండి.. టీమిండియాకు క్వీన్స్‌ల్యాండ్ వార్నింగ్

దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఇప్పుడు పరిస్థితి ఏంటి..?

బుల్లిపిట్ట: చైనాకు భారీ షాక్.. ఈ సారి ఏకంగా 46 వేల యాప్‌లు..

ఆచార్యలో చరణ్ గెటప్ మామూలుగా లేదుగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>