PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vijayasaireddy-targets-visakha-tdp-mlasa16d945f-85f6-453a-b4f0-d06a973d0fdd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vijayasaireddy-targets-visakha-tdp-mlasa16d945f-85f6-453a-b4f0-d06a973d0fdd-415x250-IndiaHerald.jpgఉత్తరాంధ్ర రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు ఆలయాలపై దాడులు, మరోవైపు భూ కబ్జాల విషయంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్ధంలో రాముడి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై అధికార వైసీపీని, టీడీపీ తప్పుబడుతోంది. tdp;deva;ramu;jagan;ganesh kumar vasupalli;mp;district;cinema;cinema theater;vishakapatnam;uttarandhra;mla;cinema theatre;christian;arrest;tdp;ycp;velagapudiఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఫిక్స్ అయిపోయారా?ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఫిక్స్ అయిపోయారా?tdp;deva;ramu;jagan;ganesh kumar vasupalli;mp;district;cinema;cinema theater;vishakapatnam;uttarandhra;mla;cinema theatre;christian;arrest;tdp;ycp;velagapudiSat, 02 Jan 2021 03:00:00 GMTఉత్తరాంధ్ర రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు ఆలయాలపై దాడులు, మరోవైపు భూ కబ్జాల విషయంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్ధంలో రాముడి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై అధికార వైసీపీని, టీడీపీ తప్పుబడుతోంది.

జగన్ ఆధ్వర్యంలోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ క్రిస్టియన్ కాబట్టి, ఆయనకు హిందూ మతం అంటే పడదని పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో ఆలయాలపై దాడులకు చంద్రబాబు, లోకేష్‌లు కారణమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలే రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని, ఏదో కళ్లతో చూసినట్టే చెబుతున్నారు. అయితే దీనిపై విచారణ చేసి ధ్వంసం చేసినవారిని మాత్రం ఇంతవరకు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు.

ఇక ఇదిలా ఉంటే వైజాగ్‌లో గతంలో టీడీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని వాటిని, ఇప్పుడు స్వాధీనం చేసుకుంటున్నామని విజయసాయి చెబుతున్నారు. విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పలు భూములని కబ్జా చేశారని, వాటిని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నామని చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా వెలగపూడిని టార్గెట్ చేసుకుని విజయసాయి విమర్శలు చేస్తున్నారు.

ఇక తాజాగా విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుని కూడా విజయసాయి టార్గెట్ చేశారు. ఓ భూమిని కబ్జా చేసి గణబాబు సినిమా హాల్ కట్టారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు టీడీపీ ఎమ్మెల్యేలు గట్టిగానే స్పందిస్తున్నారు. తాము కబ్జా చేసినట్లు ఆధారాలు చూపించాలని, అలాగే దేవుడి ప్రమాణం చేయడానికి సిద్ధమంటూ సవాళ్ళు విసురుతున్నారు. అయితే విశాఖలో ఉన్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేశ్ వైసీపీలోకి వెళ్లారు. ఇక గంటా శ్రీను టీడీపీలో ఉన్నారో లేదో ఎవరికి అర్ధం కావడం లేదు. అయితే వెలగపూడి, గణబాబులు మాత్రం టీడీపీని విడిచిపెట్టేలా కనిపించడం లేదు. అందుకే విజయసాయి వారిని టార్గెట్ చేశారని, విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ది పొందడానికే ఇలా విమర్శలు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి.




ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...

అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>