PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ramatirtha-political-battlefield170d77be-fffe-4096-a769-b6a60086add4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ramatirtha-political-battlefield170d77be-fffe-4096-a769-b6a60086add4-415x250-IndiaHerald.jpgరామతీర్థం.. రాజకీయ రణక్షేత్రంలా మారింది. రోజంతా ఈ అంశంచుట్టే ఏపీ రాజకీయాలు నడిచాయి. అగ్రనేతల పర్యటనలతో ఉద్రిక్తతలు కొనసాగాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ నిరసనలతో ప్రశాంతంగా ఉండే రామతీర్థం హోరెత్తిపోయింది. రాములోరి విగ్రహం ధ్వంసం చేసింది ఎవరో ఇంకా తేలలేదు కానీ.. ఆ అంశంపై పేలుతున్న పొలిటికల్‌ పంచ్‌లు మాత్రం పీక్‌ స్టేజ్‌కు చేరుతున్నాయి. విజయనగరం జిల్లా బోడికొండ కోదండరాముడి విగ్రహ ధ్వంసంపై చెలరేగిన రాజకీయ దుమారం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతల పర్యటనతో రామతీర్థం రణరంగంగా మారింది. టీడీపీ అధ్ramatirtha political battlefield;view;cbn;ganga;ramu;bharatiya janata party;ganges;amaravati;andhra pradesh;mp;district;vijayanagaram;police;tdp;local language;ycp;rama tirtha;vizianagaram;ranarangam;party;racchaరామతీర్థం.. రాజకీయ రణ క్షేత్రం..!రామతీర్థం.. రాజకీయ రణ క్షేత్రం..!ramatirtha political battlefield;view;cbn;ganga;ramu;bharatiya janata party;ganges;amaravati;andhra pradesh;mp;district;vijayanagaram;police;tdp;local language;ycp;rama tirtha;vizianagaram;ranarangam;party;racchaSat, 02 Jan 2021 22:30:00 GMTఏపీ రాజకీయాలు నడిచాయి. అగ్రనేతల పర్యటనలతో ఉద్రిక్తతలు కొనసాగాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ నిరసనలతో ప్రశాంతంగా ఉండే రామతీర్థం హోరెత్తిపోయింది. రాములోరి విగ్రహం ధ్వంసం చేసింది ఎవరో ఇంకా తేలలేదు కానీ.. ఆ అంశంపై పేలుతున్న పొలిటికల్‌ పంచ్‌లు మాత్రం పీక్‌ స్టేజ్‌కు చేరుతున్నాయి.

విజయనగరం జిల్లా బోడికొండ కోదండరాముడి విగ్రహ ధ్వంసంపై చెలరేగిన రాజకీయ దుమారం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ, బీజేపీ  నేతల పర్యటనతో రామతీర్థం రణరంగంగా మారింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.. రామతీర్థంలో పర్యటించాల్సి ఉండటంతో వ్యూహాత్మకంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా బోడికొండ వచ్చారు. వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇలా మూడు పార్టీల నిరసనలతో రామతీర్థం.. రణరంగంగా మారింది.

కొండపైకి వెళ్లేందుకు ఎవరికీ అనుమతిలేదని చెప్పిన పోలీసులు విజయసాయిరెడ్డిని అనుమతించడంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. తమను కూడా బోడికొండపైకి అనుమతించాల్సిందేనని ఎమ్మెల్సీ మాధవ్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒకవైపు భాజపా నేతల ఆందోళన కొనసాగుతుండగానే విజయసాయిరెడ్డితో పాటు వైసీపీ నాయకులు కొండపైకి నడుచుకుంటూ వెళ్లి కోదండరాముడి ఆలయాన్ని సందర్శించారు.

కొండదిగి కిందకు వస్తున్న క్రమంలో విజయసాయిరెడ్డి వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. ఆ సమయంలో వైసీపీ, టీడీపీ, బీజేపీ శ్రేణులు పోటా పోటీగా నినాదాలు చేయడంతో రామతీర్థం రణరంగంగా మారింది. మూడు పార్టీల కార్యకర్తలు తోపులాటకు దిగారు. బోడికొండ దిగువున వైసీపీ ,టీడీపీ, బీజేపీ  శ్రేణులు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఆందోళనకు దిగారు.

మరోవైపు అమరావతి నుంచి విశాఖకు విమానంలో వచ్చిన చంద్రబాబు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో  భారీ కాన్వాయ్‌తో రామతీర్థం బయల్దేరారు. టీడీపీ శ్రేణుల వాహనాలను విజయనగరం మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది వాహనాలను మాత్రమే అనుమతించి నేతల వాహనాలను అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ విజయనగరంలో చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు.

 రామతీర్థం వెళ్లేందుకు చంద్రబాబు కాన్వాయ్‌లోని ఒక వాహనానికే పోలీసులు అనుమతి ఇచ్చారు. కేవలం చంద్రబాబు కాన్వాయ్‌కి అనుమతి ఇచ్చి.. మిగతా వాహనాలు రాకుండా లారీలు అడ్డుపెట్టారు.  చంద్రబాబుతో పాటు తాము కూడా రామతీర్థం వెళ్లేందుకు అనుమతించాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. మొదట అనుమతించని పోలీసులు.. ఆ తర్వాత వెళ్లనిచ్చారు. దీంతో నాటకీయ పరిణామాల నడుమ టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబు మెట్ల మార్గం వద్ద కొబ్బరికాయ కొట్టి బోడికొండపైకి వెళ్లారు. గర్భాలయానికి తాళం వేసి ఉండటంతో.. చంద్రబాబు అక్కడి నుంచే చూశారు. అక్కడ రాముడి శిరస్సును ధ్వంసం చేసి పడేసిన కోనేరును పరిశీలించారు. కోదండరాముడి విగ్రహం ధ్వంసంపై అక్కడి పూజారులు, స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

వైసీపీ, టీడీపీ, బీజేపీ.. అన్ని పార్టీల నేతలదీ ఒకటే మాట. రాములోరి విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిని కఠినంగా శిక్షించాలని.. అయితే దాంతోపాటు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్లు రచ్చ చేయడంతో రామతీర్థం కాస్తా.. రణక్షేత్రమైంది.


స్టైలిష్ స్టార్ కొత్త సంవత్సరం కొత్త నిర్ణయం...

మాస్ రాజా ఊపేస్తున్నాడు.. రవితేజ 'క్రాక్' టాప్ 1 ట్రెండింగ్..!

ఢిల్లీ నిరసన స్థలంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న....

మళ్లీ ఐసొలేషన్ లోకి రోహిత్ శర్మ.. మరో నలుగురు కూడా..

కింగ్ "టు ది వైల్డ్" .... అలా ఉందా ...!?

లారీతో బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు ...!

పవన్ ఆఫర్‌ను వద్దన్న గోపిచంద్.. తప్పు చేశాడంటున్న ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>