MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-adipurush431871ad-6be3-497c-acaa-f1230d660eba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-adipurush431871ad-6be3-497c-acaa-f1230d660eba-415x250-IndiaHerald.jpgఇటీవల గడచిన మూడు సీజన్స్ అనంతరం స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 అత్యద్భుత రేటింగ్స్ తో పాటు భారీ స్థాయి ప్రేక్షకాదరణ మరియు మంచి క్రేజ్ తో కొనసాగింది. కొద్ది రోజుల క్రితం ముగిసిన ఈ షోలో ఫైనల్ విన్నర్ గా అభిషేక్ దుద్ధాల నిలవగా రన్నరప్ గా అఖిల్ సార్థక్ నిలిచాడు. దాదాపుగా పదిహేను వారాలపాటు ఎంతో ఆసక్తికరంగా అందరినీ అలరించేలా కొనసాగిన ఈ సీజన్ యొక్క గ్రాండ్ ఫినాలే వేడుకకి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేసి సందడి చేశారు. ఇక ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి తనabhijeet duddala;bigg boss 4 telugu;chiranjeevi;nagarjuna akkineni;abhijith;abhishek;akhil akkineni;geum;apherald;tollywood;bigboss;media;2020;twitter;interview;winner;winner1;star maa;house;nijamన్యూ ఇయర్ రోజు అభిజీత్ షాకింగ్ పోస్ట్.....సోషల్ మీడియాలో వైరల్ .....!!న్యూ ఇయర్ రోజు అభిజీత్ షాకింగ్ పోస్ట్.....సోషల్ మీడియాలో వైరల్ .....!!abhijeet duddala;bigg boss 4 telugu;chiranjeevi;nagarjuna akkineni;abhijith;abhishek;akhil akkineni;geum;apherald;tollywood;bigboss;media;2020;twitter;interview;winner;winner1;star maa;house;nijamSat, 02 Jan 2021 01:00:00 GMTస్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 అత్యద్భుత రేటింగ్స్ తో పాటు భారీ స్థాయి ప్రేక్షకాదరణ మరియు మంచి క్రేజ్ తో కొనసాగింది. కొద్ది రోజుల క్రితం ముగిసిన ఈ షోలో ఫైనల్ విన్నర్ గా అభిషేక్ దుద్ధాల నిలవగా రన్నరప్ గా అఖిల్ సార్థక్ నిలిచాడు. దాదాపుగా పదిహేను వారాలపాటు ఎంతో ఆసక్తికరంగా అందరినీ అలరించేలా కొనసాగిన  ఈ సీజన్ యొక్క గ్రాండ్ ఫినాలే వేడుకకి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేసి సందడి చేశారు. ఇక ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి తన ఆకట్టుకునే హోస్టింగ్ టాలెంట్ తో షో కి మరింత క్రేజ్ తీసుకువచ్చారని చెప్పక తప్పదు.

ఇక హౌస్ లో మొదటి నుంచి తనదైన ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ తో కొనసాగిన అభిజిత్ మంచి మైండ్ గేమ్ తో అలానే ఆకట్టుకునే టాలెంట్ తో ప్రేక్షకులు అలానే అభిమానుల హృదయాలను గెలుచుకుని భారీ స్థాయి ఓట్లు దక్కించుకున్నాడు. నిజానికి షోలో భాగంగా మొత్తం సీజన్లో 14 వారాలపాటు ఎలిమినేషన్ జరుగగా అందులో దాదాపుగా 11 వారాలు అభిజిత్ ఆ జాన్లో నిలిచాడు. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు అతనికి ప్రేక్షకుల మద్దతుతో పాటు ఓటింగ్ కూడా విపరీతంగా రావడంతో సేఫ్ గా బయట పడ్డాడు. ఇకపోతే ఫైనల్ విన్నర్ గా నిలిచిన అనంతరం ప్రేక్షకులు అలానే అభిమానుల గురించి అభిజిత్ కొంత ఉద్వేగంగా మాట్లాడుతూ ఈ గెలుపు నిజంగా తాను ఊహించలేదని తాను ఇంట్లో అలానే బయట అందరితో ఎలా ఉంటానో అదే విధంగా బిగ్ బాస్ హౌస్ లో కూడా వ్యవహరించాననిచెప్పుకొచ్చాడు అభిజిత్. ఇక తనకి ఇంత భారీ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకాభిమానులకు తన జీవితాంతం రుణపడి ఉంటానని రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి ఒక్కరినీ కలుసుకునేలా పర్యటనలు చేస్తానని అభిజిత్ అన్నారు. ఇక ఆ తర్వాత హౌస్ నుండి బయటకు వచ్చిన అనంతరం పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్న అభిజిత్ నేడు నూతన సంవత్సరం సందర్భంగా పెట్టిన ఒక పోస్ట్ పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.  

2020 వ సంవత్సరాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేని ఊహించని విధంగా తనని బిగ్ బాస్ 4 షో విజేతగా నిలిపిన ప్రేక్షకులకు అభిమానులకు రాబోయే రోజుల్లో మరింత మంచి జరగాలని, మీ అందరూ నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలకు ఏమి ఇచ్చి మీరుణం తీర్చుకొను అంటూ కొంత ఎమోషనల్ గా పోస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటికే అభిజీత్ కి పలు సినిమాల ఆఫర్లు వచ్చాయని అతి త్వరలో వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా విడుదల కానున్నాయి అని అంటున్నారు. మొత్తంగా ఈ 2021 సంవత్సరం అభిజిత్ నామ సంవత్సరంగా అతడికి మరింత పేరు తెచ్చిపెడుతుందని పలువురు ఆయన అభిమానులు అభిప్రాయపడుతూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్ చేస్తున్నారు.....!!
" style="height: 852px;">




టీడీపీ కొత్త వ్యూహానికి జగన్ మార్క్ చెక్...!

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఎందుకంటే..

పవన్ కల్యాణ్‌తో మరోసారి త్రివిక్రమ్.. ఈసారి డైరెక్షన్ కాదట!

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. ఎంత జరిగాయంటే?

ఉగ్రవాద సంస్థలపై అగ్రరాజ్యం పంజా.. డబ్బులు అందకుండా ఆంక్షలు!

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>