MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rajinikanths-son-in-law-in-the-role-of-a-playera0b20d37-adc0-45f5-9d40-702690761027-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rajinikanths-son-in-law-in-the-role-of-a-playera0b20d37-adc0-45f5-9d40-702690761027-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ హీరో కార్తీ నటించిన ‘యుగానికి ఒక్కడు’ సినిమా రిలీజై పదేళ్లు దాటేసింది. అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. తమిళంలో తెరకెక్కిన ‘ఆయిరత్తిల్ ఒరువన్’ సినిమాను తెలుగులో ‘యుగానికి ఒక్కడు’ అనే పేరుతో అనువదించారు. ‘7/జి బృందావన్ కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ సినిమాను రూపొందించారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించారు దర్శకుడు సెల్వ రాఘవన్. ​అయితే ఈ సినిమాలో మాత్రం కార్తీ హీరోగా నటించడం లేదు. కార్తీకి బదdhanush;dhanush;selva raghavan;cinema;telugu;kollywood;media;tamil;hero;letterఆ సీక్వెల్ కోసం తమ్ముడిని ఎంచుకున్న సెల్వా రాఘవన్...ఆ సీక్వెల్ కోసం తమ్ముడిని ఎంచుకున్న సెల్వా రాఘవన్...dhanush;dhanush;selva raghavan;cinema;telugu;kollywood;media;tamil;hero;letterSat, 02 Jan 2021 23:00:00 GMTకోలీవుడ్ హీరో కార్తీ నటించిన ‘యుగానికి ఒక్కడు’ సినిమా రిలీజై పదేళ్లు దాటేసింది. అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. తమిళంలో తెరకెక్కిన ‘ఆయిరత్తిల్ ఒరువన్’ సినిమాను తెలుగులో ‘యుగానికి ఒక్కడు’ అనే పేరుతో అనువదించారు. ‘7/జి బృందావన్ కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ సినిమాను రూపొందించారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించారు దర్శకుడు సెల్వ రాఘవన్.

అయితే ఈ సినిమాలో మాత్రం కార్తీ హీరోగా నటించడం లేదు. కార్తీకి బదులుగా ధనుష్ ని రంగంలోకి దింపారు. ఈ విషయాన్ని ధనుష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ కోసం పూర్తి స్థాయిలో కష్ట పడతామని ధనుష్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్  చేశాడు. ఈ సీక్వెల్ సినిమాను 2024లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడానికే ఏడాది సమయం పడుతుందని..కానీ బెస్ట్ సినిమాగా తెరకెక్కిస్తామంటూ ధనుష్ సోషల్ మీడియాలో తెలిపాడు. తొలిభాగ‌మైన యుగానికి ఒక్క‌డు సినిమాకు ఇది కొన‌సాగింపుగా ఉంటుందని తెలుస్తోంది.





ఈ వయసులోనే ఇంత ఫాలోయింగ్ ఉంటె .... రేపు పెద్దయ్యాక ఆపగలమా ....?

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>